దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో రిటైల్‌ రంగం ఒకటి. మధ్యతరగతి ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరగడం ఇందుకు ఉపకరిస్తున్నాయి. గ్రామీణుల స్థితిగతులు మెరుగవుతుండటమూ కొంత మేర కలిసొస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఏ) పరిమితి పెంపు లాంటి సంస్కరణలు కూడా ఈ రంగ పురోగతిలో కీలక భూమికను పోషిస్తున్నాయి. ఇప్పుడు ఏడో వేతన సంఘం సిఫారసులూ అమల్లోకి వస్తే ఈ రంగానికి మరింత వూతం లభించే అవకాశం ఉంది. అయితే ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. వివిధ రకాల పన్నుల విధానాలు, మరిన్ని పెట్టుబడుల అవసరం, పోటీ అసమానతలు ఈ రంగ జోరుకు కళ్లెం వేస్తున్నాయి.
పురోగతి పథాన్ని వీడొద్దు.. 
దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బాగా వృద్ధి చెందితే.. రిటైల్‌ రంగానికి అంత మేలు జరుగుతుంది. ప్రజల వినియోగ స్థాయిలు పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అందుకే ప్రపంచ మందగమన ప్రభావమెలా ఉన్నప్పటికీ దేశాన్ని వృద్ధి పథాన తీసుకెళ్లే దిశగా బడ్జెట్లో చర్యలు ఉండాలని రిటైల్‌ కంపెనీలు ఆకాంక్షిస్తున్నాయి. సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అంటున్నాయి. ప్రజల ఆదాయ స్థాయిలను, వినియోగదారు విశ్వాసాన్ని పెంచడం పైనా దృష్టి సారించాలని కోరుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి.

జీఎస్‌టీ పైనే ఆశలు: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) త్వరగా అమల్లోకి వస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని రిటైల్‌ కంపెనీలు అంటున్నాయి. జీఎస్‌టీ అమలుతో ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల విధానికి తెరపడనుండటమే ఇందుకు కారణం. ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఏప్రిల్‌ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచిస్తున్నాయి. ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టించడంతో జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం లభించకుండానే గత రెండు పార్లమెంటు సమావేశాలు ముగిసిన సంగతి మనకు తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమోదం లభించకుంటే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారానైనా ప్రభుత్వం జీఎస్‌టీని అమల్లోకి తెచ్చే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు.
అనుబంధ రంగాలకు ప్రోత్సాహం 
రిటైల్‌ రంగ వృద్ధిలో అనుబంధ రంగాల సహకారాన్ని తక్కువ చేయలేం. ముఖ్యంగా రవాణా, వేర్‌ హౌసింగ్‌, లాజిస్టిక్స్‌ లాంటి విభాగాలు పోషించే పాత్ర కీలకం. అందుకే బడ్జెట్లో ఈ విభాగాలకు వూతమిచ్చేలా ప్రోత్సాహక చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని రిటైల్‌ సంస్థలు కోరుకుంటున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు దేశీయ కంపెనీలకు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహాకాలను కల్పించే విధానాన్ని తీసుకొనిరావాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నాయి. బహళ బ్రాండ్‌ చిల్లర వర్తకం (మల్టీ బ్రాండ్‌ రిటైల్‌)లో 100 శాతం ఎఫ్‌డీఐకు అనుమతినివ్వడంతో పాటు రిటైల్‌ (సంప్రదాయ, ఆధునిక విక్రయ సంస్థలు), ఇ-టైల్‌ (ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు) సంస్థల మధ్య పోటీ పరిస్థితుల విషయంలో అసమానతలు లేకుండా చూడాలని కూడా ఆకాంక్షిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందితే రిటైల్‌ రంగానికి వూతం లభిస్తుంది. రిటైల్‌ రంగం రాణిస్తే వినియోగ స్థాయిలు మెరుగువుతాయి. తద్వారా దేశ జీడీపీ పెరగుతుంది. అధిక ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులూ చోటుచేసుకుంటాయి. అందువల్ల దేశ వృద్ధికి మరింత మేలు చేకూరాలంటే ఈ రంగానికి ఇప్పటివరకు అందించిన చేయూత సరిపోదన్న అభిప్రాయం రిటైల్‌ రంగ నిపుణుల నుంచి వస్తోంది. మరిన్ని సంస్కరణలు అవసరం పడతాయన్న మాట వారు చెబుతున్నారు. తగువిధంగానే బడ్జెట్లో ప్రకటనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
భారత్‌లో రిటైల్‌ రంగం తీరూతెన్నూ .. 
జీడీపీలో 10% వాటా, ఉద్యోగ సృష్టిలో 5%

2020 కల్లా దేశీయ రిటైల్‌ పరిశ్రమ వ్యాపారం సుమారు లక్ష కోట్ల డాలర్లకు చేరొచ్చు. ప్రస్తుతం ఈ విలువ 60000 కోట్ల డాలర్లుగా ఉంది.
రిటైల్‌ రంగ విపణి ఏటా 16% వృద్ధి చెందే అవకాశం
మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో ప్రస్తుతం 51 శాతం వరకు ఎఫ్‌డీఐ అనుమతి ఉంది. అదే సింగిల్‌ బ్రాండ్‌ వర్తకంలో 100% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టొచ్చు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.