ఆమె అక్కడెక్కడో కాలిఫోర్నియాలో... ఈయన ఇంకెక్కడో న్యూయార్క్ లో... ఆమె చెట్టు మీద ఉసిరి.... ఈయన సముద్రంలో ఉప్పు... ఆమె ముగ్గురు పిల్లల తల్లి.... ఈయన ఒంటరి పక్షి. ....ఇద్దర్నీ కలిపింది ఆధునిక పెళ్లిళ్ల పేరయ్య. పేరు ఇన్ స్టాగ్రామ్. అవును ఆర్ట్‌వాన్ అనే అతనికి ఎరికా హారిస్ అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ లో కలిసింది.. లైక్ లు కలిశాయి. షేర్లు పెరిగాయి. కామెంట్లతో మొదలై కాల్స్‌దాకా ఎదిగింది దోస్తీ. ఫైనల్‌గా వాళ్లిద్దరూ కాలిఫోర్నియా విమానాశ్రయంలో కలుసుకున్నారు. సరిగ్గా పది నిమిషాలు కలుసుకున్నారో లేదో ఒక రి కోసం ఇంకొకరు పుట్టామని వారు తెలుసుకున్నారు. ఆర్ట్‌వాన్ మోకాళ్ల పై కూర్చుని ‘విల్ యూ మ్యారీ మీ‘ అన్నాడు. ఎరికా హారిస్ ముందుకు వంగి ముద్దు పెట్టుకుంది.

అంతే ... మరో రెండు నిమిషాల తరువాత విమానాశ్రయంలోనే వివాహం చేసేసుకున్నారు. అక్కడ్నుంచే హనీ లాంటి పెళ్లాం, మూన్ లాంటి మొగుడూ కలిసి హనీమూన్ కి వెళ్ళారు. హారిస్ మొత్తం మీద అదృష్టవంతుడు.  ఒక పెళ్లాన్ని తెచ్చుకుంటే ఉచితంగా ముగ్గురు బిడ్డలు కూడా వచ్చేశారు. ఇన్‌స్టాగ్రామ్ యుగంలో అన్నీ ఇన్‌స్టాంటే మరి.

Post a Comment

Powered by Blogger.