కుమార్తె సహా తెలుగుదేశంలోకి ఇంటిపై వైసీపీ జెండాలు మాయం మరో నలుగురి చేరికకు సంకేతాలు తిప్పికొట్టిన జగన్‌ వ్యాఖ్యలు ‘ఆకర్ష్‌’కు పదును పెట్టిన టీడీపీ, 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారి పేర్లు బయటపెట్టిన గంటలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది’ అని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన 48 గంటల్లోనే... ఆ పార్టీలో కలకలం మొదలైంది. వలసల కలవరం పతాక స్థాయికి చేరుకుంది. కర్నూలు జిల్లా వైసీపీలో ప్రధాన నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ‘సైకిల్‌’ ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలూ తెలుగుదేశంలో చేరే అవకాశముందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. శుక్రవారం నంద్యాలలో భూమా నాగిరెడ్డి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరికపై తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించినట్లు సమాచారం.

నంద్యాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే పార్టీ మారక తప్పదనే సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భేటీ ముగిశాక భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ వెంటనే... ఆళ్లగడ్డ, కర్నూలులో భూమా నివాసాలపై అప్పటిదాకా ఎగురుతున్న వైసీపీ జెండాలను ఆయన అనుచరులు తొలగించడం గమనార్హం. నిజానికి... నందమూరి బాలకృష్ణ కొంతకాలంగా భూమా నాగిరెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవి ఒక కొలిక్కి రావడంవల్లే వైసీపీని వదిలేందుకు భూమా సిద్ధపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో భూమా డిమాండ్లపై ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, భూమాకు మంత్రి పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో వలసపై నెలన్నర క్రితమే ‘ఆంధ్రజ్యోతి’ అంచనా వేసింది. జనవరి 6న జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో ఆదోని ప్రాంతానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిన తర్వాత... అప్రమత్తమైన జగన్‌ వారితో నేరుగా మాట్లాడి ‘జంపింగ్‌’లను తాత్కాలికంగా నిలువరించగలిగారు.

జగన్‌ వ్యాఖ్యలు బూమెరాంగ్‌..
‘‘21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే గంటలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతా’’ అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు బూమెరాంగ్‌ అయ్యాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టీడీపీ మంత్రులు, సీనియర్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. ‘మేం తలచుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ ఉండరు’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొనాళ్లుగా పట్టించుకోకుండా వదిలేసిన ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు పదును పెట్టారు. వైసీపీకి బాగా బలం ఉన్న కర్నూలు జిల్లాపై దృష్టి సారించారు. భూమాపై మీడియాలో వార్తలు రాగానే... జగన శిబిరం కలవరానికి గురైంది. వెంటనే భూమాతో మాట్లాడేందుకు జగన ప్రయత్నించినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు కూడా ఈ వ్యవహారంపై కల్లోలానికి గురయ్యారు. తమకు తెలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆరా తీశారు.

2019కు వైసీపీ ఖాళీ: పల్లె
వైసీపీ ఎమ్మెల్యేలను తాము చేర్చుకోవడం మొదలుపెడితే జగన టూలెట్‌ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. 2019 నాటికి వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన అధికారం కోసం కలలు కంటున్నారని..అవి పీడకలలే అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానంటున్న జగన్‌... ఇప్పుడు పులివెందులలో రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. జగన సైకో మనస్తత్వంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని, అందుకే తమ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని పల్లె వెల్లడించారు. జగనకు సీఎం సీటు కోసం కాదు... ఏ జైల్లో చోటు దొరుకుతుందో చూసుకోవాలని మంత్రి పల్లె ఎద్దేవా చేశారు.

స్టీరింగ్‌ డ్రైవర్‌ చేతిలో!
పార్టీ మారడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి అడిగినప్పుడు భూమా నాగిరెడ్డి ఔనని కానీ, కాదనికానీ చెప్పలేదు. ‘‘నేను హైదరాబాద్‌కు వెళ్తున్నా! ఉదయం నుంచి టీడీపీ నేతలు, వైపీసీ నాయకులు, మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో వేధిస్తున్నారు’’ అని తెలిపారు. హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌కు (వైసీపీ కార్యాలయం) వెళతారా అని ప్రశ్నించగా... ‘‘స్టీరింగ్‌ నా చేతుల్లో లేదు. డ్రైవర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎటు తీసుకువెళ్తే అటు వెళతా!’’ అంటూ తన సహజ శైలికి భిన్నంగా చమత్కార బాణం వదిలారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.