సరైన సమయంలో వైద్యసదుపాయం అందక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలలెక్కలు చెబుతున్నాయి. భారతలో ఏటా రోడ్డుప్రమాదంలో 1.50లక్షల మందికిపైగా ప్రాణాలొదులుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ చెబుతోంది. ఇందులోనూ బ్రెయిన్‌డెడ్ కేసుల తర్వాత ప్రమాదస మయంలో షాక్‌కు గురై హార్ట్ సో్ట్రక్‌తో కన్నుమూస్తున్నవారి సంఖ్యే ఎక్కువ. సహజంగానే ప్రమాదం జరిగినప్పుడు జనం గుంపులు గుంపులు చేరడం, 108 వంటి సర్వీసులకు ఫోన్ చేయడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తారు. దానితో పాటు పరిస్థితులను బట్టి ప్రథమ చికిత్స అందించడం ద్వారా నిండు ప్రాణాలు నిలపవచ్చు అంటున్నారు వైద్యులు. అంతేకాదు ఇంట్లో, ఆఫీసులో ఇలా మన కళ్ల ముందే గుండె పోటుతో కొనూపిరితో ఉన్న వ్యక్తి ప్రాణాలు నిలపడానికి ప్రథమ చికిత్స ద్వారా ప్రయత్నించవచ్చు. అయితే ఆ పరిస్థితులపై కచ్చితమైన అవగాహన అవసరం. లేకుంటే అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాపాడాలనే ప్రయత్నంతో హానికూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరికీ ప్రథమ చికిత్సా పద్ధతులపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో మోహన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లలిత రఘురాం 2013లో ‘‘స్వామినారాయణ్ లైఫ్ సేవర్స్’’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, కార్పొరేట్ ఆఫీసులు వంటి ప్రదేశాలలో ప్రథమ చికిత్స పద్ధతులపై ఒకరోజు అంతా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘నగరంలోని ప్రతి ఒక్కరికీ ఫస్ట్‌ఏయిడ్‌పై అవగాహన కల్పించడమే మా కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అంటున్నారు’’ మోహన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లలిత రఘురాం.
లైఫ్ సేవ్‌చేయవచ్చు ఇలా!
హార్ట్ సో్ట్రక్‌కు గురైన వ్యక్తికి ప్రథమ చికిత్సగా మొదట ఆస్పరిన్ మాత్ర రోగి నాలుక కింద ఉంచాలి. ఇంకా పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండి చలనం లేకుండా పడిపోయి ఉంటే, ఆస్పత్రికి చేరుకునేలోపు ఆ వ్యక్తినోటిలో నోరుపెట్టి గాలి అందించాలి. దాన్నే మౌత రిస్పిరేషన్ అంటారు. అదిచేస్తూనే గుండెపై చేతులతో ఒత్తుతుండాలి. ఆ సమయంలో పక్కటెముకలపై ఒత్తిడి వేయకుండా జాగ్రత్తపడాలి. దాన్నే చెస్ట్ కంప్రెషన్స్ అంటారు. రోగి పరిస్థితికనుగుణంగా ఈ చికిత్స అందించాలి.
సహజంగా రోడ్డు ప్రమాదాలకు గురైనవారు ఎక్కువమంది షాక్‌కు గురవుతారు. ఆ షాక్ వల్ల హార్ట్ ఆగిపోవడం. తర్వాత బ్రెయిన్ డెడ్ అవడం కూడా జరుగుతుంటాయి. కనుక ప్రమాదానికి గురైన వ్యక్తి షాక్‌కు గురైనట్లైతే వెంటనే ఆ వ్యక్తికి మౌత రిస్పిరేషన్, చెస్ట్ కంప్రెషన్స్ అందించాలి.
రోడ్డు ప్రమాద బాధితుల తల కింద దిండులాంటివి ఏమీ ఉంచకూడదు.
నీళ్లు ఎక్కువ తాగించకూడదు. ఎక్కువ తాగించడం వల్ల ఊపిరితిత్తులలోకిచేరే ప్రమాదముంటుంది.
బాధితుడ్ని ప్రమాద స్థలం నుంచి లేక ఆసుపత్రికి చేరవేసే సమయంలో మెడ, తల భాగాల వద్ద పట్టుకునే విధానంలో చాలా జాగ్రత్త వహించాలి.
ఎంత త్వరగా బాధితులకు వైద్యం అందితే, అంతే ఎక్కువగా ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు.
తన కొడుకులా మరెవరికీ జరగకూడదనే
2012లో ఇంజనీరింగ్ చదువుతున్న 22ఏళ్ల స్వామినారాయణ్ సెలవుల్లో నాగార్జున సాగర్ యాత్రకు వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. రోడ్డుపై రక్తపుమడుగులో పడిఉన్న ఆ యువకుడిని చూస్తూ జనం అయ్యోపాపమని గుమిగూడారే తప్ప సాయం అందించడానికి ముందుకొచ్చినవారే లేదు.
కొద్దిసేపటి తర్వాత అటుగా వెళుతున్న పాలవ్యాను డ్రైవర్ స్పందించి అతన్ని ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే జరగరానిది జరిగిపోయింది. బ్రెయిన్ డెడ్ . ఆలస్యం కాకుంటే మీ బిడ్డ బతికేవాడు అన్న డాక్టర్ మాటలు ఆ తల్లి గుండెను కదిలించాయి. అదే ప్రథమ చికిత్స అందించే ధైర్యం, అవగాహనఉన్నవారు అక్కడుంటే నాబిడ్డ బతికేవాడు కదా! అన్నఆలోచన ఆ తల్లి మదిలో నాటుకుపోయింది. మరెవ్వరికీ ఈ కష్టం కలగకూ డదనే ప్రధాన ఉద్దేశంతో స్వామినారాయణ్ లైఫ్‌సే వర్స్ కార్యక్రమానికి నాంది పలికారు ఆ మాతృమూర్తి. ఆమె మరెవరో కాదు లలిత రఘురాం
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment