ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి అడుగు పెడితే మొబైల్ రోమింగ్ ఛార్జీల మోత మోగుతుంది! బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ టెలికాం సంస్థలు మాత్రమే దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సదుపాయం అందిస్తున్నాయి. అలాగే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. ఆ ప్లాన్‌తోనే ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునే సరికొత్త సేవల్ని అందుబాట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. ప్రముఖ చైనా సాఫ్ట్/ హార్డ్‌వేర్ తయారీ సంస్థ లెనొవొ.
కొత్తగా లెనొవొ సంస్థ ‘కనెక్ట్’ అనే అత్యాధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. మొదట ఈ సదుపాయాన్ని చైనాలోని ‘లిమెంగ్ ఎక్స్3’ స్మార్ట్ ఫోన్లు.. ‘యంఐఐఎక్స్- 700’ టాబ్లెట్ వినియోగదారుల కోసం ప్రారంభిస్తోంది.
లెనొవొ సంస్థ ‘కనెక్ట్’ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే.. దాదాపు 50కి పైగా దేశాల్లో ఎక్కడికెళ్లినా రోమింగ్ సమస్య లేకుండా.. ఇంటర్నెట్ సదుపాయాన్ని వాడుకోవచ్చట! త్వరలో యూరప్.. మిడిల్ ఈస్ట్.. ఆఫ్రికాలోని మరో 45 దేశాల్లో థింక్‌ప్యాడ్ ల్యాప్టాప్కూ ఈ సరికొత్త సౌకర్యాన్ని విస్తరించేందుకు లెనొవొ కసరత్తు చేస్తోంది!
ఇప్పటికే లెనొవొ ‘మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్’గా దాదాపు కోటి పది లక్షల మంది ఖాతాదారులకు సేవలందిస్తోంది. తాజాగా ఈ ‘కనెక్ట్’ అనే ఈ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి చేరువవడం ఖాయం! ఈ సదుపాయం వ్యాపార కార్యకలాపాలకోసం తరచూ విదేశీ ప్రయాణాలు చేసే వారికి.. పర్యాటకులకు.. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లెనొవో ప్రతినిధులు చెబుతున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment