మల్లీశ్వరిలా టాలీవుడ్‌ను మురిపించింది. బాలీవుడ్‌లో అందాల భామగా అలరించి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కత్రినా కైఫ్. రకరకాల పాత్రలు ఎన్ని పోషించినా.. రొమాంటిక్ గాళ్‌గా కనిపించడమే తనకిష్టమని అంటున్న కత్రినా ‘నవ్య’తో మరిన్ని విశేషాలను పంచుకుంది.
యాక్షన్ నుంచి రొమాంటిక్‌లోకి వచ్చినట్టున్నారే..?
(నవ్వుతూ) కొన్నాళ్లుగా యాక్షన్ మూవీసే అయిపోయాయి. ‘జబ్ తక్ హై జాన్’ సినిమా తర్వాత మళ్లీ ఫుల్‌లెంగ్త్ రొమాంటిక్ రోల్ ‘ఫితూర్’లో చేశాను. ఈ ఏడాది రాబోతున్న మిగిలిన సినిమాల్లో కూడా రొమాంటిక్‌గానే కనిపిస్తాను. నా వరకైతే యాక్షన్ కన్నా.. రొమాంటిక్ గాళ్ పాత్రలంటేనే ఇష్టం.
ఫితూర్ జోడి ఆదిత్య గురించి చెప్పండి?
సినిమాలో మా జోడి బాగా కుదిరింది. ఇంతకు ముందు కలిసి నటించాలని ఇద్దరికీ ఉండేది. ‘ఫితూర్’ ద్వారా ఆ అవకాశం లభించింది. ఆదిత్యలో మంచి నటుడున్నాడు. అంతేకాదు అతడు మంచి సింగర్ కూడా. తను గిటార్ వాయిస్తూ పాడుతుంటే.. చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. వెరీ స్వీట్ వాయిస్ తనది.
మీరూ గొంతు కలిపారా?
ఆ సాహసం మాత్రం చేయలేదు. ఎందుకంటే నా గాత్రం చాలా చెత్తగా ఉంటుంది. నాకు పాడటం అస్సలు చేతకాదు. డ్యాన్స్ చేయమంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించను. డ్యాన్స్ అంటే అంత ఇష్టం నాకు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా నాలుగు స్టెప్పులు వేస్తుంటా. పని ఒత్తిడి ఉన్నా డ్యాన్స్ ద్వారానే రిలాక్స్ అవుతా. ఐ లవ్ డ్యాన్స్.
‘జగ్గా జాసూస్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో మళ్లీ నటిస్తున్నారు. మీ ఇద్దరి కెమిసీ్ట్ర గతంలో మాదిరిగా వర్కవుట్ అవుతుందా..?
మేమిద్దరం జంటగా చేసిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’, ‘రాజ్‌నీతి’లో మా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ‘జగ్గా జాసూ్‌స’కు అదే స్థాయిలో అలరిస్తుంది. ఇందులో మా కెమిసీ్ట్ర ఇంకా బాగుంటుంది.
మీ ఇద్దరి గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి కదా?
మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, విడిపోయామని ఇలా రకరకాల వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. గాసిప్స్ అంటారా.. నేను పెద్దగా పట్టించుకోను. కానీ, పారితోషికం విషయంలో వచ్చే గాసిప్స్ మాత్రం నిజమైతే బాగుండనిపిస్తుంటుంది.
అసలు రిలేషన్స్‌లో విభేదాలు రావడానికి కారణాలు ఏమంటారు..?
ఒక్కోసారి మూడోవ్యక్తి జోక్యం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. మనలో కమిట్‌మెంట్ లేకపోయినా రిలేషన్స్ కంటిన్యూ చేయలేం. అయితే అవతలి వారి వ్యక్తిత్వాన్ని బట్టి వీటి ప్రభావం ఉంటుంది.
ప్రేమికులిద్దరి మధ్య అనుబంధం గట్టిగా ఉండటానికి మీరిచ్చే సలహా?
ఇద్దరికీ విశ్వనీయత ఉండాలి. అప్పుడే బంధాలు బలంగా ఉంటాయి. ప్రేమికులిద్దరూ ప్రతి రోజూ కొత్తగా, సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ దిశగా కనీసం ప్రయత్నమైనా చేయాలి.
