ఒక మనిషి ఆలోచనలను తన మాటల ద్వారా, చేతల ద్వారా తెలుసుకోవచ్చంటుంటారు. ఓ వ్యక్తి ఆనందంగా ఉన్నాడా.. బాధలో ఉన్నాడా.. తీవ్రమైన నిరాశలో ఉన్నాడా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సూత్రాలను ఉపయోగించే వేలాది ప్రాణాలను కాపాడే పనిలో పడిందీ ఫేస్బుక్ యాజమాన్యం. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని పోస్టింగ్స్ ద్వారా గుర్తించి వారికి కౌన్సిలింగ్‌తోపాటు సహాయాన్ని కూడా అందించేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ తరహా ప్రయత్నం చేస్తున్న ఫేస్బుక్.. ఇప్పుడు బ్రిటన్‌లోనూ బాధాతప్త హృదయులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోస్టింగ్స్‌ను ఆధారం చేసుకుని వ్యక్తి ఆలోచనలను కనిపెట్టే టూల్‌ను ఒకదాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేస్తారు. దీన్ని మానిటర్ చేయడానికి ప్రత్యేకమైన బృందం ఉంటుంది. బాగా డిప్రెషన్లో ఉన్న వ్యక్తి తారసపడినట్లయితే వెంటనే ఫేస్బుక్ బృందానికి మెసేజ్ వెళ్తుంది.
ఈ బృందం 24గంటలపాటూ పనిచేస్తూనే ఉంటుంది. వీలునుబట్టి ఆ వ్యక్తిని నేరుగా కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సమయం అధికంగా ఉంటే బయటనుంచి సహాయం అందించే స్వచ్చంద సంస్థలకు ఈ సమాచారం చేరవేస్తుంది. వారు వ్యక్తిని నేరుగా కలిసి కౌన్సిలింగ్ ఇస్తారు. దాంతోపాటు వ్యక్తి ఫేస్బుక్ పేజీకి కూడా ఓ మెసెజ్‌ను పంపిస్తారు. వ్యక్తికి భరోసా కల్పించే విధంగా మేమున్నాం అనే సందేశాన్ని పంపిస్తారు. తమతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడవచ్చనీ, లేకుంటే ఏమయినా సలహాలు కూడా ఇవ్వగలమనీ , మీ వెంట తాము ఉన్నామనీ భరోసా కల్పించే సందేశాన్ని వ్యక్తి ఫేస్బుక్ పేజీకి పంపిస్తారు. యూకేలో సగానికి పైగా జనాభా ఫేస్బుక్ అకౌంట్‌ని కలిగిఉన్నారనీ, 2013లో 6708 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఫేస్బుక్ బృంద సభ్యులు తెలిపారు. రోజుకు 18మంది ఆత్మహత్య చేసుకుంటున్నారనీ, అందుకే వారి భద్రతకోసం ఈ విధమైన ఏర్పాటు చేశామని వారు తెలిపారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఈ సర్వీసును అందిస్తామని చెప్పారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment