సిటీబ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో ఓటు హక్కు ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈసారి ఆయన కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో కాపు ఐక్యగర్జన సభ నేపథ్యంలో ఉద్రిక్తత, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది పూర్తయిన వెంటనే మళ్లీ కేరళ షూటింగ్‌కు వెళ్లిపోవడంతో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

Post a Comment

Powered by Blogger.