నటీనటులు : సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, అశుతోష్ రానా, పవిత్ర లోకేష్, ముకేష్ రుషి, తులసి, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, అజయ్, బ్రహ్మానందం, సుమన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు
ఎడిటర్ - గౌతం రాజు
సంగీతం - దినేష్
ఫైట్ మాస్టర్ - అనల్ అరసు
ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్
సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్
నిర్మాత - రాజు
కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం- వాసు వర్మ
స్టార్ కమెడియన్‌గా ఎదిగిన ‘అందాల రాముడు’ హీరోగా టర్న్ అయ్యాక ‘మర్యాద రామన్న’లా మారాడు. తర్వాత తన కెరీర్ అంతా.. అప్ అండ్ డౌన్స్‌తో కంటిన్యూ అవుతూ వచ్చింది. అలాంటి తరుణంలో ఒక సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ‘పూలరంగడు’.. వాసువర్మ దర్శకత్వంలో ‘కృష్ణాష్టమి’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ రెండేళ్ల తర్వాత వచ్చిన ఈ మిస్టర్ పెళ్లికొడుకు, అలాగే ‘జోష్’ అంటూ ఏడేళ్ల క్రితం వచ్చిన వాసువర్మ, సక్సెస్‌పుల్ నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’తో వీరంతా పండుగ చేసుకుంటారా లేదా తెలియాలంటే....కథలోకి వెళ్లాల్సిందే.
కథ : ఎదుటివాడి ముఖంలో సంతోషం చూడడం కోసం ఎంతదూరమైన వెళ్లొచ్చనేది ఈ సినిమాలో హీరో సునీల్ ఫిలాసఫీ. గోల్డెన్ స్టార్ టైటిల్ కార్డ్‌తో తెరమీదకొచ్చిన సునీల్ ఈ చిత్రంలో కృష్ణవరప్రసాద్‌గా నటించాడు. తల్లిదండ్రి లేని సునీల్ వాళ్ల పెద్దమ్మ (తులసి) పెదనాన్న (ముకేష్ రుషి) వద్ద పెరుగుతాడు. ఒక పగ కోసం చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోవాల్సి వస్తుంది సునీల్. కృష్ణాష్టమి రోజునే సునీల్‌ను ఫారిన్ పంపిచేస్తారు. అక్కడే చదివి.. వీడియో గేమ్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్న సునీల్‌కు మాత్రం ఎప్పుడు ఇండియా వచ్చేద్దామా..అనిపిస్తుంటుంది. ఏవేవో కారణాలు చెప్పి ముకేష్ రుషి వాయిదా వేస్తూ ఉంటాడు. ఈసారి సునీల్ ఆయన మాట వినకుండా ఇండియా బయల్దేరతాడు. సునీల్‌ను చంపడానికి అశుతోష్ రానా అండ్ టీం 18 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తుంది. ఎప్పుడు ఇండియా వస్తాడా చంపేద్దామా అన్నట్లు ఉంటారు. కానీ సునీల్ కొన్ని కారణాల వల్ల పేరు మార్చుకుని అశుతోష్ రానా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అసలు తనను ఎందుకు చంపాలనుకుంటున్నారో సునీల్ తెలుసుకుని...వారి మధ్య ప్రేమను పంచాలని వారి అలవాట్లను మార్చాలని...ఆ పగను ప్రేమగా మార్చాడానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమా స్టోరీ... చివరగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... అమెరికా నుండి వచ్చిన సునీల్ ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు ? అనేది ఈ సినిమా కథ.
నటీనటులు : సునీల్ హీరోగా నటించిన నాలుగు సినిమాలు ఒక ఎత్తయితే...ఈ ఐదో సినిమాలో మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని సునీల్‌ని చూడొచ్చు. చాలా స్టైలిష్‌గా సునీల్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. సునీల్ నటనతో పాటు ఫైట్స్, డ్యాన్సులతో అదరగొట్టాడు. ఎలాగూ కామెడీ టైమింగ్ ఉన్న హీరో కాబట్టి అక్కడక్కడ బాగానే నవ్వించాడు. ఇక నటీమణులు నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే వారి అందచందాలతో కుర్రకారును ఆకట్టుకున్నారు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ పాటల్లో మాత్రం గ్లామర్ షోతో అందాల కనువిందు చేశారు. ఇక విలన్ పాత్రలు పోషించే ముకేష్ రుషి..ఈ చిత్రంలో సునీల్ పెదనాన్నగా మంచి పాత్రలోనటించగా...సీనియర్ నటి తులసి పెద్దమ్మ పాత్రలో ఒదిగిపోయింది. అశుతోష్ రానా విలన్‌గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళి తనదైన శైలి కామెడీ పండించారు. సెల్ఫీబల్ఫీగా బ్రహ్మానందం ఏదో కాసేపు అన్నట్లుగా నవ్వించే ప్రయత్నం చేశారు. పవిత్రాలోకేష్, అజయ్ సహా మిగిలిన తారాగణమంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అతిధి పాత్రలో సుమన్ తళుక్కుమన్నారు.
సాంకేతిక నిపుణులు : ఈ చిత్రంలో సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే...ముందుగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించి చెప్పాలి. ఈ సినిమాకు చోటా కెమెరా పనితనం సూపర్బ్ అనిపించింది. ఫారిన్ లొకేషన్లను అద్భుతంగా చూపించడంలో చోటా కె నాయుడు మరోసారి నిరూపించుకున్నారు. దినేష్ కనకరత్నం అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపిస్తుంది. ఫైట్ మాస్టర్ అనల్ అరసు సునీల్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఫైట్స్ కంపోజ్ చేశారు. గౌతంరాజు ఈ సినిమాకి కాస్తంత ఎడిటింగ్ పని పెడితే బాగుండనిపిస్తుంది. ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్‌గా ఉన్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు.
దర్శకత్వం- విశ్లేషణ : నాగచైతన్యను ‘జోష్’గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాసు వర్మ సుమారు ఏడేళ్ల తర్వాత సునీల్ ‘కృష్ణాష్టమి’తో ముందుకొచ్చాడు. జోష్‌ను నిర్మించిన దిల్ రాజు..వాసు వర్మపై నమ్మకంతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించారు. ‘కృష్ణాష్టమి’ సంబంధించి స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంతో వాసువర్మ జస్ట్ ఓకే అనిపించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ టీం అందించిన ఈ కథకు వాసువర్మ తగిన న్యాయం చేయలేకపోయారు. అయినా కథ కూడా నాలుగైదు సినిమాలు మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రతి సీన్ ఏదో సినిమాలో చూసినట్టనపిస్తుంది. ఫస్టాప్‌లో కొంత స్లోగా ఉన్నా... సెకండాఫ్ మాత్రం స్పీడుగా ముగించారు. విజువల్‌గా బాగున్నా..కథలో విషయం లేనప్పుడు.. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేవనే చెప్పాలి. ప్రేక్షకుడికి రోటిన్ కాన్సెప్ట్‌లా ఉందనిపిస్తుంది. టోటల్‌గా సునీల్‌ని దృష్టిలో పెట్టుకుని.. కాసేపు ఎంజాయ్ చేద్దామనుకుంటే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా పర్వాలేదనిపిస్తుంది...
రేటింగ్ : 2.25/5
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment