Menu

Friday, February 26, 2016

ఆస్కార్‌ భామ ఎవరో..!

ఆస్కార్‌ బరిలో ఉత్తమ నటి విభాగంలో ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. ఎన్నో అంచనాలున్న నటీమణులకుకాక వూహించని విధంగా కొత్తవారికి నామినేషన్‌ దక్కడం ఆశ్చర్యపరిచింది. ఏడు నామినేషన్లు పొందిన నటితో తొలిసారి నామినేషన్‌ పొందిన భామలు పోటీపడుతుండటం విశేషం. ఈ నెల 28న ఆస్కార్‌ వేడుక జరగనున్న నేపథ్యంలో ఏయే నాయికలు ఏ చిత్రాలతో బరిలో ఉన్నారో చూద్దాం.

చార్లొట్‌ ర్యాంప్లింగ్‌: ఈ ఏడాది ‘45 ఇయర్స్‌’ చిత్రంతో ఉత్తమ నటిగా ఆస్కార్‌ బరిలో నిల్చొంది చార్లొట్‌ ర్యాంప్లింగ్‌. ఈమె కెరీర్‌లో ఇదే తొలి నామినేషన్‌. ఈ చిత్రంలో కేట్‌ మెర్సెర్‌ అనే మహిళ 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో వూహించని ఓ వార్త ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అప్పుడు ఆమె ఎలా ప్రతిస్పందించిందన్న అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తన పాత్రలో అద్భుతమైన నటనతో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుంది చార్లొట్‌.
కేట్‌ బ్లాంచెట్‌: ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో పోటీపడుతున్న వారిలో నామినేషన్ల విషయంలో అగ్రస్థానంలో ఉంది కేట్‌ బ్లాంచెట్‌. గతంలో ఆమె ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో మూడు చొప్పున ఆరు నామినేషన్లు సాధించింది. ఉత్తమ నటిగా ఓసారి, ఉత్తమ సహాయ నటిగా ఓసారి మొత్తం రెండు పురస్కారాలు దక్కించుకుంది. ఇప్పుడు ‘కరోల్‌’ చిత్రంతో ఏడో నామినేషన్‌ సాధించి బరిలో నిలిచింది. ఈ చిత్రంలో కరోల్‌ ఎర్డ్‌ అనే పాత్రలో ఒక బిడ్డకు తల్లిగా నటించింది బ్లాంచెట్‌. భర్త నిరాదరణతో ఆమె వేరే మహిళతో సన్నిహితంగా మెలుగుతుంటుంది. దీని వల్ల తన బిడ్డ తనకు దూరమవుతుందనే భయంతో సతమతమయ్యే తల్లిగా బ్లాంచెట్‌ మెప్పించింది. ఈ ఏడాది బ్లాంచెట్‌కు పురస్కారం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
సవోర్సె రోనన్‌: ‘బ్రూక్లిన్‌’ చిత్రంతో తొలిసారిగా ఉత్తమ నటి విభాగంలో పోటీ పడుతోంది సవోర్సె రోనన్‌. గతంలో ‘అటోన్‌మెంట్‌’తో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్‌ సాధించింది. అయితే పురస్కారం దక్కలేదు. ‘బ్రూక్లిన్‌’లో అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండ్‌ యువతిగా నటించింది రోనన్‌. కొత్త దేశంలో ఆమెకెదురైన అనుభవాలు, ప్రేమ, స్వదేశం తిరిగొచ్చాక జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. బరువైన పాత్రలో భావోద్వేగాలు పండించి శెభాస్‌ అనిపించింది రోనన్‌.
జెన్నిఫర్‌ లారెన్స్‌: ఈ సారి ఉత్తమ నటి పురస్కారం కోసం బరిలో ఉన్న వారిలో బ్లాంచెట్‌ తర్వాత అత్యధిక నామినేషన్లు పొందింది జెన్నిఫర్‌ లారెన్స్‌. గతంలో ఉత్తమ నటి విభాగంలో రెండు, ఉత్తమ సహాయ నటి విభాగంలో ఒకటి చొప్పున మొత్తం మూడు నామినేషన్లు సాధించింది జెన్నిఫర్‌. ఉత్తమ నటిగా ఓసారి పురస్కారం కైవసం చేసుకుంది. ఇప్పుడు ‘జాయ్‌’ చిత్రంతో నాలుగో నామినేషన్‌ దక్కించుకుంది. భర్తతో విడిపోయిన ముగ్గురు పిల్లల తల్లి జాయ్‌ మంగానో స్వశక్తితో కష్టాలను ఎలా అధిగమించిదన్నది ఇందులో చూపించారు. ఎన్నో గృహోపకరణాలను కనిపెట్టి ధనవంతురాలైన వ్యాపార వేత్తగా ఎదిగింది జాయ్‌. ఆమె పాత్రలో జెన్నిఫర్‌ ప్రశంసాపూర్వక నటన ప్రదర్శించింది.
బ్రీ లార్సన్‌: ‘రూమ్‌’ చిత్రంతో తొలిసారి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుని ఉత్తమ నటి విభాగంలో పోటీపడుతోంది బ్రీ లార్సన్‌. తన చిన్నారితో పాటు ఏడేళ్లు గృహనిర్బంధానికి గురై నరకయాతన అనుభవించే మా అనే తల్లి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తన బిడ్డ స్వేచ్ఛ కోసం పోరాడే తల్లిగా లార్సన్‌ ఆకట్టుకుంది. తమకు విముక్తి కలిగాక బిడ్డకు తొలిసారి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసే సన్నివేశాల్లో ఉత్తమ నటన కనబర్చింది. తన కృషికి పురస్కారం వస్తుందనే నమ్మకంతో ఉంది లార్సన్‌.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

ఒంటరిగా ఉండలేను!

ఒక మంచి కాఫీ తాగుతున్నప్పుడు పక్కనే నచ్చినవాళ్లు ఉంటే, కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. అది తియ్యని అనుభూతినిస్తుంది. అలాగే, మనసుకి నచ్చినవాళ్లతో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. కానీ, కొంతమంది ఒంటరి ప్రయాణాలను ఇష్టపడతారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ సోలో జర్నీని ఇష్టపడతారా? లేక సో మెనీ పీపుల్‌తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా? ఇదే విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే... ‘‘ఒంటరి ప్రయాణం నా వల్ల కాదండి బాబూ’’ అన్నారు. ఇంకా రకుల్ మాట్లాడుతూ - ‘‘నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం.

షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ, ఒంటరిగా వెళ్లడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఒంటరిగా వెళితే, నేను తిరిగి రానేమో..? అక్కడే చచ్చిపోతానేమో! నాకు జనాల మధ్య ఉండడం ఇష్టం. ఒకే గదిలో ఫ్రెండ్స్ మధ్య ఉండమంటే హ్యాపీగా ఉంటాను. అదే గనక ఒంటరిగా ఎంత అందమైన ప్రదేశానికి పంపించినా హ్యాపీగా ఉండలేను. సోలో జర్నీ సో బోరింగ్’’ అన్నారు. దీన్నిబట్టి రకుల్‌ది నలుగురితో కలిసిపోయే మనస్తత్వం అని అర్థమవుతోంది కదూ!

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్!

► రవాణా శాఖలో లీలలు
► నష్టపోయిన ఆర్టీవో సలీమ్
► దున్ను లేకపోవడమే కారణమా!

కాలం కలిసిరాకపోతే ఒక ఊరి రాజు మరో ఊరి బంటు కావచ్చు.. ఒక చోట పూలమ్మిన వ్యక్తి మరోచోట కట్టెలమ్మి బతకొచ్చు. ఓడలు బళ్లయి మూలకు చేరొచ్చు.. కానీ అవేవీ ఈ ఉన్నతాధికారి దయనీయ పరిస్థితికి సాటి రాకపోవచ్చు.. ఎందుకంటారా? అది తెలియాలంటే మీరిది చదవాల్సిందే. ఎంత అధికారయినా అయిన వారి అనుగ్రహం లేకుంటే ఎలా మూలన పడి దీనావస్థలో కొట్టుమిట్టాడాల్సి ఉంటుందో తెలుసుకోవాల్సిందే. పైవారి ఘటనల ఫలితంగా కొందరి పరిస్థితి ఎలా తారుమారవుతుందో తెలియాలంటే రవాణా శాఖలో జరిగిన ఈ లీలను అవగతం చేసుకోవాల్సిందే.

విశాఖపట్నం : మాధవధారలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారనుకోండి.. అక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ కేంద్రం గేటు దగ్గర ఓ కాపలాదారు కనిపిస్తారు. వాహనాల యజమానులు ఇష్టానుసారం లోనికి వెళ్లకుండా చూడడానికి, సందేహాలొస్తే తీర్చడానికి ఓ మామూలు కుర్చీలో కూర్చుని ఆయన పని చేస్తూ ఉంటారు. కూర్చున్న స్థలం బట్టి ఆయన ఓ మామూలు గేట్ కీపర్ అనుకున్నారనుకోండి.. మీరు బోల్తా కొట్టారన్నమాటే.. ఆయన విశాఖపట్నం ట్రాన్స్‌పోర్ట్ విభాగం రోడ్డు రవాణా అధికారి! నమ్మలేకపోయినా ఇది నిజం.

ఔనన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. నాన్ ట్రాన్స్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో గేటు కాపలాదారుగా ఉన్న ఆయన రెండేళ్ల కిందట రెండు పర్యాయాలుగా ఆర్నెల్లు విశాఖ జిల్లాకు ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్(డీటీసీ)గా పని చేశారు! మూడేళ్లు అనకాపల్లి ఆర్టీవోగా పనిచేశారు! రోడ్డు రవాణా కార్యాలయంలో జరిగిన విచిత్ర సంఘటనలతో ఇప్పుడిలా గేటు దగ్గరకు చేరారు.

వింత మలుపు
చాలా మంది ఉద్యోగుల్లా సుమారు పాతికేళ్ల కిందట మహ్మద్ సలీమ్ సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)గా కెరీర్ ప్రారంభించారు. పదోన్నతితో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అయ్యారు. తర్వాత ఆర్టీవో స్థాయికి ఎదిగారు. పదోన్నతి ప్రకటిస్తే డీటీసీ అయ్యేవారే. కానీ ఇక్కడే కథ అనుకోని మలుపు తిరిగింది.  గతేడాది అనకాపల్లి కార్యాలయంలో ఆర్టీవోగా పనిచేస్తున్న సమయంలో  ఓ అక్రమం జరిగినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.

 అక్కడ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో డ్రైవింగ్ లెసైన్స్‌లు మంజూరయినట్టు  ఓ వ్యక్తి రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన విజిలెన్స్ విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువయ్యాయి. దాంతో పరిపాలన అధికారి (ఏవో)ను, సీనియర్ అసిస్టెంట్‌ను, జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. కార్యాలయ అధికారిగా బాధ్యత ఉందంటూ ఆర్టీవో సలీమ్‌ను కూడా సస్పెండ్ చేశారు.

 నెల తిరక్కుండానే పరిపాలన అధికారి, క్లర్క్‌లు మళ్లీ ఉద్యోగాలు పొందారు. కానీ ‘ఎంచేతో’ ఆర్టీవో సలీమ్‌కు పోస్టింగ్ ఇవ్వడానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైతేనేం పోస్టింగ్ దక్కింది. అనకాపల్లి ఆర్టీవోగా కాకుండా డీటీసీ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్ ఆర్టీవోగా నియమించారు. కానీ హోదా అట్టేపెట్టి ఆయన్ను గేటు వద్ద విధులు నిర్వర్తించాలని నిర్దేశించారు.
పేరుకు ఆర్టీవో అయినా ప్రాధాన్యం లేని పోస్టింగ్ కల్పించారు. దాంతో ఒకప్పుడు ఇన్‌చార్జి డీటీసీగా పనిచేసిన అధికారి విలువ లేకుండా మిగిలారు. ఈ వ్యవహారంలో కొందరు కుట్ర చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పలుకుబడి లేకపోవడం, మైనార్టీ వర్గానికి చెందిన అధికారి కావడంతో ఇలా జరిగి ఉంటుందని ఉద్యోగులు సానుభూతి వ్యక్తం చేస్తున్నా.. సలీమ్ స్థితి మార్చగలిగేవారెవ్వరు?

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

టుడే అప్‌డేట్స్‌...?

నేడు, రేపు బెంగళూరులో జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ బృందం పర్యటన. బెంగళూరు కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం
న్యూఢిల్లీలో నేడు కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు
సిరియాలో శాంతి నెలకొల్పడంలో భాగంగా మార్చి7న చర్చస్తామని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి
నేడు నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. కృష్ణపట్నం సమీపంలోని జెన్ కో విద్యుత్ ప్లాంటు జాతికి అంకితం

అనంతపురం: రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలు
ఆసియా కప్ టీ20: మీర్పూర్ లో నేడు భారత్, పాక్ ల మధ్య రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
నేడు కర్ణాటక, బెల్గావీలో రైతుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని నరేంద్రమోదీ
జేఎన్ యూ వివాదం: నేటితో ముగియనున్న ఊమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచర్యల పోలీస్ కస్టడీ
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, ఐదుగురి మృతి. కాల్పులు జరిపి ఓ గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించిన అధికారులు

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

తల్లితో నటి తనూష లొల్లి

♦ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీనటి తనూష తల్లి ఫిర్యాదు
♦ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు..డబ్బు కోసమే ఆరోపణలు: తనూష

 హైదరాబాద్: గుంటూరుకు చెందిన యువ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ పల్సర్ తన కూతురును కిడ్నాప్ చేశారని సినీనటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. అయితే,  డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతోనే తల్లే.. రాద్ధాంతం చేస్తోందంటూ స్వాతి పేర్కొంది. స్వాతి మూడేళ్ల నుంచి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోందని, ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం శ్రీనివాస్‌రెడ్డి పరిచయమయ్యారని, అప్పటి నుంచి కూతురి ప్రవర్తన మారి పోయిందని, పలు రకాలుగా లోబర్చుకున్నారని, ఆయనకు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని నాగేంద్రమ్మ పేర్కొంది.

ఈ నెల 25న అర్ధరాత్రి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటికి వచ్చి స్వాతిని కిడ్నాప్ చేశారని, తన కూతురును రక్షించి అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసుకొని శుక్రవారం విచారిస్తున్న పోలీసుల ముందు స్వాతిరెడ్డి ప్రత్యక్షమైంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనంతట తానే వెళ్లిపోయానని పోలీసులకు వివరించింది. శ్రీనివాస్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని, డబ్బులు ఇవ్వకపోవడంతో లేనిపోని ఆరోపణలు చేస్తోందని తల్లిపైనే ఫిర్యాదు చేసింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లెజెండ్, ప్రెజెంట్ లవ్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటిం చానని, పారితోషికం తెచ్చి ఇవ్వలేదన్న కోపంతోనే ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నాగేంద్రమ్మ, స్వాతి పరస్పర ఆరోపణలతో స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. రూ.15 లక్షలు ఇవ్వలేదన్న కారణంగా కన్న కూతురుపైనే అభాండాలు వేస్తున్నావా అంటూ స్వాతి తల్లిపై దాడికి పాల్పడింది. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీ సులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

గ్యాంగ్ రేప్ చేసి.. నిప్పు పెట్టారు...?

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలిక (14)ను సామూహిక అత్యాచారం చేసి, నిప్పు పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.

7వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి శుక్రవారం స్వగ్రామం నుంచి దగ్గరలోని శివన్ పట్టణానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఊరు దాటిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై కిరోసిన్ పోసి అంటించి పరారయ్యారు. బాధితురాలు సాయం చేయాల్సిందిగా కేకలు వేస్తూ చెరుకుతోటలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

యాపిల్ పై శాంసంగ్ దే పైచేయి!

వాషింగ్టన్: ప్రముఖ ముబైల్ తయారీ సంస్థ యాపిల్ పై పోరులో దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పైచేయి సాధించింది. 825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో శాంసంగ్ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదంటూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. యాపిల్ సంస్థ తన యాప్స్ ను శాంసంగ్ కాపీ కొట్టిందని, యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ చేసిన ఫెడరల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో యాపిల్ పటీషన్ ను కొట్టిపారేసింది.

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించింది. యాపిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో పాటు.. శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని పిటిషన్ వేసిన ఐఫోన్ సంస్థకు ఝలక్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత శాంసంగ్ ప్రతినిధి మాట్లాడుతూ... పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాపిల్ ఖండించింది. యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా ముబైల్ టెక్నాలజీలో పోటీ పడుతున్నాయి. గత డిసెంబర్‌లో ఇదే విధంగా మరో పేటేంట్ విషయంలో దాఖలైన కేసులో యాపిల్‌కు దాదాపు 3,770 కోట్ల రూపాయలు సమర్పించుకుంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

అతి వ్యాయామంతో గుండెకు చేటు

పరిపరి  శోధన
ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి, తీరైన శరీరాకృతికి, మంచి ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు సలహా ఇస్తుంటారు. వ్యాయామం ఒంటికి మంచిదే గానీ, అతిగా చేస్తే మాత్రం గుండెకు చేటు తెచ్చిపెడుతుందని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
శక్తి మేరకు మాత్రమే ఒక క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలని, అలా కాకుండా అతిగా వ్యాయామం చేస్తే గుండె లయలో అనూహ్యమైన మార్పులు తలెత్తి, గుండె పనితీరును దెబ్బతీస్తాయని, దీనివల్ల ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు తలెత్తే అవకాశాలూ ఉంటాయని మెల్‌బోర్న్‌లోని హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

70 ఆస్తుల వివరాలను దాచి పెట్టారు

♦ అగ్రిగోల్డ్ వ్యవహారంలో బయటపడ్డ కొత్త విషయం
♦ హైకోర్టుకు నివేదించిన సీఐడీ అధికారులు
♦ విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం
♦ దాచిన ఆస్తులను వెంటనే జప్తు చేయండి
♦ సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం
♦ విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ యజమానులు రూ.కోట్ల విలువైన 70 ఆస్తుల వివరాలను కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టినట్లు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. ఇప్పటికే కోర్టు ముందుంచిన ఆస్తుల వివరాలు కాక మరో 70 ఆస్తుల గురించి యజమానులు కస్టోడియల్ విచారణలో వెల్లడించారన్నారు.దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము అగ్రిగోల్డ్ యజమానులను మొదటి నుంచీ సందేహిస్తూనే ఉన్నామని, అందుకే వారి అరెస్ట్ గురించి పదే పదే చెప్పామని వ్యాఖ్యానించింది. ఆస్తుల వివరాలను దాచిపెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టును మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో యాజమాన్యం వెల్లడించి న ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. వెల్లడించకుండా దాచిన ఆస్తులు మరిన్ని ఉండే అవకాశం ఉందని, అందువల్ల నిందితులను పూర్తి స్థాయిలో విచారించాలంది. ఈ 70 ఆస్తులను వెంటనే జప్తు చేయాలని, వెంటనే దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో సమాచార మార్పిడి చేసుకోవాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
 భారీగానే నిధుల మళ్లింపు
నిధుల మళ్లింపు వ్యవహారంలో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.10కోట్లు మళ్లించారని ఆంధ్రప్రదేశ్ ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ బదులిచ్చారు. అది చాలా చిన్న మొత్తమని, భారీగా నిధుల మళ్లింపు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది.
 ఇప్పటికైనా వివరాలన్నీ చెప్పండి
‘‘ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పటివరకు వెల్లడించని ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోర్టు ముందుం చండి’’ అని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ధర్మాసనం సూచించింది. సహారా కేసులో ఏం జరిగిందో మర్చిపోవద్దని గుర్తు చేసింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ... ఏపీ సీఐడీ నుంచి తమకు సహకారం అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీన్ని ఏపీ అదనపు ఏజీ ఖండించారు. ధర్మాసనం స్పందిస్తూ... పోట్లాటలు మాని, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించింది. హైదరాబాద్‌లోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయాన్ని రూ.25 కోట్లకు వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంకు ప్రకటన జారీ చేసిందని  పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా... ఆ వివరాలు తమ ముందుం చాలని ధర్మాసనం ఆదేశించింది.
వేలానికి ఎక్కువ  స్పందన వచ్చేలా చర్యలు
సామాన్య ప్రజల  నుంచి అగ్రిగోల్డ్ యాజ మాన్యం రూ.వేల కోట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు, మరికొందరు హైకోర్టులో పిల్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ భూముల వేలం పర్యవేక్షణ కమిటీ తరఫున న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. వేలానికి ఎక్కువ స్పందన వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. కమిటీ నిర్ణయాలను లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

అగ్రిగోల్డ్ ఆస్తులను దోచేశారు!

యాజమాన్యంతో కుమ్మక్కై భూములు కొల్లగొట్టిన ప్రజాప్రతినిధులు
  హైదరాబాద్: చిరుద్యోగులు, సామాన్య ప్రజలు.. పైసా పైసా కూడబెట్టుకున్నారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. జనం సొమ్ముతో అగ్రిగోల్డ్ యాజమాన్యం వేలాది ఎకరాలను కొనుగోలు చేసింది. ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. చివరకు డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికైతే భూములను, ఆస్తులను అమ్మి డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించాలి. మరి విక్రయించడానికి ఆ భూములన్నీ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతుల్లోనే ఉన్నాయా? లేవనే సమాధానం చెప్పక తప్పదు. (చదవండి: 70 ఆస్తుల వివరాలు దాచిపెట్టారు)

నేతల గుప్పిట్లోకి విలువైన భూములు
డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైన ప్రభుత్వ కీలక నేతలు ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ఎప్పుడో కాజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆస్తులను జప్తు చేస్తారన్న సమాచారం అందుకున్న ఓ కేంద్ర మంత్రి, కొందరు రాష్ట్ర మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అగ్రిగోల్డ్ ఆస్తులను అందినకాడికి దోచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి సరిగ్గా 32 రోజుల ముందు 14.81 ఎకరాల భూమిని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంతం చేసుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో 156.92 ఎకరాలను ఓ కేంద్ర మంత్రి తన అధీనంలోకి తీసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను కీలక ప్రజాప్రతినిధులు, నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. ఆస్తులను జప్తు చేయడానికి ముందే అగ్రిగోల్డ్ ఆస్తులను 70 మంది పేర్లపై బదలాయించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు తార్కాణం.

ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులకు మినహాయింపు
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు పదే పదే హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ ఆస్తులపై కన్నేశారు. ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితుడైన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని లొంగదీసుకున్నారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో 83.15 ఎకరాల్లో విస్తరించిన రూ.415 కోట్లకుపైగా విలువ చేసే ‘హాయ్‌ల్యాండ్’ను ఆ సంస్థ నుంచి చేజిక్కించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు తీరును హైకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానం నాలుగుసార్లు మొట్టికాయలు వేయడంతో చేసేది లేక ఇతర రాష్ట్రాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను మినహాయించి, ఏపీలో ఆ సంస్థకు చెందిన 16,587.81 ఎకరాలను ప్రభుత్వం జప్తు చేసింది.

అరెస్టులు చేయకుండా ఒత్తిళ్లు
అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం మేరకు వారిని కేసుల బారి నుంచి రక్షించి.. ఆ సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ కేసులో సీఐడీ  దర్యాప్తు చేయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. సీఐడీ తీరుతో విసుగెత్తిపోయిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి, బ్యాంకు ఖాతాలను జప్తు చేసి, ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని గతేడాది ఫిబ్రవరిలో సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ యాజమానులు విచారణకు సహకరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ కీలక నేతల ఒత్తిడి మేరకే అగ్రిగోల్డ్ యాజమాన్యం అరెస్టులో జాప్యం చేశారని డిపాజిటర్లు ఆరోపించారు. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా, అగ్రిగోల్డ్ ఆస్తులను 2015 ఫిబ్రవరి 20న జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వందలాది ఎకరాలు పరాధీనం

► అగ్రిగోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆస్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
► ఆస్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిస్థాయి డెరైక్టర్ కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరుతో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం గురిజేపల్లిలో 104/1, 104/2, 104/3, 104/4, 104/5, 104/6, 103/2, 101/1 సర్వేనెంబర్లలో 14.81 ఎకరాల భూమి ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కళ్లు పడ్డాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి  సరిగ్గా 32 రోజుల ముందు.. అంటే 2015 జనవరి 19న ఆ భూమిని తన భార్య ప్రత్తిపాటి తేనే వెంకాయమ్మ పేరుతో ఎకరం రూ.4.04 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఆ భూములను అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ప్రత్తిపాటి సొంతం చేసుకున్నారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు.
► సీఆర్‌డీఏ పరిధిలో కృష్ణా జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంలో 110.65 ఎకరాలు, వీరులపాడు మండలం చత్నవరంలో 56.27 ఎకరాలు.. మొత్తం 166.92 ఎకరాల భూమిపై ఓ కేంద్ర మంత్రి కన్ను పడింది. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై ఆ భూమిని తన అధీనంలోకి తీసుకున్నారు.
► కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన వందలాది ఎకరాలను అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సొంతం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టడం ముగిశాక సంస్థ భూములను జప్తు చేస్తూ 2015 ఫిబ్రవరి 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదుగురే అరెస్టు

హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్దిరోజుల క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుతోసహా ఐదుగురిని అరెస్టు చేశారు. మరో తొమ్మిది మందికిపైగా డెరైక్టర్లను ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థ డెరైక్టర్ కనుకొల్లు ఉదయ్ దినకర్‌ను కూడా అరెస్టు చేయలేదు. ఆయన నుంచే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములు దక్కించుకోవడం గమనార్హం. ఓ కేంద్ర మంత్రి ఒత్తిడి మేరకు అగ్రిగోల్డ్‌కు చెందిన ఇద్దరు కీలక డెరైక్టర్లను సీఐడీ అరెస్టు చేయడం లేదని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. వారు సంస్థ ఆస్తులను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

How to backup or restore blogger templates...?

Blogger provides XML templates and you will find tonnes of third party templates on the internet. You might also want to tweak the templates to change the way how your blog looks. Before you make any changes to your template, it might always be a good idea to take a backup of your template. This will allow you to restore it back in case the template edit did not go well. Backing up restoring templates on blogger is very simple using the new Blogger interface. In this tutorial, we will guide you through the process.

How to take a backup of your Blogger Template

Like we said earlier, it's always a good idea to backup your template before you make any changes to your Blog's template. Below are the simple steps which can help you in taking a backup of your blogger template.
1. Login to your blogger account, and go to the Template section in the blogger dashboard(for that blog)

4. You will get a backup XML file with the name template-somenumber.xml . Keep this backup file safe so that you can restore it when required.

How to restore the Blogger template from a previous backup

In case you have made some changes to the template and that has messed up the way your blog looks, you can restore the old template from the backup file which you might have created. Below are the steps to restore the template from a previous backup.
1. Login to your blogger account, and go to the Template section in the blogger dashboard(for that blog)

Once the upload is complete, your old template should be back in action

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

పోలీస్ స్టేషన్ కు నటి స్వాతిరెడ్డి ప్రేమ పంచాయితీ!

హైదరాబాద్ : వర్థమాన నటి స్వాతిరెడ్డి ప్రేమ పంచాయితీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరింది. తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆమె తల్లి నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తన కుమార్తెకు మాయమాటలు చెప్పి తీసుకు వెళ్లినట్లు నాగేంద్రమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శ్రీనివాసరెడ్డికి గతంలోనే వివాహం అయినట్లు తెలిపింది. కాగా స్వాతిరెడ్డి  'లవ్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
              మరోవైపు తాను ఎక్కడికి తప్పిపోలేదని, ఇష్టపూర్వకంగానే ఇంట్లోనుంచి వెళ్లిపోయినట్లు స్వాతిరెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. తల్లికి, తనకు ఆర్థిక లావాదేవీల్లో గొడవలు ఉన్నాయని, అయితే ఇప్పుడు అన్ని సమస్యలు సమసిపోయినట్లు ఆమె చెప్పింది. తనకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని తెలిపింది. డబ్బు కోసం తల్లి.. తనను చాలాసార్లు వేధించినట్లు స్వాతిరెడ్డి  చెప్పింది. అయితే తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని ఆమె చెప్పింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని,  పెళ్లయిన వ్యక్తితో తనకేమీ అవసరమని స్వాతి ప్రశ్నించింది.
కాగా  పోలీస్ స్టేషన్ కు వచ్చిన స్వాతిరెడ్డి, నాగేంద్రమ్మ... పోలీసుల ఎదుటే కొట్లాటకు దిగారు. దీంతో పోలీసులు వారిద్దర్నీ విడదీసి తల్లీకూతుళ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Venkata Sai Group Coaching Centre in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Turning Point Coaching Centre in Kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Chennai Pet Shop in kadapa

OM Sree Decors in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

G tel HIgh Speed Broadband in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

TEKLEAD Training and development in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

khwaja suzuki show room in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Star opticals in kadapa

shri ram chits in kadapa

SLN Digital Shoppy in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

new sk auto mobiles in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

sekhar opticals in kadapa

sathyam agencies in kadapa

sah wheels in kadapa

sree lakshmi narasimha net cafe in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

mdh byking workd in kadapa

sr digital photos and videos in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

lakshya acadamy in kadapa

bhavya sri fashion designers in kadapa

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

కాజల్ పెళ్లి వార్త... ఎవరితో అనుకుంటున్నారు..?

దశాబ్దకాలంగా నటిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కలువకళ్ల పిల్ల కాజల్ పెళ్లాడిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. కానీ అది నిజమైన పెళ్లి కాదు...పవర్ స్టార్ సరసన ‘సర్దార్’లో నటిస్తున్న ఈ అమ్మడుకి రామోజీఫిలింసిటీలో పెళ్లి సీన్ జరిగిందట. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో పవన్, కాజల్ వివాహం జరిగే సన్నివేశం చిత్రీకరించారట. ‘గబ్బర్ సింగ్’లో శృతిని పెళ్లాడే సీన్‌లానే సర్దార్‌లోనూ పవన్, కాజల్ మధ్య పెళ్లి సీన్ తెరకెక్కించారని సమాచారం. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు టాకీపార్ట్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రానికి రెండు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఆ రెండు పాటల కోసం చిత్రయూనిట్ యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుని... ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, కబీర్‌సింగ్, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీ రాయ్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, వేణు, రఘుబాబు వంటి భారీ తారాగణంతో రూపొందుతోంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

రింగింగ్‌ బెల్స్‌ ముంచింది

న్యూఢిల్లీ : రూ.251కే ‘ఫ్రీడం 251’ 3జి స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఊదరగొట్టిన రింగింగ్‌ బెల్స్‌ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ తమను కూడా మోసం చేసిందని ఆ కంపెనీకి కాల్‌ సెంటర్‌ సేవలు అందించిన ‘సైఫ్యూచర్‌’ అనే బిపిఒ కంపెనీ ఆరోపించింది. ఇప్పటి వరకు తాము అందించిన కాల్‌ సెంటర్‌ సేవలకు పైసా కూడా చెల్లించకుండా ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు రింగింగ్‌ బెల్స్‌ ప్రకటించడాన్ని సైఫ్యూచర్స్‌ కంపెనీ సిఇఒ అనూజ్‌ భారతి తప్పు పట్టారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

రాంగోపాల్ వర్మ అరెస్ట్.?

కృష్ణా: డైరక్టర్ రాంగోపాల్ వర్మ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టు దగ్గర హైడ్రామా నడిచింది. ఎయిర్‌పోర్టులోనే వర్మను అరెస్ట్‌ చేశారని అభిమానులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అరెస్ట్ విషయాన్ని ధృవీకరించలేదు. అరెస్ట్ చేయాల్సిన అవసరం మాకేంటని పోలీసులు చెప్పారు. వర్మను అడ్డుకునేందుకు మరో గ్రూపు వచ్చిందని అభిమానులు చెబుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేస్తున్నారంటూ వర్మ వ్యతిరేకులు చెబుతున్నారు.

వర్మ రాకతో అభిమానులు పెద్దఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. డేర్ అండ్ డాషింగ్ డైరక్టర్ వర్మ అంటూ అభిమానులు బ్యానర్లు కట్టారు. స్టూడెంట్లు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకెళ్లి ఆహ్వానించారు.

కాగా వర్మ..వంగవీటి  రత్నకుమారి, రాధాకృష్ణ,  దేవినేని కుటుంబీకులను కలుస్తారు. వంగవీటి రంగా గురించి విషయాలు తెలుసుకోనున్నారు. అయితే రాధాకృష్ణ మాత్రం తనతో ఇంత వరకు సంప్రదించలేదని చెబుతున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

భారత్, పాక్ ఉత్కంఠ పోరుకు రెడీ

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ అమితాసక్తి. ఏ ఈవెంట్ అయినా.. ఏ వేదిక అయినా.. ఫార్మాట్ ఏదైనా.. దాయాది జట్లు తలపడుతుంటే చాలు అభిమానులు టీవీల ముందు వాలిపోతారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్ల ఉత్కంఠ పోరుకు మరోసారి తెరలేవనుంది. ఆసియా కప్ లో భాగంలో ఢాకాలో శనివారం జరిగే మ్యాచ్ లో భారత్, పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో భారత్.. ఆతిథ్య బంగ్లాదేశ్ ను ఓడించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పై కూడా ఇదే జోరు కొనసాగించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. కాగా ఈ టోర్నీలో పాక్ కు ఇదే తొలి మ్యాచ్. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే బ్యాటింగ్ లో టీమిండియా, బౌలింగ్ లో పాక్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. అయితే భారతే ఫేవరేట్ గా కనిపిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల పాటు నిషేధానికి గురై.. మళ్లీ జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

ఆసియా కప్ లో ఓవరాల్ గా భారత్ ఐదు సార్లు విజేతగా నిలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే కప్ అందుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు పది సార్లు తలపడగా, చెరో ఐదు సార్లు గెలిచాయి. ఈ టోర్నీని ఈసారి టి-20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 7 గంటల నుంచి భారత్, పాక్ ల మ్యాచ్ జరగనుంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

హల్ చల్ చేస్తున్న లులియా- సల్మాన్ ఫోటో

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రియురాలు  లులియా వాంటర్  సన్నిహితంగా ఉన్నఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.  రొమేనియన్  ముద్దుగుమ్మ  లులియా, సల్మాన్ ను ముద్దాడుతున్న  ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో వీళ్లిద్దరు కలిసినపుడు  ఈ ఫోటో చిక్కినట్టు సమాచారం. ఈ మధ్య సల్మాన్ ఖాన్   త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తల  నేపథ్యంలో  ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇటీవల చాలా సందర్భాలలో సల్మాన్, లులియా కలిసి దర్శనమిచ్చిన వార్తల్లో నిలిచారు.

మరోవైపు  రొమానియన్ రియాల్టీ షోలో లులియా  పాల్గొన్న  వీడియోనొక దాన్ని  సల్మాన్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతేకాదు.. తనకు కూడా ఇలాంటి షో చేయాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.  అంతకుముందు ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే.  ఆ వయసు  దాటేసాను. కానీ పిల్లల్ని కనాలని ఉంది.. ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఓ ఇంటర్యూలో చెప్పాడు.  కాగా  టాప్ హీరోయిన్లతో  ప్రేమాయణం నడిపినా  కథ మాత్రం పెళ్ళి పీటల దాకా వెళ్ళలేదు. ప్రసుతం రోమానియా నటి లులియా వాంటర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఉన్నా,  సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

బిగ్ బీకు వైద్య పరీక్షలు

ముంబై: అనారోగ్యం నుంచి కోలుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమితాబ్ ఈ విషయాన్ని ట్విటర్ లో వెల్లడించారు.

'కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. విశ్రాంతి తీసుకోవాలి. మళ్లీ కలుస్తా..’ అని బిగ్ బీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ ‘టీఈ3ఎన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రిబు దాస్‌గుప్తా తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు విద్యాబాలన్, నవాజుద్ధీన్ సిద్ధిఖి నటిస్తున్నారు. 

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ

హైదరాబాద్‌ :
అఫ్జల్‌గంజ్‌లో శుక్రవారం రామ్‌రాజ్ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సుమారు రూ. 3 కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ విషయమై చందాదారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

ప్రేయసి భర్త నుంచి తప్పించుకోబోయి..

ఆమె అతడికి మాజీ ప్రేయసి. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటోంది. కానీ, మాజీ ప్రేమికుడితో మాత్రం బంధాన్ని తెంచుకోలేదు. భర్త ఇంట్లో లేని ప్రతిసారి ప్రియుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తోంది. కానీ, అనుకోకుండా ప్రేమికుల రోజు వారి పాలిట శాపంగా మారింది. ఆ రోజు భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా అనూహ్యంగా భర్త రావడంతో వారిద్దరి గుండెలు ఆగిపోయాయి. అప్పటికే ఒంటిపై నూలుపోగు కూడా లేని ఆ ప్రేమికుడు ఆమె భర్త నుంచి తప్పించుకొని మూడో అంతస్తులోని ఫ్లాట్ కు ఉన్న కిటికీలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.

తన పరువు విషయం పక్కన పెట్టి నగ్నంగానే పైపు పట్టుకొని మెల్లగా కిందికి దిగడం ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు పట్టుకోల్పోయి అక్కడి నుంచి కిందపడ్డాడు. దాంతో అప్పటికే అతడి బాగోతం మొత్తాన్ని నోరెళ్లబెట్టి వీడియోలు తీస్తున్న వారు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడు గాయాలతో బతికి బట్టకట్టాడు. ఈ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ఇప్పుడది సంచలనం సృష్టిస్తోంది.