కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాలో హీరో నాని బాలయ్య బాబు ఫ్యాన్.
అదే సినిమాలో జెస్సీ అనే బొమ్మకు బంగారంలాంటి ఓ చిన్నారి ఫ్యాన్ ఉంది.
నెత్తి మీద చిట్టి పిలక.. చేతుల్లో ఎప్పుడూ ఓ బొమ్మ.. ముద్దు ముద్దు మాటలు.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ చిట్టితల్లికి ఫ్యాన్ అయిపోయారు. అట్లాంటా నుంచి వచ్చి.. తొలి సినిమాతోనే భళా అనిపించుకున్న ఈ బాలనటి ముద్దుముచ్చట్లను ఆమె తల్లిదండ్రులు ప్రీతి,సంజయ్‌లు ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.
మా బంగారం పేరు నైనా. సినిమాలో హీరో నానికి చెప్పిన పేరు చిన్నారి పెళ్లి కూతురు. ఇప్పటికైతే తన సొంత పేరు కన్నా.. ఈ పేరుతోనే ఎక్కువ పాపులర్ అవుతోంది. ఇప్పుడైతే తెలుగులో గలగలా మాట్లాడేస్తోంది. ఆరు నెలల కిందట అమ్మా, నాన్న.. ఇంకా ఏవో చిన్న మాటలు తప్ప తెలుగు వచ్చేది కాదు. సినిమా షూటింగ్ జరిగిన ఆరు నెలల్లో తెలుగు బాగా నేర్చేసుకుంది. డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. మొత్తానికి ఈ సినిమాతో మా బంగారానికి తెలుగు వచ్చేసింది.
ఎక్స్‌ప్రెషన్స్ నచ్చి..
సినిమా అవకాశం అనుకోకుండా వచ్చింది. ఫోర్టీన్ రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు ముగ్గురు బాలనటులు కావాలని ఆన్‌లైన్‌లో ఇచ్చిన యాడ్ చూశాం. పాప ఫొటోలు పంపించాం. వాళ్లేదో స్ర్కిప్ట్ పంపించి.. పాపతో వీడియో తీసి పంపమన్నారు. అప్పటికి తనకు మూడున్నరేళ్లే. వీడియో తీసి పంపించాం. డైలాగ్‌ల విషయం ఎలా ఉన్నా.. తన ఎక్స్‌ప్రెషన్స్ బాగా నచ్చడంతో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. పాపకు వీసా రావడం నెలన్నర ఆలస్యమైనా.. తన కోసం వెయిట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. షూటింగ్‌లో ఎలా ఉంటుందో అని భయపడ్డాం. తనతో పాటు వాళ్లమ్మ వెళ్లింది. సినిమాలో లొకేషన్లన్నీ దాదాపుగా పల్లెలే. పైగా యూనిట్ సభ్యులు, చుట్టూ జనాలు.. అంతా కొత్తే. కానీ, ఆ వాతావరణానికి వారంలో అడ్జస్ట్ అయిపోయింది. డైరెక్టర్ ఏం చెబితే అది టక్కున చేసేసేది. ఎక్కడ విసిగించలేదు. నానితో పాటు యూనిట్ మొత్తం తనను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. దీంతో ఎలాంటి బెరుకు లేకుండా నటించగలిగింది. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఆ విషయాలన్నీ కథలు కథలుగా చెప్పేది.
బాగా కలిసిపోయింది..
హీరో నానితో బాగా క్లోజ్ అయిపోయింది. ఎంతలా అంటే.. షాట్ గ్యాప్‌లో నాని దగ్గరే ఉండేది. తనతో ఏవేవో ఆటలు ఆడుకునేది. లంచ్ కూడా తనతోనే కానిచ్చేసేది. మిగతా ఇద్దరి పిల్లలతో కూడా బాగా కలిసిపోయింది. సినిమాలో ఫైటింగ్ సీన్లలో నిజంగానే భయపడింది. అవుట్‌పుట్ సహజంగా రావడానికి అది బాగా ప్లస్ అయింది. సినిమాలో తన నటన చూసి చాలా మంది ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. అట్లాంటాలో మన తెలుగువాళ్లంతా కలిసి ‘మీట్ ది లిటిల్ స్టార్’ అనే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తన సక్సెస్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది.
అమ్మ తెప్పిస్తానంది..
‘‘షూటింగ్‌కు వచ్చాక నా చేతిలో ఓ బొమ్మ పెట్టారు. దాని పేరు జెస్సీ. ఆ బొమ్మను ఎప్పుడూ ఎత్తుకునే ఉండాలి. నేను చిన్నపిల్లను కదా.. ఎత్తుకుని, ఎత్తుకుని చేతులు లాగేసేవి. ఎంత బరువనిపించేదో. అది కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అమెరికా వచ్చేటప్పుడు జెస్సీని తెచ్చుకోవడం మరచిపోయాను. అమ్మ తెప్పిస్తానని చెప్పింది.’’
నాని అంకుల్‌తో సరదాగా ఆడుకున్నా. నేను ఏమన్నా కాదనేవాడు కాదు. నాతో ఎన్ని ఫొటోలు దిగాడో. జెస్సీకి గన్ పెట్టి బెదిరించినపుడు నిజంగానే బాధేసింది.
నాకు ఓ అన్న ఉన్నాడు. నేను షూటింగ్ కోసం ఇండియాకు వచ్చినపుడు తను నాన్నతో అమెరికాలోనే ఉండిపోయాడు. షూటింగ్‌లో నాకు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు. మేం ముగ్గురం సెట్‌లో బాగా ఆడుకునేవాళ్లం. అప్పుడప్పుడూ పోట్లాడుకున్నా, మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయేవాళ్లం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment