తిరువొత్తియూరు: జాతీయ జెండాకు నిప్పంటించి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌లో ఉంచిన చెన్నైకుచెందిన యువకుడి కోసం గాలిస్తున్నారు. నాగపట్నం జిల్లా, నల్లూరు సౌత్  పోయగై ఆల్వార్ కు చెందిన దిలీప్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడు.చెన్నై ,పులియాన్‌తోపులో నివాసం ఉంటున్న ఇతను జాతీయ జెండాకు నిప్పుంటించి ఆ దృశ్యాలను వాట్సాప్‌లో ఉంచి తన పేరు,పోటోలను పంపించారు.ఇది చూసిన హిందూ మక్కల్ మున్నని పార్టీ కి చెందిన వారు పులియాన్‌తోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని జాతీయ జెండాను అగౌరవం చట్టం క్రింద దిలీప్‌ను అరెస్టు చేయడానిక గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

Powered by Blogger.