బాహుబలి 2 లో ఎంట్రీ ఇవ్వనున్న హాలీవుడ్ విలన్


తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టి... అత్యధిక వసూళ్ళను రాబట్టి తిరుగులేని ఘనవిజయం సాధించిన చిత్రం బాహుబలి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్నబాహుబలి-2 చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి వంటి చిత్రాలలో విలన్ గా నటించిన ʹనతన్ జాన్స్ʹ ప్రతినాయకుడికి పాత్ర పోషిస్తున్నాడనే వార్త ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. 
ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అటు అభిమానులతో పాటు... సినీ వర్గాలు కూడా బాహుబలి యూనిట్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2 డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక దిగ్గజం ʹరాజమౌళిʹ ప్లాన్ చేస్తున్నారు.

Post a Comment

Powered by Blogger.