వనజాతర: మేడారం సమ్మక్క-సారక్క జాతర నేటి నుంచి ప్రారంభంకానుంది. బుధవారం సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. తెలంగాణ సహా ఐదారు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జనజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు సమ్మక్క-సారక్క గద్దెలను దర్శించుకోగా, బుధవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ప్రధాన ఉత్సవానికి కోట్ల సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉంది.
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. తుని ఘటన,ఎస్సీలను కించపర్చడంతోపాటు వైఎస్సార్ సీపీపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు వైఎస్ జగన్.
రాజ్ భవన్ ఉద్యోగుల కోసం: గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగుల కోసం నూతన ఆవాసాలు, వారి పిల్లల కోసం అత్యాధునిక పాఠశాల భవనం నిర్మాణాలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
మా భూమి: ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వం, ప్రైవేటు భూముల సమగ్రవివరాలతోపాటు క్రయవిక్రయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చిన 'మా భూమి' వెబ్ పోర్టల్ ను డిప్యూటీ సీఎం మహహూద్ అలీ నేడు ప్రారంభించనున్నారు.
తాత్కాలిక శంకుస్థాపన: తుళ్లురు మండలం వెలగపూడిలో నిర్మించతలపెట్టిన ఏపీ తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబునాయుడు నేటి ఉదయం 8:23 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
అగ్రిగోల్డ్ కేసు: అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావు, ఇతర డైరెక్టర్లను నేటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన కస్టడీలోకి తీసుకోనుంది.
శ్రీహరికోట: నేటి నుంచి పీఎస్ఎల్వీ సీ-33 అనుంసంధానం పనులు ప్రారంభం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment