కార్లు తుడుస్తున్న పారా స్విమ్మర్‌
రోజు గడవడానికి పాట్లు
ఆహారం కోసం బిచ్చమెత్తిన వైనం
సాయం కోసం ఎదురు చూపులు

న్యూఢిల్లీ: పుట్టుకతోనే ఓ చేయి లేదు.. అయినా అధైర్యపడలేదు. వైకల్యాన్ని నిందిస్తూ కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో కఠోర సాధన చేశాడు.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికే వన్నె తెచ్చిన పారా స్విమ్మర్‌గా ఎదిగాడు. కానీ కడు పేదరికం అతడి ప్రతిభకు గ్రహణంలా పట్టింది. నేడు రోజు గడవడానికి కార్లు తుడవాల్సిన దుస్థితి దాపురించింది. చేయిలేకపోయినా ఎప్పుడూ చింతించలేదు. సాయం చేసే చేతుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు. ఆదుకుంటే ప్రపంచ స్థాయి పతకాలను మరిన్ని దేశానికి అందిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అతనే హర్యానాకు చెందిన భరత కుమార్‌. అంతర్జాతీయస్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన పారా ఒలింపిక్‌ స్విమ్మర్‌ భరత 2005 జూనియర్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌, 2009 వరల్డ్‌ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించాడు. 2010 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. సహజంగా అంతర్జాతీయ పతకం సాధించిన తర్వాత ఆ క్రీడాకారుడి జీవితమే మారిపోతుంది. కానీ భరత కుమార్‌ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రోజు గడవడానికి కార్లను తుడిచి రూపాయి.. రూపాయి సంపాదించాల్సి వస్తోంది. భరతకు పుట్టుకతోనే ఎడమ చేయిలేదు. తల్లిదండ్రులు కూలీలు కావడంతో ఆరుగురు సంతానంలో వైకల్యంతో పుట్టిన భరత మరింత భారమయ్యాడు. కడు పేదరికం కావడంతో అతడి తల్లిదండ్రులు చిన్నతనంలో పశువులు కాసేందుకు ఘజియాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపారు. కొంత కాలం అక్కడ ఆ పనిచేస్తూ ఈతవైపు ఆకర్షితుడయ్యాడు. ఓ చేయి లేకపోయినా అద్భుతంగా ఈదడం ప్రాక్టీస్‌ చేసి 50 పతకాలు నెగ్గాడు.

తిండి కోసం గుడి ముందు..
నెహ్రూ స్టేడియంలో భరత్ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు తిండి కోసం బిచ్చమెత్తాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది. తగిన ఆహారం కొనుగోలు చేసేంత సొమ్ము లేకపోవడంతో.. గుడి ముందు బిచ్చగాడిలా అడుక్కునే వాడినని భరత ఎంతో బాధగా చెప్పాడు. ఎంతో మంది సెలబ్రిటీలను సాయం చేయాల్సిందిగా వేడుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు. చివరి ఆశగా ప్రధాని మోదీకి లేఖ రాశానని ఈ పారా స్విమ్మర్‌ చెప్పాడు. సా యం చేసే వాళ్లనే తనకు మరో చేయిగా భావిస్తానని అంటున్నాడు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.