ఫ్యాషన్ పరంగా ప్రతి సినిమాకు ఏదో డిఫరెంట్ చూపిస్తుంటారు. మీరిచ్చే స్టయిల్ స్టేట్‌మెంట్?
‘ఫితూర్’ సినిమా కోసం డిఫరెంట్ హెయిర్ కలర్ వాడారు. అది బాగా క్లిక్ అయింది. ఏదో సరదాగా చేసినవి కూడా కొన్ని కొన్నిసార్లు కొత్త ట్రెండ్స్‌గా మారిపోతుంటాయి. ఇక్కడో విషయం చెప్పాలి. నేను డ్రెస్ కోడ్ కూడా సి్ట్రక్ట్‌గానే ఫాలో అవుతుంటా. మూడ్‌ను బట్టి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. నేనెప్పుడైనా మూడీగా ఉంటే బ్రైట్ కలర్స్ డ్రెస్ ధరిస్తాను. అలాంటి కలర్స్ మనల్ని బూస్టప్ చేస్తాయి.
మీ పుట్టినరోజు, స్పెషల్ అకేషన్స్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?
ఏదీ ముందుగా ప్లాన్ చేయను. ఏ షూటింగులూ లేకుండా ఖాళీగా ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటా. షూటింగ్‌లో ఉంటే యూనిట్ సభ్యులే సెలబ్రేట్ చేస్తారు.
సెలబ్రిటీ హోదా, బిజీలైఫ్.. మీ జీవితంలో ఇంకేదైనా మార్పు కోరుకుంటున్నారా?
నేనైతే ఎలాంటి మార్పూ కోరుకోవడం లేదు. ఎందుకంటే ఎంతో గొప్ప జీవితం అనుభవిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్నవన్నీ నాకు లభిస్తాయని నమ్ముతున్నాను. ఇంతకంటే ఏం కావాలంటారు.
తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు..?
తెలుగులో మల్లీశ్వరి, అల్లరిపిడుగు రెండు సినిమాలు చేశాను. మల్లీశ్వరి షూటింగ్ టైమ్‌లో వెంకటే్‌షగారు ‘ప్రతి రోజూ మెడిటేషన్ చేయండి’ అని చెప్తుండేవారు. తప్పకుండా చేస్తాను అనేదాన్ని. ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఎన్నో ఉన్నాయి. మంచి స్ర్కిప్ట్ వస్తే తెలుగులో తప్పకుండా నటిస్తా. బాహుబలి డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయాలని ఉంది.
కత్రినాకైఫ్‌ను బాలీవుడ్ జనాలు ముద్దుగా ‘క్యాట్’ అని పిలుస్తారు. విద్యాబాలన్, ప్రియాంక చోప్రాల మాదిరిగా మహిళా ప్రాధాన్యత సినిమాల్లో నటించలేదు. అయినా సరే కత్రినా కథానాయికగా నటించిందంటే చాలు సినిమాకు పాపులారిటీ వస్తుంది. దట్ ఈజ్ కత్రినా.
ఐశ్వర్యారాయ్ తర్వాత బాలీవుడ్‌లో అంతటి పేరున్న కథానాయిక కత్రినానే. 2003లో ‘బూమ్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన కత్రినా ‘సర్కార్’, ‘నమస్తే లండన్’, ‘వెల్‌కమ్’, ‘రేస్’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘న్యూయార్క్’ సినిమాలతో పేరు సంపాదించుకుంది. దర్శకుడు ప్రకాష్ ఝా రూపొందించిన ‘రాజ్‌నీతి’ ఆమెలో అసలైన నటిని పరిచయం చేసింది. కత్రినా కెరీర్‌నూ మలుపుతిప్పిన చిత్రమిది.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సల్మాన్‌ఖాన్‌తో దోస్తీ చేసింది. సల్మాన్ జైల్లో ఉన్నపుడు ఆయన్ను కలవటానికి వెళ్లి తన ప్రేమను చాటుకుంది. కత్రినా స్కర్ట్స్ వేసుకోవటం నచ్చదని సల్మాన్ కామెంట్ చేసినా ఆమె అంతగా పట్టించుకోలేదు. కూల్‌గా ఆ కండల వీరుడికి గుడ్‌బై చెప్పేసి రణ్‌బీర్‌కపూర్‌తో జట్టుకట్టింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment