Menu

Friday, January 29, 2016

మగవారి ముద్దు ఫోటోతో ....?


ఇస్లామాబాద్: పురుషులిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో.. ముద్రించకుండా ఖాళీగా వదిలేసిన స్థానిక యాజమాన్యం..దీంతో ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ పై మరోసారి చర్చ. ముందు పేజిలో ఖాళీ స్థలంతో ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్ ను శుక్రవారం ప్రచురించడంతో వివాదానికి తెర లేపింది. ఇంటర్ నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కు అనుబంధంగా పాకిస్తాన్ లోని స్థానిక పత్రిక ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నడుస్తోంది.

చైనాలో ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్ ను ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ కు పంపింది. ఆ ఆర్టిక్టల్ తో పాటూ చైనాలోని ఓ యువకుడు మరో పురుషుడికి చెంపపై ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను ప్రచురించాలి. కానీ, ఆ ఆర్టికల్ మాత్రమే ప్రచురించి ఆ ఫోటో స్థానాన్ని ఖాళీగా వదిలేశారు. అది కూడా ముందు పేజీలో. దీంతో న్యూయార్క్ టైమ్స్ పాఠకులు ఉదయం లేచి చూడగానే పేపర్ ముందు పేజీలో బ్లాంక్ గా కనిపించింది. 'పాకిస్థాన్ లోని మా ముద్రణ భాగస్వామి ఆ ఫోటోను తొలగించారు. ఫోటోను తీసివేయడం వెనక ఎడిటోరియల్ స్టాఫ్ కు ఎలాంటి ప్రమేయం లేదు' అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఆ ఫోటో ప్రచురిస్తే స్థానికంగా ఇబ్బందులు తలెత్తేవని ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ కమల్ సిద్దికీ తెలిపారు. పురుషులు ముద్దు పెట్టుకునే ఫోటోలను పాకిస్తాన్ లో మీరు ఎక్కడా చూడరు. పురుషులే కాదు ఎవరైనా ముద్దు పెట్టుకునే ఫోటోలు ఎక్కడా కనిపించవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పంపిన మరో ఆర్టికల్ ను కూడా ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ సెన్సార్ చేసింది. బంగ్లాదేశ్ లోని కొన్ని అతివాద సంస్థలకు సంబంధించిన ఆ ఆర్టికల్ లో దైవ దూషణ వ్యాఖ్యలు ఉండటం వల్ల దాన్ని సెన్సార్ చేసినట్టు న్యూయార్క్ ట్రైమ్స్ పబ్లిక్ ఎడిటర్ మార్గరేట్ సల్లీవన్ తెలిపారు. డిజిటల్ యుగంలో కూడా పత్రికలు బ్లాంక్ పేజీలు ప్రచరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు అని మార్గరేట్ అభిప్రాయపడ్డారు.

అయితే ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ సిద్దికీ తన పని తీరు పై ఈ మెయిల్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు...ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్థాన్ లోని జర్నలిస్ట్ లను తరచుగా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని దేశంలో ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, 2014లో తమ సంస్థలోని ముగ్గురు జర్నలిస్ట్ లను తీవ్రవాదులు హత్య చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సెన్సార్ చేయడాన్ని మీకన్నా ఎక్కువగా నేనే ఖండిస్తున్నాను. కానీ, ఇక్కడి స్థానిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఇస్లాం భావజాలానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్, కార్టూన్స్, ఫోటోలను ప్రచురించినందుకు 2001 నుంచి ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్ట్ లు హత్యకు గురయ్యారు. ఇస్లాంను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాల్లో స్వలింగ సంపర్కంపై అంతగా అవగాహన లేదు. 2011లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు  ట్రాన్స్ జెండర్ జనభాను అధికారికంగా గుర్తించింది. వారికి ప్రస్తుతం ఓటు హక్కును కూడా కల్పించారు.

కొత్త అధ్యాయం....?


ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం
2-0తో టి20 సిరీస్ కైవసం
రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన

మెల్‌బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం...

మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం సిడ్నీలో జరుగుతుంది.
 
సూపర్ భాగస్వామ్యం: తొలి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయారు. బంతి ఎలాంటిదైనా బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. ఏడో ఓవర్‌లో ఫాల్క్‌నర్ సంధించిన బౌన్సర్‌ను ధావన్ సిక్సర్‌గా మల్చడం అతని బ్యాటింగ్‌కే హైలైట్. లయోన్, మ్యాక్స్‌వెల్‌లకు రోహిత్ సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసిన భారత్... 11.2 ఓవర్లలో 100 పరుగులను అందుకుంది. తొలి వికెట్‌కు 97 పరుగులు జత చేశాక ధావన్ రివర్స్ స్వీప్‌తో అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన కోహ్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. 13వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు.

ఓవర్‌కు 9 పరుగుల చొప్పున రాబట్టిన కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. 16వ ఓవర్‌లో రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని (14) వేగంగా ఆడాడు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లితో కలిసి ధోని మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు.
 
ఫించ్ పోరాడినా...: లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, మార్ష్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చారు. బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ దూసుకుపోయింది. దీనికి తోడు 9, 10 ఓవర్లలో ఫించ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఉమేశ్, రిషి ధావన్, శిఖర్ ధావన్‌లు జారవిడిచారు. అయితే 10వ ఓవర్‌లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పాండ్యా చక్కగా అందుకోవడం, ఆ వెంటనే తన బౌలింగ్‌లో లిన్ (2)ను వెనక్కిపంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫించ్, మార్ష్‌లు తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగులు జోడించారు.

12వ ఓవర్‌లో ‘డేంజర్ మ్యాన్’ మ్యాక్స్‌వెల్ (1)ను ధోని స్టంప్ చేశాడు. తర్వాత ఫించ్‌తో జత కలిసిన వాట్సన్ (15) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా కుదురుకోనీయలేదు. 15వ ఓవర్‌లో కళ్లు చెదిరే రీతిలో రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ఆసీస్ స్కోరు 124/4గా మారింది. తర్వాతి ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్ నుంచి జడేజా విసిరిన బంతికి ఫించ్ రనౌట్ కావడంతో కంగారులు కుదేలయ్యారు. విజయానికి 61 పరుగులు చేయాల్సిన దశలో జడేజా మరోసారి మ్యాజిక్ చూపెట్టాడు. 17వ ఓవర్‌లో ఫాల్క్‌నర్‌ను అవుట్ చేస్తే... చివరి ఓవర్‌లో బుమ్రా యార్కర్లతో హాస్టింగ్స్ (4), టై (4)లను వెనక్కి పంపి చిరస్మరణీయ విజయాన్ని పూర్తి చేశాడు.

1
ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు 2007-08లో ముక్కోణపు సిరీస్, 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు.
 
స్కోరు వివరాలు:-
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 60; ధావన్ (సి) లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 42; కోహ్లి నాటౌట్ 59; ధోని (సి) వాట్సన్ (బి) టై 14; రైనా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184.
వికెట్ల పతనం: 1-97; 2-143; 3-181.
బౌలింగ్: వాట్సన్ 3-0-17-0; హాస్టింగ్ 3-0-35-0; బోలాండ్ 4-0-30-0; ఫాల్క్‌నర్ 3-0-35-0; టై 4-0-28-1; లయోన్ 1-0-15-0; మ్యాక్స్‌వెల్ 2-0-17-1.
 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ రనౌట్ 74; మార్ష్ (సి)  హార్డిక్ పాండ్యా  (బి) అశ్విన్ 23; లిన్ (సి) ధోని (బి)  హార్డిక్ పాండ్యా 2; మ్యాక్స్‌వెల్ (స్టంప్) ధోని (బి) యువరాజ్ 1; వాట్సన్ (సి అండ్ బి) జడేజా 15; వేడ్ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ (స్టంప్) ధోని (బి) జడేజా 10; హాస్టింగ్స్ (బి) బుమ్రా 4; టై (బి) బుమ్రా 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-94; 2-99; 3-101; 4-121; 5-124; 6-137; 7-152; 8-157.
బౌలింగ్: నెహ్రా 4-0-34-0; బుమ్రా 4-0-37-2; జడేజా 4-0-32-2; అశ్విన్ 4-0-27-1; హార్డిక్ పాండ్యా 2-0-17-1; యువరాజ్ 2-0-7-1.

ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు...?


ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్‌గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్.
 
ప్ర: మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే?
జ: 
తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్ధార్ధ్, హన్సిక, సూరి తదితర కొత్త టీమ్‌తో నటించడం సంతోషకరం.
 
ప్ర: సెకెండ్ ఇన్నింగ్‌లోనూ బిజీగా నటించడం గురించి?
జ: 
నేను సినిమాలోకి వచ్చి 13 ఏళ్లుఅయ్యిందన్నది నమ్మలేకపోతున్నాను. అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అనే మొదట్లో భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నాను.
 
ప్ర: నాన్న మరణం, ఆగిపోయిన పెళ్లి లాంటి బాధాకరమైన సంఘటనలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడం గురించి?
జ: 
నిజం చెబుతున్నా. మా కుటుంబంలో అందరూ ధైర్యవంతులే. ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటాం. నాకు మార్గదర్శిగా అమ్మ ఉన్నారు. జీర్ణించుకోలేని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని రోజులు ఏకాంతంగా మౌనంగా ఉంటాను. ఆ తరువాత పనికి సిద్ధం అవుతాను. ఇదే నా కేరెక్టర్.
 
ప్ర: కొడి చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం గురించి?
జ: 
మీకో విషయం తెలుసా? ఆడుగళం చిత్రం తొలుత నేనే కథానాయికని.ధనుష్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించాను కూడా. ఆ సమయంలో హిదీ చిత్రంలో నటించాల్సి రావడంతో కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆడుగళం చిత్రం నుంచి వైదొలిగాను. ఆ తరువాత ఇన్నాళ్లకు కొడి చిత్రంలో ధనుష్‌తో నటిస్తుండడం సంతోషంగా ఉంది. ఇందులో మరో నాయికగా షామిలి నటిస్తున్నారు.

ప్ర: మీ యవ్వన రహస్యం?
జ: రహస్యం అంటూ ఏమీలేదు. అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను.
 
ప్ర: ఇన్నేళ్ల నట జీవితంలో కథాపాత్ర కోసం పారితోషికం విషయంలో పట్టువిడుపుల సంఘటనలు ఉన్నాయా?
జ: అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.ఇం కా చెప్పాలంటే తొలుత పారితోషికం గురించి మా ట్లాడను. కథే ముఖ్యం. అది బాగా నచ్చితే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
 
ప్ర: నయనతారతో కలిసి నటించనున్నారటగా?
జ: అలాంటిదేమీ లేదు. మీడియా వాళ్లు కొందరు అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం.

ప్ర: నటుడు ఆర్య ఇటీవల ఒక కార్యక్రమంలో త్రిష నాకు చెల్లెలు మాదిరి అన్నారే?

జ: ఆర్య అలా అన్నారా? నిజంగానే ఆర్య చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఎలాంటి విషయమైనా పంచుకోవచ్చు. హీరోయిన్లకు మంచి మిత్రుడు. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయవచ్చు. ఆయన్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఇక నన్ను చెల్లెలు అనడమే కామెడీ. ఈ విషయం గురించి ఆర్యను అడిగే తీరుతాను.
 
ప్ర: ఈ మధ్య పార్టీలకు వెళ్లడం తగ్గించినట్లున్నారే?
జ: క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అంటేనే నేను పాల్గొంటాను. అలాంటిది ఎక్కువగా పార్టీలకు వెళతానే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు స్నేహితురాళ్లం ఒక చోట కలుసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే సినిమా వాళ్ల విషయంలో దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది.
 
ప్ర: మళ్లీ రానాతో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి?
జ: అందరితో మసలుకున్నట్లే రానాతోనూ ఉంటాను. మా మధ్య స్నేహం తప్ప మరేమీలేదు. ఈ విషయం గురించి పత్రికల వాళ్లే రాస్తున్నారు. అలాంటిది ప్రేమా అని అడగడంలో అర్థం లేదు.
 
ప్ర: సరే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: బిజీగా ఉన్నప్పుడు నేనే కాదు ఏ నటి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోదు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసన్నది పెద్ద విషయమే కాదు. ఇక నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. మనసుకు నచ్చిన వాడు లభించాలి. రాణీముఖర్జీ, ఐశ్వర్యారాయ్‌లాంటి వారు లేట్‌గానే పెళ్లి చేసుకున్నారు. నటి ప్రియాంక ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి లభించడం అంత సులభం కాదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాను.

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు...?


ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో హవా చూపిస్తుంటే పవన్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్యలో భారీ గ్యాప్ తీసుకుంటూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో పవర్ స్టార్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై టాక్ మొదలైంది.

ఇప్పటి వరకు పవన్ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాకపోయినా, పవన్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్, కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడన్న వార్త, ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా వీరంను పవన్ తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. వీటికి తోడు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడట. మరి ఈ మూడు సినిమాలో పవన్, ఏ సినిమాకు కమిట్ అవుతాడో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నారు.

'నా బెడ్‌రూం నిండా ఆయన ఫొటోలే'...?


లండన్: యవ్వనప్రాయం ఎన్నో ఆకర్షణలు, మోహాలతో నిండి ఉంటుంది. యుక్తవయస్సులో కలిగే అలాంటి ఆకర్షణలకు, మోహాలకు తాను కూడా అతీతం కాదని అంటోంది హాలీవుడ్ బ్యూటీ లిల్లీ జేమ్స్. టీనేజ్‌ప్రాయంలో తాను ర్యాన్ ఫిలిప్‌ అంటే పడిచచ్చిపోయేదానన్ని, తన పడక గది నిండా ఆయన ఫొటోలే ఉండేవని చెప్తోంది.

ప్రైడ్ అండ్ ప్రిజుడిస్, జాంబీస్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం మ్యాత్ స్మిథ్‌తో డేటింగ్ చేస్తోంది. 'క్రూయెల్ ఇంటెన్షన్' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ర్యాన్‌ అంటే తన యవ్వనప్రాయంలో విపరీతమైన ప్రేమ ఉండేదని లిల్లీ తెలిపింది. 'నా బెడ్రూమ్‌ నిండా ఆయన ఫొటోలే ఉండేవి. నేను ఆయనను ఎంతగా ప్రేమించానంటే అతని చిన్నచిన్న ఫొటోలన్నీ కలిపి ఓ పెద్ద పోస్టర్ చేసుకొని నా గదిలో అతికించుకున్నా' అని ఈ భామ 'ఫిమెల్ ఫస్ట్‌'తో తెలిపింది.

టుడే అప్ డేట్స్...!!!

  • తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ. ఈ సభలో ప్రసంగించనున్న కేసీఆర్
  • వైఎస్ఆర్ జిల్లాలో నేడు రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన
  • నేటి నుంచి ఇంజనీరింగ్ పీజీ ప్రవేశ పరీక్ష గేట్.  దేశవ్యాప్తంగా 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హజరుకానున్నారు.  
  • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేటి మధ్యాహ్నం చంద్రబాబు మీడియా సమావేశం
  • అండర్ - 19 వరల్డ్ కప్ లో నేడు భారత్ - న్యూజిలాండ్ ఢీ
  • హైదరాబాద్ లో నేడు ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉన్నతాధికారుల సమావేశం. సర్వీస్ రికార్డులు, ఉద్యోగుల విభజనపై చర్చ
  • కుల వివక్షను వ్యతిరేకిస్తూ నేడు న్యూఢిల్లీలో ర్యాలీ
  • నేడు రోహిత్ బర్త్ డే. ఈ సందర్భంగా హెచ్ సీయూలో విద్యార్థుల దీక్ష
  • నేడు తెలంగాణలో కళాశాలల బంద్ కి పిలుపునిచ్చిన ఏబీవీపీ

వర్మ నెక్ట్స్ సినిమా 'గవర్నమెంట్'....?


వీరప్పన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ నార్త్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. కొంత కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్న వర్మ, వీరప్పన్ సినిమా తరువాత బాలీవుడ్ వెళ్లిపోయాడు. వీరప్పన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు.

'గవర్నమెంట్' పేరుతో వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరోసారి తనకు బాగా పట్టున్న అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకోనున్నాడు. అయితే తన గత సినిమాల మాదిరిగా రాసుకున్న కథతో కాకుండా ముంబై మాఫియాలో నిజంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు. వీరప్పన్ సినిమాను తీసినంత రియలిస్టిక్ గా ముంబై మాఫియా నేపథ్యాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

ముఖ్యంగా గవర్నమెంట్ సినిమాలో దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ ల స్నేహం, తరువాత వారి మధ్య మనస్పర్థలు రావటం. దావూద్ కు తీవ్రవాదులు, ఐయస్ ఐతో ఉన్న సంబంధాలు, అండర్ వరల్డ్ మాఫియాకు ముంబై రాజకీయాలకు, పోలీస్ వ్యవస్థకు ఉన్న రిలేషన్స్ గురించి చూపించనున్నాడట. తను ప్రతి సినిమాను వివాదాస్పదం చేసే వర్మ ఇలాంటి వివాదాస్పద కథను ఎంచుకొని ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తాడో చూడాలి.

ఎఫ్‌బీలో ఇక ....... అమ్మకాలకు చెక్!

సాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో ఇక తుపాకులు అమ్మకాలకు చెక్‌ పడనుంది. ఫేస్‌బుక్‌, దాని అనుబంధ ఫొటోషేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు తుపాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది. ఈ మేరకు తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. నిజానికి ఫేస్‌బుక్‌లో నేరుగా తుపాకుల అమ్మకాలు జరుగనప్పటికీ, వాటిని అమ్మే డీలర్లు మాత్రం తుపాకుల ఫొటోలను పోస్టు చేసి.. వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

ప్రైవేటు తుపాకుల అమ్మకాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి.  ప్రైవేటు ఆయుధాల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి చర్చలకు వేదికగా మారుతోంది.  ఈ నేపథ్యంలో దీనిని నిరోధించేందుకు ఫేస్‌బుక్ తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. అయితే, తగిన లైసన్సు కలిగిన డీలర్లపై ఈ నిషేధం ఉండబోదని ఫేస్‌బుక్ ప్రాడక్ట్ పాలసీ చీఫ్ మోనికా బికెర్ట్‌ తెలిపారు. గతంలో ఔషధాల అమ్మకాల విషయంలోనూ ఫేస్‌బుక్ ఇదే తరహాలో నిషేధం విధించింది.


సోషల్ మీడియాలో తప్పులతో ఉద్యోగాలకు ఎసరు...?


హైదరాబాద్ :
సోషల్ మీడియాను ఆస్వాదిస్తూ నేటి యువతరం గంటల తరబడి అందులో లీనమైపోతోంది. తమ భావాలను వ్యక్తీకరిస్తూ ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు. స్నేహితులతో చాటింగ్, తమ కామెంట్స్ పోస్టుచేయడంతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ పోస్టింగ్స్ వల్ల మీ ఉద్యోగానికే ఎసరు రావొచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్స్ మీకు ఉద్యోగం రాకుండా ప్రతిబంధకంగా మారొచ్చు... తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి కాలంలో విడుదలైన సోషల్ రిక్రూటింగ్ సర్వే తాజా ఎడిషన్‌లో దీనికి సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవలి కాలంలో అమెరికా లాంటి దేశాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీలు, రిక్రూటర్లు అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. వృత్తి నిపుణుల కోసం అన్వేషణలో అవి సోషల్ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించాయని ఆ సర్వేలో వెల్లడైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో రిక్రూటర్స్ 73 శాతం సోషల్ రిక్రూటింగ్ పైన, 63 శాతం రిఫరల్స్‌తో, 51 శాతం మొబైల్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ, ఆపరేషన్స్, సేల్స్ రంగాల్లో అత్యంత ప్రతిభావంతుల కోసం డిమాండ్ ఉన్నట్టు తేలింది.

సోషల్ నెట్‌వర్క్ ఒక్కటే రిక్రూట్‌మెంట్‌కు ప్రామాణికం కాకపోయినా, ఉద్యోగ నియామకాల్లో రిక్రూట్ చేసుకునేవారు అభ్యర్థుల గురించి తెలుసుకోడానికి సోషల్మీడియా ప్రొఫైల్స్ ప్రధాన సోర్స్‌గా పనికొస్తోందని తేలింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్న విషయాలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టు తేలింది. ఉద్యోగ నియామకాల్లో ఇండస్ట్రీస్‌కు సోషల్ మీడియా (లింక్డిన్ 94 శాతం, ఫేస్ బుక్ 66 శాతం, ట్విట్టర్ 52 శాతం) ప్రధాన సాధనంగా మారింది. అభ్యర్థులను సంప్రదించడం, సరైన అభ్యర్థులను వెతుక్కోవడం, ఇంటర్వ్యూల కన్నా ముందుగానే ఎంపికచేసిన వారిని ఫిల్టర్ చేయడం (లింక్డిన్), ఎంప్లాయర్ బ్రాండ్, రిఫర్రల్స్, ప్రీ ఇంటర్వ్యూ, పోస్ట్ ఇంటర్వూల ద్వారా వడపోత కార్యక్రమం (ఫేస్ బుక్), గతంలో చేసిన ఉద్యోగాలు, ఇంటర్వ్యూల కన్నా ముందే వడపోత కార్యక్రమం (ట్విట్టర్) వంటి వాటన్నింటికీ రిక్రూటర్స్ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నట్టు తేలింది. ఇలా దాదాపు 73 శాతం ఇలాంటివాటి ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్టుగా రిక్రూటర్స్ చెప్పినట్టు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ రకంగా చేయడంలోనూ, అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ఏజెన్సీలు 93 శాతం మేరకు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను రివ్యూ చేస్తున్నట్టు ఆ సర్వేలో బయటపడింది.

అడ్డగోలు పోస్టింగ్స్‌తో అసలుకే ఎసరు
జాబ్స్ రిక్రూట్ మెంట్స్‌లో రిక్రూటర్లు ప్రధానంగా సోషల్ మీడియాపై ఆధారపడుతున్న నేపథ్యంలో నిపుణులైన యువతీ యువకులు సోషల్ మీడియా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు సంబంధిన విషయాలు, చట్ట వ్యతిరేక చర్యలు, శృంగారానికి సంబంధించిన పోస్టింగ్స్ వంటివి తెలిసీ తెలియక చేసినా మీకు ఉద్యోగం రానట్టే. ఇలాంటి పోస్టింగ్స్‌పై రిక్రూటర్స్ తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది.

ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించి స్నేహితులతో ఎలాంటి పోస్టింగ్ చేసినా అది మీకు ప్రతిబంధకం కావొచ్చు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని పోస్టింగ్స్ చేయొచ్చు. కానీ రిక్రూట్ చేసుకునే వారిలో 83 శాతం మేరకు వాటిని వ్యతిరేక దృష్టితోనే చూస్తున్నారు. ఆ తర్వాత సెక్సువల్ పోస్టింగ్స్ విషయంలోనూ 70 శాతం రిక్రూటర్స్ వ్యతిరేకంగానే పరిగణిస్తున్నారు. కేవలం ఒక శాతం మాత్రమే ఆ విషయాలను పాజిటివ్ కోణంలో చూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. అశ్లీలదృశ్యాలను పోస్టు చేయడం, వాటిపై కామెంట్స్ చేయడం అభ్యర్థుల పట్ల నెగెటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో తుపాకీ సంస్కృతి, మద్యం వంటి విషయాల్లో పోస్టింగ్స్ కూడా 44 శాతం మంది రిక్రూటర్స్‌కు నచ్చడం లేదని వెల్లడైంది.

ఇంకో విచిత్రమేమంటే... పోస్టింగ్స్‌లో దొర్లుతున్న అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అభ్యర్థులు ఇలాంటి పొరపాట్లు చేయడం దాదాపు 66 శాతం మంది రిక్రూట్‌మెంట్ మేనేజర్లకు నచ్చడం లేదు. రాజకీయ పరమైన కామెంట్స్ గానీ, రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాలకు సంబంధించిన పోస్టింగ్స్ విషయాల్లో గానీ రిక్రూటర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తేలింది. 1 నుంచి 6 శాతం రిక్రూటర్లు మాత్రమే రాజకీయ సంబంధాలను కూడా సందర్భాన్ని బట్టి నెగెటివ్‌గానే పరిగణిస్తున్నట్టు తేలింది.

పాజిటివ్ అంశాలూ ఉన్నాయి...
ఫేస్‌బుక్, లింక్డిన్‌లో మీ ప్రొఫైల్ మార్చుతున్నప్పుడు, లేదా అప్‌డేట్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛారిటీ పనులు, స్వచ్ఛందంగా మీరేదైనా విరాళాలు ఇచ్చి ఉంటే ... అలాంటి విషయాలను సానుకూలంగా పరిగణిస్తున్నట్టు 65 శాతం రిక్రూటర్స్ వెల్లడించారు. మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్, మ్యూచువల్ కనెక్షన్స్, సాంస్కృతికపరమైన అంశాలన్నీ మీకు అనుకూలంగా నిలుస్తున్నాయి.

వివిధ రకాల సోషల్ మీడియాలు
నిపుణుల వెతుకులాటలో రిక్రూటర్లు ప్రధానంగా లింక్డిన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. 79 శాతం లింక్డిన్‌పై (బయోడాటా) ఆధారపడుతుండగా, 26 శాతం ఫేస్‌బుక్ పైన, 14 శాతం ట్విట్టర్ పైన ఆధారపడుతున్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఎంత కాలం సర్వీసు చేశారు, మీకు తగిన ఉద్యోగం చేశారా, కష్టపడే మనస్తత్వం ఉందా, రాయడంలో గానీ, డిజైన్‌లో గాని ఉన్న స్కిల్స్ వంటి వాటి కోసం రిక్రూటర్స్ మీ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. వివిధ రకాల ఇండస్ట్రీకి చెందిన దాదాపు 2 వేల మంది హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్స్‌తో ఆన్‌లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించినట్టు జాబ్ విటే ఇటీవల ప్రకటించింది. అందువల్ల ఉద్యోగాల వేటలో ఉన్న నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
 పాజిటివ్   న్యూట్రల్   నెగెటివ్
అశ్లీల దృశ్యాలు, కామెంట్స్52263
అక్షర దోషాలు32466
డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక రిఫరెన్స్2783
సెక్స్ కు సంబంధించిన పోస్టింగ్స్11770
రాజకీయ పార్టీల అనుబంధం26917
విరాళాలు, స్వచ్ఛంద సేవ65252
మద్యం24344
గన్స్, మారణాయుధాలు...23251

4 గంటల్లో 23 సార్లు ఆగిన గుండె....!!


కొచ్చి :
ఆయన వయసు 60 ఏళ్లు. ఎంచక్కా తన ఏడేళ్ల మనవడితో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయనకు కేవలం 4 గంటల వ్యవధిలో 23 సార్లు గుండె ఆగింది. అయినా తట్టుకుని నిలబడ్డారు!! విపరీతంగా సిగరెట్లు కాల్చే అలవాటున్న ఆ పెద్దాయన గుండెల్లో బాగా నొప్పిగా ఉందని చెప్పినప్పుడు.. ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఈసీజీ తీయిస్తే, గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఆయనకు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోగా.. పదేపదే చాలాసార్లు ఆయన గుండె ఆగిపోయింది. తర్వాత ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.

తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడే పెద్ద ఆస్పత్రికి తీసుకురాకపోవడంతో.. తొలి గంటలో అందించాల్సిన చికిత్స అందలేదని.. అయినా అసలు నాలుగు గంటల్లో 23 సార్లు గుండె ఆగడం చిన్న విషయం కాదని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. స్టెంటు వేయడం ద్వారా బ్లాకు క్లియర్ చేశామని తెలిపారు. సాధారణంగా గుండెపోటు వస్తే గుండెలో ఒక భాగానికి రక్తసరఫరా ఆగుతుందని, కానీ.. ఇక్కడ ఏకంగా గుండె కొట్టుకోవడమే ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) ఆయన వివరించారు. ఆయన ఇక జీవనగమనంలో వేగాన్ని తగ్గించుకోవాలని, ఇప్పుడు కేవలం 30 శాతం పంపింగ్‌తోనే గుండె పనిచేస్తోందని తెలిపారు.

Thursday, January 28, 2016

డబ్బు కోసమే టీవీ షోలు చేస్తా...?



కేవలం డబ్బు కోసమే తాను టీవీ షోలు చేస్తానని తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన తమిళ హీరో మాధవన్ చెప్పాడు. 1990లలో 'సీ హాక్స్', 'బనేగీ అప్నీ బాత్' లాంటి షోలతో మాధవన్ అందరినీ ఆకట్టుకున్నాడు. డబ్బులు బాగా వస్తాయంటేనే టీవీ షోలు చేయాలన్నది తన ఆలోచన అని.. అయితే సినిమాలు చేసేటప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచించేది లేదని చెప్పాడు. వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తామో టీవీ షోలు కూడా అలాగే చేస్తానని స్పష్టం చేశాడు.

గతంలో 'తోల్ మోల్ కే బోల్' 'డీల్ యా నో డీల్' లాంటి రియాల్టీ షోలకు హోస్ట్‌గా కూడా మాధవన్ వ్యవహరించాడు. కానీ వాటన్నింటి కంటే, 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', 'తను వెడ్స్ మను', 'త్రీ ఇడియట్స్' లాంటి సినిమాలతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులందరినీ ఆకర్షించాడు. తాజాగా సాలా ఖుద్దూస్ సినిమాలో కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో మాధవన్ సరసన కొత్త నటి రితికా సింగ్ నటించింది. రాజ్‌కుమార్ హిరానీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Wednesday, January 27, 2016

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ...?


మెగా ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు మెగా హీరోలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంత కాలంగా అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉంటున్న పవన్, ఈ మధ్యే మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవుతున్నాడు. ఇటీవల సర్దార్ సెట్ నుంచి చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి పవన్, ఆ తరువాత చిరు 60వ పుట్టినరోజు వేడుకల్లోనూ సందడి చేశాడు.

తాజాగా చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కు వెళ్లి తమ్ముడితో కాసేపు సరదాగా గడిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం...!!!


విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వేస్టేషన్‌లో బాంబు ఉందంటూ బుధవారం ఫోన్ రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఆగంతకుడు సెల్ నుంచి ఫోన్‌చేసి, రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కార్యాలయంతో పాటు స్టేషన్‌లోని అణువణువూ తనిఖీచేశారు.

పలు రైళ్లలో సైతం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఎస్‌పీ షిమోషి బాజ్‌పాయ్ నేతృత్వంలో 60 మంది సిబ్బంది స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీ చేశారు. రెండు గంటలసేపు గాలించినా బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో వచ్చిన ఫోన్‌కాల్ ఆకతాయిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నేటి వార్తా విశేషాలు....!!!


  • ఢిల్లీ: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
  • నేటి నుంచి గ్రేటర్ ప్రచార బరిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • నేడు రేపు గ్రేటర్ లో ఏపీ చంద్రబాబునాయుడి పర్యటన
  • నేడు మీట్ ది ప్రెస్ ద్వారా ప్రజల్లో సీఎం కేసీఆర్
  • ఎల్లుండి పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ
  • హెచ్ సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల దీక్ష
  • నేటి నుంచి హెచ్ సీయూలో ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల సిబ్బంది రిలే దీక్షలు
  • ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీకి విద్యార్థుల పిలుపు
  • నేడు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఎథిక్స్, హ్యూమన్ వాల్యుస్ పరీక్షలు
  • అండర్-19 వరల్డ్ కప్: నేడు మిర్పుర్ లో ఐర్లాండ్ తో భారత్ ఢీ
  • ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో బ్యాంకర్ల సమావేశం
  • ఎన్ సీసీ, క్యాడెట్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ
  • నేడు ఏపీలో టీచర్ సంఘాల ధర్నా

ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది...!


లండన్‌: బ్రెడ్డుముక్కను తింటూ కూడా బరువును ఎలా తగ్గించుకోవచ్చో చెప్తూ పెట్టిన ఓ ట్వీట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే అక్షరాల 12 మిలియన్ డాలర్లు (రూ. 81.77 కోట్లు) సంపాదించింది. 'వెయిట్‌ వాచర్స్' కంపెనీ తరఫున బ్రెడ్‌ తింటూ 26 పౌండ్ల బరువును ఎలా తగ్గవచ్చో తెలిపే ఓ వీడియోను ఆమె ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. ఈ కంపెనీలో మీడియా మొఘల్‌గా పేరొందిన విన్‌ఫ్రేకు 6 మిలియన్‌ డాలర్ల వాటా ఉండగా.. ఈ ఒక్క ట్వీట్‌ వల్ల ఆమె సంపద 18 శాతం పెరిగి 12 మిలియన్‌ డాలర్లకు చేరింది.

దీంతో 'వెయిట్ వాచర్స్' కంపెనీలో ఆమె షేర్‌ విలువ ఒకే ఒక్క గంటలోనే 2.10 శాతానికి పెరిగిందని 'ఫిమెల్ ఫస్ట్‌' మీడియా సంస్థ తెలిపింది. మల్టీ మిలియన్ డాలర్ ట్వీట్‌గా హల్‌చల్  చేసిన ఈ ట్వీట్‌లో 'బ్రెడ్‌ తినండి. బరువు తగ్గండి. ఏంటి? నిజమా! అవును. నాతోపాటు ఈ 30 సెకండ్ల వీడియో క్లిప్పును చూడండి. నేను 26 పౌండ్ల బరువు తగ్గాను. నేను ప్రతిరోజూ బ్రెడ్ తింటాను' అని విన్‌ఫ్రే పేర్కొంది.

హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ హడ్సన్, జెన్సీ మెక్‌క్యాథీ తరహాలోనే గత అక్టోబర్‌ నుంచి 'వెయిట్‌ వాచర్స్‌' కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా విన్‌ఫ్రే నియమితురాలైంది. ఇందుకుగాను ఆమెకు లభించే వాటాను మార్కెట్‌లో అమ్మితేగానీ విన్‌ఫ్రేకు డబ్బురూపంలో ఆ సొమ్ము అందదని మార్కెట్ వర్గాలంటున్నాయి.

Tuesday, January 26, 2016

స్టార్ ఎట్రాక్షన్... డ్యాన్స్...!


ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) తొలిసారిగా దక్షిణాదికి వచ్చి చాలా సంచలనాలే సృష్టించింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నాలుగు సినిమా పరిశ్రమలకు సంబంధించి తొట్టతొలిసారిగా చేసిన ‘ఐఫా - ఉత్సవం’ 2016 అవార్డుల వేడుకలో రెండో రోజైన సోమవారం నాడు ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ‘ఐఫా - ఉత్సవం’లో క్రేజీ హీరోలు రామ్‌చరణ్, అఖిల్, అందాల తార తమన్నా తదితరులు పలు హిట్ పాటలకు ఆహూతుల ఎదుట ప్రత్యక్షంగా నర్తించారు.

దాంతో,  గచ్చీబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్‌కు విచ్చేసిన జనం వేదికకే కళ్ళప్పగించి, చూస్తూ ఉండిపోయారు. ప్రముఖ హిందీ నటీనటులు ప్రసిద్ధ అవార్డు ప్రదానోత్సవాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ, తెలుగు హీరోలు స్టేజ్ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి.

ఎలక్ట్రిఫయింగ్ రామ్‌చరణ్
‘ఐఫా - ఉత్సవం’లో స్టేజ్ ప్రదర్శన కోసం కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్. ఆ కృషి మొత్తం సోమవారం వేదికపై కనిపించింది. ఒరిజినల్‌గా మంచి డ్యాన్సరైన రామ్‌చరణ్ కళ్ళు మిరుమిట్లు గొలిపే డ్రెస్‌తో, కళ్ళకు గాగుల్స్ ధరించి, చేతిలో గిటార్ పెట్టుకొని వేదికపై కనిపించగానే స్టేడియమ్‌లో హర్షధ్వానాలు మారుమోగాయి.

గిటార్ కొన నుంచి నిప్పులు విరజిమ్ముతుండగా, పలు హిట్ పాటల్లోని పల్లవులతో కూడిన సమ్మిశ్రమ గీతానికి రామ్‌చరణ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ‘ఆరెంజ్’, ‘బ్రూస్‌లీ’ తదితర చిత్రాల నుంచి ఎంచుకున్న పాటల పల్లవులు ఈ ‘మెడ్లీ’ సాంగ్‌లో చోటుచేసుకున్నాయి. అలాగే తండ్రి చిరంజీవి హిట్ సాంగ్స్‌కు రీమిక్స్‌లుగా తన సినిమాల్లో వాడుకున్న ‘బంగారు కోడిపెట్ట...’, ‘వానా వానా వెల్లువాయే...’ పాటల పల్లవులకు ఈ అగ్ర హీరో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు.

రామ్‌చరణ్ డ్యాన్స్ చేస్తుంటే, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన తదితరులు ముందు వరుసలో కూర్చొని, అభిమానంగా, ఆసక్తిగా చూశారు. ప్రతి పాట పల్లవికీ కాస్ట్యూమ్‌లో వైవిధ్యాన్ని చూపుతూ, రామ్‌చరణ్ డ్యాన్స్ చేశారు. ‘వానా వానా వెల్లువాయే...’ పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వేదికలో సగానికి పైగా పరుచుకున్న పొడవాటి పచ్చరంగు కొంగుతో తమన్నా వేదికపై ప్రత్యక్షమయ్యారు. ‘మెగా మెగా మెగా మీటర్...’ అంటూ వచ్చే తాజా ‘బ్రూస్‌లీ’ పాటకు హుందాగా రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు అభిమానులకు గిలిగింతలు పెట్టాయి. కెమేరా ముందే తప్ప ఎన్నడూ జనం ముందు నర్తించని రామ్‌చరణ్ ఈ తొలి ప్రయత్నంలోనే తన సత్తా ఏమిటో చూపారు.

దూసుకొచ్చిన అఖిల్
గత ఏడాదే ‘అఖిల్’ సినిమాతో తెరపై హీరోగా పరిచయమైన నాగార్జున రెండో కుమారుడు అఖిల్ డ్యాన్స్ ‘ఐఫా - ఉత్సవం’లో మరో స్పెషల్ ఎట్రాక్షన్. మోటార్ బైక్ నడుపుతూ, వేదిక ముంగిటకు దూసుకు వచ్చారీ యువ హీరో. బైక్ దిగుతూనే, ముందు వరుసలో కూర్చొని ఉన్న తల్లితండ్రులు నాగార్జున, అమల దగ్గరకు వెళ్ళి, కాళ్ళకు నమస్కరించిన అఖిల్ ఆ పైన జనానికి అభివాదం చేస్తూ, వేదిక మీదకు వచ్చారు. తొలి చిత్రం ‘అఖిల్’లో కెమేరా ముందు నర్తించిన పాటలనే జనం ముందు ప్రదర్శించారీ క్రేజీ హీరో. ‘పడేశావే పడేశావే.. నీ మాయలో నన్ను పడేశావే...’ పాటకు స్లో మూవ్‌మెంట్ వేసినా, ‘జరా నవ్వరాదే...’, ‘అక్కినేని... అక్కినేని...’ లాంటి బీట్ పాటలకు ఫాస్ట్ స్టెప్పులు వేసినా, డ్యాన్స్‌లో ఒక హుందాతనం చూపించారు.

అఖిల్ డ్యాన్స్ చేస్తున్న తీరును ప్రేక్షకులతో పాటు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కన్నా మరింత ఆసక్తిగా నాగార్జున, అమల చూశారు. అఖిల్ డ్యాన్స్ చేస్తున్నంత సేపు తల్లితండ్రులుగా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మరీ ముఖ్యంగా, అమల ముఖంలో చిరు నవ్వుతో కూడిన ఆనందం స్పష్టంగా తొంగిచూసింది. వేదికపై తనతో పాటు నర్తిస్తున్న గ్రూప్ డ్యాన్సర్లందరినీ కలుపుకొని అఖిల్ వేదికపై దుమ్ము రేపారు.

డ్యాన్స్ కా... తమన్నా
అవార్డు ప్రదాన వేదికలపై హీరోయిన్లు డ్యాన్స్‌లు చేయడం మామూలే. కానీ, ‘ఐఫా - ఉత్సవం’ 2016లో తమన్నా చేసిన డ్యాన్స్ మామూలు విషయం కాదు. పాలరాతిలా తెల్లగా ఉంటుందంటూ వ్యాఖ్యాతలు ‘‘మార్బుల్ బ్యూటీ’’ అని తమన్నాను సంబోధించినప్పుడు స్టేడియవ్‌ు అంతా కిసుక్కుమంది. ఆకాశంలో నుంచి అప్సరస దిగినట్లుగా, వేదిక పైకి ఆమె దిగివచ్చిన దృశ్యం ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. ‘బాహు బలి’లోని ‘ధీవర...’ పాటకు దేవలోక కన్యలానే ఆమె అభినయించారు. ‘పచ్చబొట్టేసినా...’ పాటలో సున్నితమైన ప్రేమను పండించారు.

‘నీ నగుమోమే ఎక్స్‌ట్రార్డినరీ’ పాటకి తమన్నా మంచి బీట్‌లో నర్తిస్తుంటే, స్టేడియమ్ అంతా ఈలలే. ఇక, ఫాస్ట్‌గా సాగే తమిళ పాట ‘సబ్‌స్క్రై బర్ నాట్ రీచబుల్ మచ్చీ’కి మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తుంటే, జనంలో వేడి, ఉత్సాహం పెరిగిపోయాయి. మరో తమిళ పాట ‘సెల్ఫీ పుళ్ళా...’తో దాన్ని పతాకస్థాయికి తీసు కెళ్ళి, పాట చివరలో వేదిక దిగి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు లాంటి అగ్రహీరోలతో తమన్నా సెల్ఫీ తీసుకోవడం కనువిందుగా మారింది. మొత్తానికి, ‘ఐఫా-ఉత్సవం’లో తిరుగులేని స్టార్ ఎట్రాక్షన్... ఈ స్టార్స్ డ్యాన్‌‌స.

lactobex-c tablet


if any one wants this tablets contact me 9885923045::hari
pls mention this add is in freshdeals365.com dont foreget to mention


అదరగొట్టారు...!


ధనాధన్ క్రికెట్‌లో తమదైన ముద్ర చూపిస్తూ చెలరేగిన ధోని సేన అడిలైడ్‌లో అదుర్స్ అనిపించింది. వన్డే పరాజయాల భారాన్ని వెనక్కి తోస్తూ టి20 పోరులో శుభారంభం చేసింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ బ్యాటింగ్‌లో కదంతొక్కిన కోహ్లికి తోడుగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ సత్తా చాటడంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన కంగారూలు చేతులెత్తేయడంతో గణతంత్ర దినోత్సవాన భారత్ పండుగ చేసుకుంది.

తొలి టి20లో భారత్ ఘనవిజయం
* 37 పరుగులతో ఆసీస్ చిత్తు
* కోహ్లి 90 నాటౌట్
* రాణించిన బుమ్రా
* శుక్రవారం రెండో మ్యాచ్

అడిలైడ్: వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇచ్చిన విజయోత్సాహం, ఆత్మవిశ్వాసం భారత్ జట్టు టి20ల్లో కూడా వెన్నంటి నిలిచినట్లుంది. ఫలితమే మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదటి పోరులో ఏకపక్ష విజయం. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లి (55 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రైనా (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (33 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జడేజా, అశ్విన్, హార్డిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. తాజా ఫలితంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.

రికార్డు భాగస్వామ్యం...
టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఆసీస్ ఆటగాడు ట్రెవిస్ హెడ్ ఈ మ్యాచ్‌తో టి20ల్లోకి అరంగేట్రం చేశారు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. టెయిట్ వేసిన రెండు ఓవర్లలో అతను 3 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. 25 పరుగుల వద్ద బాయ్‌స్ సునాయాస క్యాచ్ వదిలేసినా వాట్సన్ వేసిన తర్వాతి ఓవర్లోనే రోహిత్ వెనుదిరిగాడు. ఇదే ఓవర్ ఐదో బంతికి ధావన్ (5) కూడా అవుటయ్యాడు.

ఈ దశలో జత కలిసిన కోహ్లి, రైనా 87 బంతుల్లోనే 134 పరుగులు జత చేసి భారత్ తరఫున మూడో వికెట్‌కు కొత్త రికార్డు నెలకొల్పారు. ఒకవైపు దూకుడు తగ్గించకుండానే... మరోవైపు ఎలాంటి ప్రమాదం లేకుండా సాధికారిక షాట్లతో కోహ్లి చక్కటి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. రైనా కాస్త తడబడినా తర్వాత నిలదొక్కుకున్నాడు. రైనా అవుటైనా, ధోని (3 బంతుల్లో 11నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులతో చివరి మూడు ఓవర్లలో భారత్ 40 పరుగులు చేసింది. 87 పరుగులకు చేరిన తర్వాత 20వ ఓవర్లో కోహ్లికి రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం రావడంతో సెంచరీ చేయలేకపోయాడు.

కట్టడి చేసిన స్పిన్నర్లు...
భారీ ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఫించ్, వార్నర్ తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 47 పరుగులు జత చేశారు. అశ్విన్ వేసిన రెండో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. అయితే వార్నర్‌ను అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. పరుగులు ఇవ్వకుండా నిరోధిస్తూ అశ్విన్, జడేజా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. ఫలితంగా రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు పరుగులకే ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. స్మిత్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు), హెడ్ (2)లను జడేజా అవుట్ చేయగా, అశ్విన్‌కు ఫించ్ చిక్కాడు. వాట్సన్ (12)ను కూడా అశ్విన్ పెవిలియన్ పంపిం చడంతో కంగారూల ఆశలు గల్లంతయ్యాయి. చివరకు 3 బంతుల ముందే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తన తొలి వన్డేలోనే ఆకట్టుకున్న బుమ్రా, తొలి టి20లో చక్కటి ప్రదర్శన చేయడం విశేషం.

టి20ల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడు రైనా (1024). కోహ్లి (1106) ముందున్నాడు.

సమష్టి విజయం...
‘అందరి కృషికి ఫలితం దక్కింది. జట్టులో ఆల్‌రౌండర్ల అవసరం ఎలాంటిదో ఈ మ్యాచ్‌లో  కనిపించింది. టాప్-6 ఆటగాళ్లలో బౌలింగ్ రానివాళ్లు ఉంటే కష్టమవుతుంది. ఎవరైనా బౌలర్ విఫలమైతే ఏం చేయలేం. అలా కాకుండా కీలక సమయంలో కొన్ని ఓవర్లు వేయగలగాలి. ఈ విషయంలో పాండ్యాను అభినందిస్తున్నా. జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక కోహ్లి గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇప్పుడు అడిలైడ్‌లో అతని పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లుం ది!  రిటైరయ్యేలోపు ఆస్ట్రేలియాలోని ప్రతీ మైదానంలో అతని పేరిట స్టాండ్ ఉంటుందనేంత బాగా ఆడుతున్నాడు’   -ధోని, భారత్ కెప్టెన్  

11 బంతుల ఓవర్
ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టగానే తొలి టి20 ఆడే అవకాశం దక్కించుకున్న హార్దిక్ పాండ్యాకు తన మొదటి ఓవర్ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. తొలి మూడు బంతులను వరుసగా లెగ్ సైడ్ వైడ్‌లుగా వేసిన అతను అదే ఓవర్లో మరో రెండు వైడ్‌లు కలిపి మొత్తం 11 బంతులు విసిరాడు. బ్యాట్స్‌మెన్ ఫోర్, సిక్సర్ కూడా బాదడంతో మొత్తంగా ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తర్వాత కీలకమైన లిన్, వేడ్ వికెట్లు తీయడంతో హార్దిక్ బాధ కాస్త తగ్గింది.

ఎవరెలా ఆడారంటే..
చాలా రోజుల తర్వాత భారత జట్టు తరపున బరిలోకి దిగిన యువరాజ్ సింగ్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 10 పరుగులిచ్చిన అతను, లిన్ క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో అద్భుతంగా అందుకున్నాడు. నెహ్రా (1/30) ఫర్వాలేదనిపించగా, అతనిలాగే దాదాపు ఐదేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ పేసర్ షాన్ టెయిట్ (0/45)ను భారత బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు. ఇన్నింగ్స్ తొలి బంతిని 150 కిలోమీటర్ల వేగంతో విసరడం మినహా అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

కోహ్లి X స్మిత్
చాలా రోజుల తర్వాత కోహ్లి మైదానంలో మాటల రూపంలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏదో అనడం విరాట్‌కు కోపం తెప్పించింది. జడేజా బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌లో కోహ్లికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వెంటనే ‘ఇటు చూడు. ఇదీ నువ్వు అవుటైన బంతి. దీనిని పట్టుకెళ్లు’ అన్నట్లుగా సైగ చేస్తూ అతని వైపు విసిరాడు. ఆ తర్వాత జట్టు సభ్యులకు కూడా స్మిత్ ప్రవర్తన గురించి కోహ్లి వివరించడం కనిపించింది. అయితే సరిగ్గా ఏం జరిగిందో తెలియకపోయినా... ఒక వైపు బ్యాటింగ్ చేస్తూ మరోవైపు మైక్రోఫోన్ ద్వారా కామెంటేటర్లతో మాట్లాడుతున్న స్మిత్‌ను కోహ్లి తప్పుగా అర్థం చేసుకున్నాడని సమాచారం.

స్కోరు వివరాలు:--
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫాల్క్‌నర్ (బి) షేన్ వాట్సన్ 31; శిఖర్ ధావన్ (సి) మాథ్యూ వేడ్ (బి) షేన్ వాట్సన్ 5; విరాట్ కోహ్లి (నాటౌట్) 90; సురేశ్ రైనా (బి) ఫాల్క్‌నర్ 41; ధోని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1-40; 2-41; 3-175.
బౌలింగ్: షాన్ టెయిట్ 4-0-45-0; రిచర్డ్సన్ 4-0-41-1; ఫాల్క్‌నర్ 4-0-43-1; షేన్ వాట్సన్ 4-0-24-2; బాయ్‌స్ 3-0-23-0; హెడ్ 1-0-9-0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 44; వార్నర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 17; స్మిత్ (సి) కోహ్లి (బి) జడేజా 21; హెడ్ (ఎల్బీ) (బి) జడేజా 2; లిన్ (సి) యువరాజ్ (బి) పాండ్యా 17; వాట్సన్ (సి) నెహ్రా (బి) అశ్విన్ 12; వేడ్ (సి) జడేజా (బి) పాండ్యా 5; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 10; రిచర్డ్సన్ (బి) నెహ్రా 9; బాయ్‌స్ (సి) పాండ్యా (బి) బుమ్రా 3; టెయిట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 151.
వికెట్ల పతనం: 1-47; 2-89; 3-89; 4-93; 5-110; 6-124; 7-129; 8-143; 9-149; 10-151.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-30-1, అశ్విన్ 4-0-28-2, జస్‌ప్రీత్ బుమ్రా 3.3-0-23-3, రవీంద్ర జడేజా 4-0-21-2, హార్దిక్ పాండ్యా 3-0-37-2, యువరాజ్ సింగ్ 1-0-10-0.

గల్ఫ్ మోసాలపై సినిమా...!!!


సిరిసిల్ల రూరల్: గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, నేత కార్మికుల జీవితాలపై సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శక, నిర్మాత వై.సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్ర నిర్మాణ యూనిట్‌తో కలిసి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించి నేత కార్మికుల జీవన విధానంపై అధ్యయనం చేశారు. వస్త్ర పరిశ్రమ, కార్మికుల కష్టాలను సైతం గల్ఫ్ సినిమాలో చూపించనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఎల్లమ్మ దేవాలయం ఆవరణ, దేశాయిపల్లి గుట్టలు, జిల్లెల్లలోని పురాతన గడీని సందర్శించి వాటి చరిత్రను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ పండుగలు, విశిష్టత, ప్రజల జీవన విధానం, వలసలకు కారణాలు, గల్ఫ్ మోసాలు, గల్ఫ్ బాధితుల సమస్యలపై సిరిసిల్ల, పరిసర గ్రామాల్లో పిబ్రవరి 8 నుంచి 11 వరకు పాటలు, సన్నివేశాలను చిత్రికరీంచనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోచంపల్లిలో పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. గల్ఫ్‌లో ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలను కూడా కలసి పలు విషయాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట కెమెరామన్ జయరాం, ఆర్ట్ డెరైక్టర్ నాగు, గల్ఫ్ వలసవాదుల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు జనగామ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ గుగ్గిళ్ల జగన్‌గౌడ్ ఉన్నారు.

తొలిసారి విచారణకు అగ్రిగోల్డ్ చైర్మన్లు...?


విజయవాడ: అగ్రి గోల్డ్ కేసులో నేడు మరోసారి విచారణ జరగనుంది. సహకారశాఖ అధికారులు ఎదుట అగ్రి గోల్డ్ చైర్మన్లు వెంకట రామారావు, శేషు నారాయణ, ఇతర డైరెక్టర్లు తొలిసారిగా హాజరుకానున్నారు.

అగ్రిగోల్డ్ పరివార్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వారు రూ.600 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డిపాజిట్ దారులను సహకారశాఖ అధికారులు విచారించారు.

నేటి వార్తా విశేషాలు...!!!!


నేడు దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కు హెచ్ సీయూ జాక్ పిలుపు
నేడు మధ్యాహ్నం 3గంటలకు గ్రేటర్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై చర్చ
ప్రత్యేక హోదాపై నేడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువభేరి
అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువతతో వైఎస్ జగన్ ముఖాముఖి. అనంతరం కాకినాడ జేఎన్ టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో బహిరంగ సభ.
నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్న మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు
నేడు కేరళ వెళ్లనున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
నేడు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన

మేమిద్దరం స్నేహితులమే...!


- హన్సిక
క్యూట్‌గాళ్ హన్సిక ఆ మధ్య ‘చంద్రకళ’లో బాగానే భయపెట్టగలిగారు. ఈసారి మళ్లీ ‘కళావతి’గా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సుందర్.సి దర్శకత్వంలో  ‘అరణ్మణై-2’  పేరుతో  తమిళంలో  తెరకెక్కిన ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా ‘కళావతి’  పేరిట తెలుగులో అందిస్తున్నాయి. శుక్రవారం ‘కళావతి’ రిలీజవుతున్న సందర్భంగా హన్సిక  ఏమంటున్నారంటే...

* నేను మొదటి నుంచి బబ్లీ గాళ్ తరహా పాత్రలే చేస్తూ వచ్చా. కానీ దర్శకుడు సుందర్ ‘చంద్రకళ’లో గ్రామీణ యువతి పాత్ర చేయించారు. మొదట్లో సందేహించా. కానీ ఆ పాత్ర అందరికీ నచ్చేసింది. ఈ ‘కళావతి’ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో తొలిసారిగా గర్భవతిగా కనిపిస్తాను. గర్భవతులు ఎలా నడుస్తారో గమనించా.

* సిద్ధార్థ్‌తో నాకిది మూడో సినిమా. అతను మంచి కో-యాక్టర్. సుందర్. సి డెరైక్షన్‌లోనే ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ చేశాం. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ఈ సినిమా చేశా.
     
* ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు, త్రిషకు ఏవో మనస్పర్థలు వచ్చాయనీ, త్రిష కోపంగా ఉందనీ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అలాంటిదేం లేదు. నేను వెంటనే కాల్ చేసి ఆమెను అడిగాను కూడా. ఇద్దరం నవ్వేసుకున్నాం. చివరకు మా మధ్య అలాంటిదేమీ లేదని త్రిషే మీడియాలో చెప్పింది. అప్పుడు, ఇప్పుడు మేమిద్దరం స్నేహితులమే. దర్శకుడు సుందర్ నన్నూ, త్రిష, పూనమ్ బజ్వాని ఎలా హ్యాండిల్ చేయాలని భయపడ్డారట. కానీ షూటింగ్‌లో మేమంతా ఫ్రెండ్లీగా ఉండటంతో ఆయనకి టెన్షన్ తీరింది.
     
* విచిత్రం ఏంటంటే, 13 ఏళ్ల తర్వాత నేను చూసిన మొదటి హార్రర్ సినిమా ‘చంద్రకళ’, ఇప్పుడు రెండో సినిమా ‘కళావతి’. నాకు దెయ్యం సినిమాలంటే ఇప్పటికీ భయమే. మా అమ్మ తోడుండాల్సిందే.
     
* సన్నగా ఎందుకయ్యావ్...? అని చాలా మంది అడుగుతున్నారు. ఇది వరకటి హన్సిక అయితే బాగా ఫుడీ. కానీ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందుకే అవసరానికి మించి తినడం లేదు.
     
* నాకు మనసు బాగోలేకపోయినా, ఒత్తిడిగా అనిపించినా పెయింటింగ్స్ వేస్తా. మా అమ్మ కోసం గురునానక్ పెయింటింగ్ వేసి గిఫ్ట్ ఇచ్చా. చారిటీ కోసం ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా.
     
* ఈ ఏడాది నాలుగు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో నాకు సినిమాలు చేయాలనే ఉంది. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాక కుదరడం లేదు. త్వరలోనే తెలుగు సినిమా గురించి ఓ మంచి కబురు వింటారు.

అధర్వ ర్యాగింగ్ చేశారు..?


నటుడు అధర్వ తనను ర్యాగింగ్ చేశారని పేర్కొన్నారు నటి ఆనంది. నటిగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయినా తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆనంది కయల్ చిత్రంతో ఇక్కడ మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా నటింపచేశారంటూ ఆరోపణలతో కాస్త కలకలం సృష్టించిన ఆనందితో చిట్‌చాట్.

ప్ర: మీ గురించి చెప్పండి?
జ: ప్లస్‌టూ చదువుతుండగానే చిత్ర రంగప్రవేశం చేశాను. నేను నటిని కాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అదంటే నాకు చాలా ఆసక్తి. అయితే చదువు పూర్తి చేయమని అమ్మ హితవు పలకడంతో బీబీఏ కోర్స్‌లో చేరాను. ప్రభుసాలోమన్ దర్శకత్వంలో నటించిన కయల్ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఆ చిత్రం తరువాత పలు మంచి అవకాశాలు వరిస్తున్నాయి. కయల్ చిత్రం 2014 చివరిలో విడుదలైంది. 2015లో అధర్వ, దినేశ్, జీవీ ప్రకాశ్‌కుమార్‌లతో నటించిన చిత్రాలు విజయం సాధించాయి. 2016 నూతన సంవత్సరాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కడుతున్న తాజా చిత్ర షూటింగ్‌లోనే జరుపుకున్నాను. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది విజయవంతంగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు పండిగై, పైసల్, జీవీతో చిత్రం అంటూ బిజీగా ఉన్నాను. అలాగే బీబీఏ రెండవ ఏడాది చదువుతున్నాను.

ప్ర: ఒక పక్క నటిస్తూనే బీబీఏ చదువుతున్నారు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్నారా?
జ: లేదు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్న సందర్భాలు ఎదురవ్వలేదు. అయితే మూడవ ఏడాదిలోకి అడుగు పట్టిన తరువాత నేనే ర్యాగింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక కళాశాలలో నాకు ర్యాగింగ్ అనుభవం లేదు గానీ చండీవీరన్ చిత్ర షూటింగ్ సమయంలో  హీరో అధర్వ, ఆ చిత్ర టీమ్ నన్ను ర్యాగింగ్‌తో అల్లరి పెట్టేవారు.

ప్ర: విచారణై చిత్రంలో నటించడానికి సందేహించారట?
జ: నిజమే. కారణం ఆ చిత్రంలో నా పాత్ర పరిధి చాలా తక్కువ. అందుకే అమ్మ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో కయల్ చిత్రంతో నాకు మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రభుసాలోమన్ సలహా అడిగాను. అప్పుడాయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని హితవు పలికారు. ఆ చిత్రంలో తెలుగమ్మాయిగానే నటించాను. అందువల్ల నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇక పండిగై చిత్రంలో కృష్ణకు జంటగా నటిస్తున్నా ను. నటి విజయలక్ష్మి నిర్మాత. ఆమె భర్త ఫి రోజ్ దర్శకుడు. చిత్ర టైటిల్ మాదిరిగానే షూటింగ్ అంతా ఒక ఫెస్టివల్‌లాను జరుగుతోంది. మరో చిత్రం పైసల్. ఇది హారర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. తా జాగా జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నటిస్తున్నాను.

ప్ర: త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీతో కాంప్రమైజ్ అయినట్లున్నారే?
జ: హలో సార్ త్రిష ఇల్లన్నా నయనతార చిత్రానికి సంబంధించి జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ఆ చిత్ర దర్శకుడిపైనే నాకు ఇప్పటికీ కోపం. జీవీ నాకు మంచి ఫ్రెండ్. సాధారణంగా నేనెవరితోనూ స్నేహం చేయను. జీవీ షూటింగ్ స్పాట్‌లో చాలా జాలీగా ఉంటారు. నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు.

ప్ర: నటి శ్రీదివ్య మీకు పోటీ అట?
జ: శ్రీదివ్య నేను ఒక తెలుగు చిత్రంలో కలిసి నటించాం. తను నాకు మంచి స్నేహితురాలు. ఇక నటనా పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదేగా.

సెల్‌ఫోన్‌లో డ్రైవింగ్ లెసైన్స్....?


* వాహన్ బీమా తరహాలో సరికొత్త యాప్
* అన్ని రకాల డాక్యుమెంట్లతో ‘ఎం-వాలెట్’
* త్వరలో ప్రవేశపెట్టనున్న ఆర్టీఏ

సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ వెంట తెచ్చుకోవడం మరిచిపోయారా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారా... ఇక నుంచి ఇలాంటి ఆందోళనలు అవసరం లేదు. జేబులో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకపోయినా సరే నిశ్చింతగా రోడ్డెక్కవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు బెంబేలెత్తవలసిన పనిలేదు. అయితే అందుకోసం చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడమే.

ఆ యాప్ ద్వారా మన డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవడమే. ‘స్మార్ట్’ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న రవాణా శాఖ త్వరలో ‘ఎం-వాలెట్’ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు ఈ-డ్రైవింగ్ లెసైన్స్, ఈ-ఆర్‌సీ, ఈ-ఇన్స్యూరెన్స్, ఈ-పొల్యూషన్ తదితర వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్ బీమా’ తరహాలో ఎం-వాలెట్ సేవలందజేస్తుంది. వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను, వివిధ బీమా సంస్థలకు సంబంధించిన వివరాలను వాహన్ బీమా ద్వారా పొందవచ్చు. అలాగే ఎం-వాలెట్ కూడా వాహనాల డేటాతో నిక్షిప్తమై ఉంటుంది.

పర్మిట్లు కూడా యాప్‌తోనే...
తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా నమోదైన 80 లక్షల వాహనాలు, 60 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌ల డేటాను రవాణా శాఖ నిక్షిప్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, క్యాబ్‌లు, వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. 35 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లున్నాయి. ఈ వివరాలన్నింటినీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. సెంట్రల్ సర్వర్‌ను ‘టీఎస్‌టీడీ’ అనే యాప్‌తో అనుసంధానం చేశారు.

దీంతో అధికారులు తమ సెల్‌ఫోన్‌లోనే వాహనాల వివరాలను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రవేశపెట్టనున్న ‘ఎం-వాలెట్’ను ఈ టీఎస్‌టీడీతో అనుసంధానం చేసి వాహనదారులకు కావలసిన డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్స్యూరెన్స్ తదితర డాక్యుమెంట్ల వివరాలను అందిస్తారు.

భవిష్యత్తులో రవాణా వాహనాల పర్మిట్లను కూడా ఈ యాప్ ద్వారా అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, లారీలు తదితర వాహనాలు నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించి పర్మిట్లను పొందే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు.

ఉద్యోగ అవకాశాలు...!!!


బీహెచ్‌యూ టీచింగ్ ఫ్యాకల్టీ
బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 59. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 10. వివరాలకు www.bhu.ac.in చూడొచ్చు.

 బాబా ఫరీద్ వర్సిటీలో 37 పోస్టులు
 ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఫిజిస్ట్, టెక్నీషియన్  ఫర్ న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నీషియన్, రేడియోథెరపీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 37. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు.

 చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో వివిధ పోస్టులు
 ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. ిపీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేది జనవరి 29. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు.

ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు
కోల్‌కతాలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషరీస్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ వివిధ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్‌‌క,  టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం  ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.cifri.res.in చూడొచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 58 పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 58. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరా లకు www.centralbankofindia.co.in చూడొచ్చు.    

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 22 పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ గ్రేడ్-1, స్టెనో గ్రేడ్-1, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 22. దరఖాస్తుకు చివరి తేది జనవరి 29. వివరాలకు www.npcilcareers.co.in చూడొచ్చు.

 ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌లో 82 పోస్టులు
 ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్)..  వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 82. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 6. వివరాలకు www.rgssh.in చూడొచ్చు.

 ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్‌లో 66 పోస్టులు
 ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్.. ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలోని రాష్ట్రపతి భవన్‌లలో మాలి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 66. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.rashtrapatis achivalaya.gov.in చూడొచ్చు.

ఆ ఉగ్రవాది... అఫ్రిదీ...?


పోలీసు అధికారిపై కాల్పులు జరిపింది అతడే
రియాజ్ భత్కల్ ద్వారా ఐఎంలోకి
2008 నుంచి పూర్తి అజ్ఞాతవాసం

 
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో శనివారం తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఉగ్రవాది ఆలమ్ జబ్ అఫ్రిదీ అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్థారించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉండి, 2008 నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతగాడు ప్రస్తుతం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్‌కు పది రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనేనని దాదాపు నిర్థారించాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపురా ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు.

హలోల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్ర బాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన సైకిళ్లను ఆలమే సమకూర్చాడు. నిఘా, దర్యాప్తు సంస్థలు 2009లో ఐఎం మాడ్యూల్‌ను గుర్తించి వరుస అరెస్టులు చేశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆలమ్ అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ తలదాచుకున్నాడు.
 
మెకానిక్‌గా అవతారం...
దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూర్ రోడ్ దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉంటున్న ఆలమ్... రఫీఖ్ అహ్మద్ పేరుతో మెకానిక్‌గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ ప్రోద్బలంతో కొత్తగా రిక్రూట్ అవుతున్న ‘జునూద్’ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు. బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంపై ఎక్కడ శిక్షణ ఇవ్వాలనే అంశంపై ఈ సంస్థ చీఫ్ ముంబైకి చెందిన ముదస్సిర్‌తో పాటు హైదరాబాదీ నఫీస్ ఖాన్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నాడు. శుక్రవారం వీరు అరెస్టు కావడం, విచారణలో ఆలమ్ పేరు వెలుగులోకి రావడంతోనే ఎన్‌ఐఏ అధికారులు తెలంగాణ అధికారుల సాయంతో శనివారం అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది.

బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయానికి ఈ నెల 21న అందిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనిగానే ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దొడ్డనాగమంగళంలోని ఇతడి ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు ఈ తరహాలోనే రాసి ఉన్న దాదాపు 20 బెదిరింపు లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలమ్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. హత్యాయత్నం కేసులో బెంగళూరు పోలీసు కస్టడీలో ఉండగానే ఇతడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

కుర్రాళ్లూ... కొట్టేయండి..!


నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్
* ఫేవరెట్‌గా భారత్
ఢాకా: ఓవైపు ఉరకలెత్తే ఉత్సాహం... మరోవైపు గెలవాలన్న కసి... వెరసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుర్రాళ్ల క్రికెట్ పండగకు బంగ్లాదేశ్‌లో రంగం సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నాయి. ఫిబ్రవరి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న మాజీ చాంపియన్ భారత్... గ్రూప్ ‘డి’లో ఐర్లాండ్, నేపాల్, న్యూజిలాండ్‌లను ఎదుర్కొంటుంది. గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, ఫిజి, వెస్టిండీస్, జింబాబ్వే; గ్రూప్ ‘బి’లో అఫ్ఘానిస్తాన్, కెనడా, పాకిస్తాన్, శ్రీలంక; గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్, నమీబియా, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ ఉన్నాయి. భద్రతాకారణాలరీత్యా ఆస్ట్రేలియా జట్టు ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. తొలి రోజున బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా; ఫిజీతో ఇంగ్లండ్ ఆడనున్నాయి.

భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో
వార్మప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న యువ భారత్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్ గురువారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఆల్‌రౌండర్లతో పాటు నాణ్యమైన పేస్, స్పిన్ బౌలింగ్ భారత్ సొంతం. అలాగే మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు కూడా కీలకంకానున్నాయి. గతంలో భారత జట్టు 2000లో, 2008లో, 2012లో అండర్-19 ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

లేని అమ్మాయికి కాని రేప్...?


నిజం నిదానంగా చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టివస్తుందట.  సరిగ్గా ఇలాంటిదే ఈ కథ! కామోగెలో పీటర్సన్ అనే ఒక అమ్మాయి రేప్‌కి గురైందని సౌతాఫ్రికాకి చెందిన ఖుతి మెకానానిసె అనే ఒకమ్మాయి ట్వీట్ చేసింది. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా డెబ్భయి ట్వీట్లు చేసింది. ఆ కథ నిజమో కాదో తెలుసుకోకుండా పత్రికలు ప్రచురించాయి, ట్విట్టర్ వీరులు స్పందించారు. సోషల్ మీడియా సలసల మరిగింది. ఆఖరికి ప్రభుత్వ విభాగాలు సైతం స్పందించాయి.

కొందరైతే బాధతో దేశం వదిలేస్తామని మన ఆమీర్ ఖాన్‌లా ప్రకటించేశారు. అంతలో ఖుతి నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టింది. లేని కామోగెలోపై జరగని రేప్ గురించి తాను కట్టు కథ అల్లానని ఒప్పుకుంది. పైగా మహిళలపై అత్యాచారాలను ఎత్తి చూపేందుకే తానిలా చేశానని చెప్పి దులిపేసుకుంది. అంతా బాగుంది. కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు అసలైన ఇష్యూలను నాన్నా పులి కథలా మార్చేసే ప్రమాదం కూడా ఉందని ఖుతిలాంటి వాళ్లు గుర్తుంచుకోవాలి.

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....


తిక్క లెక్క

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు.

ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.


కడప సెంట్రల్ జైలు నుంచి 47 మంది ఖైదీల విడుదల

కడప (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి మంగళవారం 47 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 58 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కడప కేంద్ర కారాగార అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది.

వారిలో 8 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. మహిళలను కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జైలుకు తరలించారు. అక్కడ వారు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 50 మందిలో 47 మందిని మంగళవారం విడుదల చేయగా..మరో ముగ్గురికి వేరే కేసులతో సంబంధం ఉండటంతో విడుదల నిలిపివేశారు.

పాకెట్ లో పాకెట్... ఆ జీన్స్ మతలబేంటి...?


హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా జీన్ ప్యాంట్ల గురించి తెలియని వారుండరు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో పిల్లలు, యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం జీన్స్ అంటే ఒక క్రేజ్ ఉంది. అందరూ ధరిస్తున్న జీన్స్ లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందరూ సాధారణంగా గమనించేదే... కానీ అదెందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా దర్జీ వద్ద షర్ట్, ప్యాంటు ఇంకేదైనా కుట్టిస్తే రహస్యంగా కొన్ని పాకెట్స్ కుట్టించుకునే అలవాటు ఉన్న వారు కూడా ఉంటారు.
 
కానీ జీన్స్ విషయంలో అలా కాదు. అదేమంటే... జీన్స్ ముందు భాగంలో ఉంటే (పాకెట్) జేబులో మరో చిన్న పాకెట్ కూడా ఉంటుంది. అది కూడా ప్యాంటు కుడివైపు ఉండే పాకెట్ లో మాత్రమే. ప్రపంచంలో ఏ జీన్స్ చూసినా ముందుండే పెద్ద పాకెట్ లో పైకి కనిపించే విధంగా ఓ చిన్న పాకెట్. అది చతురస్రాకారంలో కనిపిస్తుంటుంది. ఆ చిన్న పాకెట్ కు కూడా రెండు వైపులా బలమైన బటన్స్ తో ఉంటుంది. అది జీన్స్ ప్రత్యేకత. అయితే ఆ చిన్న పాటి పాకెట్ ఎందుకోసం. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని ఉపయోగమేంటో కూడా తెలియదు. దీనిపై లోతుగా వెళితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీన్స్ అభిమానులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదని తేలింది.
 ఒక మిస్టరీగా మారిన ఈ చిన్న సైజు పాకెట్ పై అమెరికాకు చెందిన ఒక ఫోరం తన బ్లాగ్ ద్వారా దీనిపై ఒక సర్వేను నిర్వహించింది.

ఇంతకూ ఆ బుల్లి పాకెట్ ఎందుకో తెలుసా... అందులో గడియారం (వాచ్) పెట్టుకోవడానికట. గతంలో వ్యాపారాలు చేసే వాళ్లు తమ జాగ్రత్త కోసం, లేదా పశువుల కాపరులు, గుర్రాలపై స్వారీ చేసే పనిలో ఉండే వాళ్లు, కౌబాయ్ లా తిరిగేవాళ్ల అవసరాల కోసం తమ గడియారాన్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఈ బుల్లి పాకెట్ కు శ్రీకారం చుట్టిందట.

పూర్వం 1800 శతాబ్దంలో కౌవ్ బాయ్స్ పొడవాటి చైన్ తో కూడిన వాచ్ లను వాళ్లు ధరించే కోటులోపలి పాకెట్ లో వేసుకోవడం అలవాటు. అయితే అప్పట్లో పదే పదే వాటిని తీసి చూసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ బుజ్జి పాకెట్ రూపకల్పన చేసినట్టు లెవిస్ తెలియజేసింది. పాత కాలంలో చైన్ కలిగి ఉండే వాచ్ లను ఈ బుల్లి పాకెట్ లో దాచుకోవడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు చైన్ వాచ్ లకు కాలం చెల్లింది.

ఈ తరం వారికి ఆ విషయం పెద్దగా తెలియకపోవచ్చు... కానీ చాలా మంది కుర్రకారుకు ఇప్పుడు ఆ బుల్లి పాకెట్ మరో రకంగా ఉపయోగపడుతోంది. నాణాలను అందులో కుక్కేస్తున్నారు. భద్రంగా ఉంటుందని... కీ చైన్ లేకుండా ఉండే కీ ఉన్నా.. ఎస్డీ కార్డు, సిమ్ కార్డు, యూఎస్బీ వంటి చిన్నచిన్నవెన్నో ఆ బుల్లి పాకెట్ లో వేసుకుంటున్నారు. ఏదేమైనా... ఏళ్లు గడిచినా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆ బుల్లి పాకెట్ మాత్రం ఉపయోగ పడుతూనే ఉంది.

టీమిండియా చేతిలో ఆసీస్ చిత్తు...!!


అడిలైడ్:  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 19.3 ఓవర్లలో 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5), ఫాల్కనర్ (10)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది.
తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.


అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా విజయంలో ప్రధాన భూమిక పోషించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


మ్యాచ్ విశేషాలు
*ఈ మ్యాచ్ ద్వారా ట్వంటీ 20 ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్న రెండో  భారత్ ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లి ఒక్కడే భారత్ నుంచి వెయ్యి పరుగుల క్లబ్ లో ఉన్నాడు.

*ట్వంటీ20ల్లో మూడో వికెట్ కు విరాట్-రైనా(134)పరుగుల భాగస్వామ్యమే భారత్ తరపున అత్యధికం కావడం విశేషం.
 
*ట్వంటీ 20ల్లో  ఏ వికెట్ కైనా భారత్ కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం.
*అంతకుముందు అడిలైడ్ లో ఆడిన రెండు ట్వంటీ 20 మ్యాచ్ ల్లోనూ ఆసీస్ విజయం సాధించగా,  ఈ స్టేడియంలో తొలిసారి ఓటమిని ఎదుర్కొంది.