ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ గురిపెట్టారు. జిల్లాలో పార్టీ పటిష్ఠంతోపాటు జగన సొంత జిల్లాలోనే వైసీపీ ప్రాధాన్యం తగ్గించడంపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తద్వారా జిల్లాలో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం లక్ష్యంగా వ్యూహం ఖరారు చేశారు.. ఇందులో భాగంగా ఈనెల 24 కడప వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొనే ఆయన.. ఆ రోజంతా కార్యకర్తలు, నాయకులతో భేటీ అవుతారు. అంతేకాదు నియోజకవర్గ ఇనచార్జ్‌లతో ముఖాముఖి మాట్లాడతారు.

ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అనుకూలతలు ప్రతికూలతలు తెలుసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా నేతలు, శ్రేణులకు లోకేష్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా జిల్లాలో పార్టీ బలోపేతానికి జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరికకు అడుగులు లోకేష్‌ వద్ద నుంచే పడ్డాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. లోకేష్‌ పర్యటన సందర్భంగా బద్వేల్‌ నియోజకవర్గ ఇనచార్జ్‌ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గతంలో ఒకమారు లోకేష్‌ జిల్లాలో పర్యటించి కార్యకర్తల సంక్షేమనిధిని పంపిణీ చేశారు. కడపలో పార్టీ కార్యాలయ భవనం ఏర్పాటుకు ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇంకా కడపై జిల్లాపై లోకేష్‌ ప్రత్యేక దృష్టి సారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కడప ఉక్కు పరిశ్రమ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఆయన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడుతున్నట్టు సమాచారం.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.