హృదయమెక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది.. అంటూ కపుల్స్ పదే పదే సాంగేసుకోవాల్సిన అవసరం లేదు. అవును మరి.. ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేస్తున్నాయి కొన్ని గాడ్జెట్స్. ఈ వేళలో నీవెక్కడున్నావో అంటూ ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఎప్పుడూ టచ్‌లో ఉంచుతూ బంధాన్ని మరింత గాఢంగా మార్చుతాయి కొన్ని యాప్స్. ఆ విశేషాలు మీకోసం..
కొత్తగా పెళ్లయింది. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఉంది. కానీ ఏం లాభం. వేరు వేరు కంపెనీల్లో ఉద్యోగాలు. పొద్దున లేవగానే హడావుడిగా బయటపడటం. మళ్లీ ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకోవడం. ఇక తియ్యటి కబుర్లు చెప్పుకునే సమయం ఎక్కడిది. ఇది చాలా మంది కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్యే. అయితే కొంచెం ఆలోచిస్తే భాగస్వామి ఎక్కడున్నా కబుర్లు చెప్పుకోవచ్చు. తను ఎక్కడున్నా హృదయ స్పందనను మీరు వినొచ్చు. ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చేయాల్సిందల్లా ఇద్దరూ వేరబుల్స్ ధరించడమే. భాగస్వాములిద్దరూ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నట్లయితే యాపిల్ వాచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. యాపిల్ వాచ్‌లు రెండు సైజుల్లో లభిస్తాయి. 38ఎమ్‌ఎమ్ స్త్రీల కోసం, 42 ఎమ్‌ఎమ్ పురుషుల కోసం ఉద్దేశించినవి. ఆండ్రాయిడ్ ఉపయోగిస్తున్నట్లయితే మోటో 360ని ఎంచుకోవచ్చు. ఇందులో 42 ఎమ్‌ఎమ్ సర్క్యులర్ డయల్ స్త్రీలకోసం, 46 ఎమ్‌ఎమ్ డయల్ పురుషుల కోసం తయారుచేసినవి. ఈ వేరబుల్స్ సహాయంతో మీ షెడ్యూల్స్‌ను సింక్రనైజ్ చేసుకోవచ్చు. మూవీకి వెళ్లాల్సిన తేదీ, డిన్నర్‌కు వెళ్లాల్సిన సమయం తదితర అంశాలను త్వరగా పంపుకోవచ్చు. ఇవే కాకుండా మీ స్వీట్ మెసేజ్‌లను సైతం పంపుకోవచ్చు. మీ భాగస్వామి హార్ట్‌రేట్‌ను ట్రాక్ చేయవచ్చు. ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు తెలుసుకోవచ్చు. తేడా కనిపిస్తే మరింత శ్రద్ధ తీసుకోవడానికి, కేర్ చూపించడానికి అవకాశం లభిస్తుంది. మరో చేతికి ఫిట్‌బిట్ చార్జ్ హెచ్‌ఆర్ లేక మయో ఫ్యూజ్ ఫిట్‌నెట్ బ్యాండ్‌లు ధరిస్తే చాలు. రోజు ఎంత దూరం నడిచారు. ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి. హార్ట్‌రేట్ ఎలా ఉంది తదితర విషయాలు తెలుసుకోవచ్చు. ఫిట్‌బిట్ యాప్ సహాయంతో ఫిట్‌నెస్ గోల్స్ పెట్టుకుని రీచ్ అయ్యేలా చూసుకోవచ్చు. హెల్త్ విషయంలో ఒకరినొకరు కేర్ తీసుకోవడానికి వీలవుతుంది.
గతంలో ఫొటోలను ఆల్బమ్‌లో దాచుకునే వారు. కొన్నిసార్లు ఆల్బమ్ చినిగిపోయేది. ఫొటోలు పాడయైుపోయేవి. వీడియోలు సీడీల్లో పెట్టుకునే వారు. గీతలు పడి సీడీ ఓపెన్ కాకపోతే అంతే సంగతులు. ఈ ఇబ్బందిని దూరం చేసేవే డిజిటల్ ఆల్బమ్‌లు. వీటిలో మీ ప్రతి మధురమైన క్షణాన్ని భద్రపరచుకోవచ్చు. ఎన్ని ఏళ్లు గడిచినా ఇందులో మీ ఫొటోలు, వీడియోలు పదిలంగా ఉంటాయి. సాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ 500 సాలిడ్ స్టేట్ డ్రైవ్ డిజిటల్ ఆల్బమ్‌గా ఉపయోగపడుతుంది. ఈ స్టోరేజ్ డివైజ్ 120 జిబి, 240 జిబి, 480 జిబి కేపాసిటీలో లభిస్తుంది. ఇంపాక్ట్ రెసిస్టెన్స్ మెటీరియల్, రబ్బర్ బంపర్స్ లైనింగ్‌తో డ్రైవ్‌కు పూర్తి భద్రత ఉంటుంది. అంతేకాకుండా మీ డాటాకు పాస్‌వర్డ్‌తో రక్షణ కల్పించుకునేందుకు సెక్యూర్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. మీ ప్రతి స్పెషల్ అకేషన్‌ను ఈ డిజిటల్ అల్బమ్‌లో భద్రపరచుకోవచ్చు.
స్టయిల్‌గా...
గాడ్జెట్స్ ఇప్పుడు యాక్సెసరీస్ రూపంలో వస్తున్నాయి. పెన్‌డ్రైవ్ బ్రాస్‌లెట్ రూపంలో లభిస్తుంది. అలాంటి యాక్సెసరీస్‌ను భాగస్వామికిస్తే సర్‌ప్రైజ్ చేసినట్టవుతుంది. పెన్‌డ్రైవ్ అంటే జేబులో పెట్టుకోవడమో, కీచైన్‌కు తగిలించడమో కాదు. మెడలో ముత్యాలహారంగా ధరించవచ్చు. చేతికి బ్రాస్‌లెట్‌గా వేసుకోవచ్చు. ఈ తరహా పెన్‌డ్రైవ్‌లు ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ డ్రైవ్‌లు 8 జిబి, 16 జిబి కెపాసిటీలో లభిస్తున్నాయి. కార్ప్ బ్రాస్‌లెట్ నెక్లెస్ పెరల్ ఈ కోవకు చెందినదే. చేతికి ధరించినపుడు పెరల్ బ్రాస్‌లెట్‌గా కనిపిస్తుంది. పీసీ యూఎస్‌బీ పోర్టుకు అటాచ్ చేసి ఫోన్ చార్జింగ్ సైతం పెట్టుకోవచ్చు. పురుషులకైతే రవి రతన్ పాలిష్డ్ సిల్వర్ ఒవల్ వైఫై అండ్ స్టోరేజ్ కఫ్‌లింక్స్ ఎంచుకోవచ్చు. ఈ గాడ్జెట్ వైఫై హాట్‌స్పాట్‌గానూ ఉపయోగపడుతుంది. పీసీకి అటాచ్ చేస్తే లాన్ అడాప్టర్‌గానూ పనికొస్తుంది. 2జిబి పెన్‌డ్రైవ్‌గానూ ఉపయోగపడుతుంది.
ఒకే స్మార్ట్‌ఫోన్‌లో లేక ఒకే ఎమ్‌పీ3 ప్లేయర్‌లో ఇద్దరూ మ్యూజిక్ వినడం రొమాంటిక్‌గానే ఉంటుంది. కానీ ఇద్దరూ సంగీతాన్ని ఆస్వాదించలేకపోతారు. ఎందుకంటే ఒకే ఇయర్‌ఫోన్స్‌ను ఇద్దరు వాడటం వల్ల స్టీరియో సరిగ్గా ఉండదు. అయితే ఈ ఇబ్బందిని అధిగమించడానికి టాంగో, ప్లాటెన్ హెడ్‌ఫోన్స్ బాగా ఉపకరిస్తాయి. ఈ హెడ్‌ఫోన్స్ సహాయంతో మీ భాగస్వామితో సంగీతాన్ని షేర్ చేసుకోవచ్చు. మరో హెడ్‌ఫోన్‌ను ఖాళీగా ఉన్న పోర్టులో అనుసంధానం చేస్తే చాలు. ఇద్దరూ ఇష్టమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.
ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, రిలాక్స్ కావాలన్నా మసాజ్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే మసాజ్ కోసం ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఒమ్రాన్ కుషన్ మసాజర్ తీసుకుంటే చాలు. ఆక్యుప్రెషర్ మాదిరిగా పనిచేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. రిలాక్స్ కావడానికి సహాయపడుతుంది. మెడకు కొద్దిపాటి వేడిని అందించి స్టిఫ్‌నెస్ పోయేలా చేస్తుంది. భాగస్వాములిద్దరికీ ఈ మసాజర్ బాగా ఉపకరిస్తుంది. మూవీ చూస్తున్నప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు, రొమాంటిక్ డ్రైవ్‌కి వెళ్లినపుడు ఇద్దరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
వీటి సహాయంతో మీ షెడ్యూల్స్‌ను
ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మూవీకి వెళ్లాల్సిన తేదీ, డిన్నర్‌కు వెళ్లాల్సిన సమయాన్ని భాగస్వామితో షేర్ చేసుకోవచ్చు. స్వీట్ మెసేజ్‌లను పంపుకోవచ్చు. హెల్త్‌ను ట్రాక్ చేయవచ్చు.
BETWEEN AND COUPLETE
కపుల్స్ మధ్య ఎన్నో సంభాషణలుంటాయి. టెక్ట్స్ మెసేజ్‌లు వెళుతూ ఉంటాయి. అవి ఇతరుల చేతుల్లోకి వెళతాయనే భయం ఉండకూడదు. అప్పుడే ఆ కపుల్స్ మధ్య సంభాషణ స్వేచ్ఛగా జరుగుతుంది. ఇందుకోసం ఈ యాప్స్ ఉపయోగపడతాయి. ఈ యాప్స్ సహాయంతో కపుల్స్ ఇద్దరూ కనెక్ట్ కావచ్చు. అయితే ఒక్కరితో మాత్రమే కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ యాప్స్ ప్రైవేట్ స్పేస్‌ను అందిస్తాయి. అందులో మీరు ఫోటోలు, వీడియోలు, ఇతర స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్స్‌ను పంపుకోవచ్చు. ఫస్ట్‌డేట్, పార్ట్‌నర్ బర్త్‌డే, స్పెషల్ డిన్నర్ వంటి వాటిని నోట్ చేసుకోవడానికి కామన్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. స్నూఫింగ్‌కు అవకాశం లేకుండా పాస్‌కోడ్ పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.
కపుల్స్ మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ పోటీ కావాలా? అయితే చరదేస్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ వర్డ్ గెస్సింగ్ గేమ్ మీకు కావలసినంత ఫన్‌ని కూడా అందిస్తుంది. ఈ గేమ్ ఆడటానికి మీ మొబైల్‌ని ఫోర్‌హెడ్ దగ్గర పెట్టుకోవాలి. ఒక వర్డ్ స్ర్కీన్‌పై కనిపించగానే మీ భాగస్వామి దానికి తగినట్టుగా యాక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి ఆ వర్డ్ ఏమిటో మీరు చెప్పాలి. టైం లిమిట్ ఉంటుంది. ఈ యాప్‌ని ఉచితంగా పొందవచ్చు.
భాగస్వామితో కలిసి స్పేష్‌షి్‌పలో ప్రయాణించాలా? మీరిద్దరూ స్పేస్‌షి్‌పను నడుపుకుంటూ వెళ్లాలా? అయితే స్పేస్‌టీమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. కపుల్స్ ఇద్దరూ ముందుగా బ్లూటూత లేక కామన్ వైఫై నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ కావాలి. ఇద్దరూ కనెక్ట్ కాగానే ఫోన్ స్ర్కీన్స్‌పై డాష్ బోర్డ్ ప్రత్యక్షమవుతుంది. స్విచ్‌లు, బటన్స్, డిస్‌ప్లే ప్యానల్ ఇలా స్పేస్‌షి్‌పలో ఎలా ఉంటుందో డిస్‌ప్లే అలా కనిపిస్తుంది. డాష్‌బోర్డ్‌పై కనిపించే కమాండ్స్‌ని ఫాలో అవుతూ వెళ్లాలి. మీరు ఇచ్చే కమాండ్స్‌ని పార్ట్‌నర్ ఫాలో కావాలి. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోకుండా నడపాల్సి ఉంటుంది. ఫన్ కోసం కపుల్స్ ఎంచుకోదగిన గేమ్ ఇది. ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
సినిమా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ తను మాత్రం ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వస్తున్నాను, ట్రాఫిక్‌లో ఉన్నానని అంటున్నారు. అయితే ఫోన్ ఎన్ని సార్లు చేస్తారు? పదే పదే ఫోన్ చేస్తే ఎవ్వరికైనా విసుగొస్తుంది. అందుకే ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఈ ట్రాకింగ్ యాప్ సహాయంతో తన లోకేషన్‌ని తెలుసుకోవచ్చు. ఇంటికి చేరుకోవడానికి ఎంత టైమ్ పడుతుందో తె లిసిపోతుంది. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక షేర్ లొకేషన్‌ని ఎంచుకుని వాట్సప్ మెసేజ్ లేక ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్ చేసుకోవాలి. దీనివల్ల భాగస్వామికి ఒకలింక్ అందుతుంది. ఆ లింక్ సహాయంతో లొకేషన్ తెలుసుకుంటారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment