ఆ తప్పు ఎప్పుడూ చేయను: మోహన్ బాబు
చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సీనియర్ యాక్టర్ మోహన్ బాబు అభిమానులతో ముచ్చటించారు. ముందుగా చెప్పినట్టుగా గురువారం ఉదయం ట్వీట్టర్ లో అందుబాటులోకి వచ్చిన మోహన్ బాబు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
అల్లరి నరేష్ తో కలిసి వర్క్ చేయటం ఎంతో ఆనందంగా ఉందన్న మోహన్ బాబు, 'ఈ జనరేషన్ హీరోలలో నా అభిమానులు నటులు మా అబ్బాయిలే. సరైన కథ దొరికితే లక్ష్మీతో కలిసి నటిస్తాను, కథ కోసమే ఎదురుచూస్తున్నాం. ముందుతరంలో ఎంతో మంచి నటులున్నారు, అప్పట్లో అలాంటి పాత్రలు కూడా ఉండేవి, నా సినిమాలన్నింట్లో బాగా నచ్చినవి చెప్పటం కష్టం. రాయలసీమ రామన్న చౌదరి, ఎమ్ ధర్మరాజు ఎమ్ ఎ లాంటి చిత్రాలు చాలా ఇష్టం. విద్యానికేతన్ ద్వారా ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాజకీయాల ద్వారా సేవ అసాధ్యం. నేను దర్శకత్వం వహించే తప్పు ఎప్పుడు చేయను'. అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
మోహన్ బాబు, అల్లరి నరేష్ లీడ్ రోల్స్ లో నటించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా కాలం తరువాత మీనా, రమ్యకృష్ణలు మోహన్ బాబుకు జంటగా నటించారు. కోటి సంగీతం అందించిన ఈ సినిమా సక్సెస్ పై చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
Post a Comment