నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి

నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి













నా స్నేహితురాళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యిపోయాయి అన్నారు నటి అనుష్క. ఆ విషయాన్ని ఆనందంగా అన్నారో, తనకింకా పెళ్లి కాలేదన్న చింతతో అన్నారో చూద్దాం. అనుష్క ఒకప్పుడు యోగా టీచర్. ఇప్పుడు గ్రేట్ యాక్ట్రెస్.అంతే కాదు చారిత్ర కథా చిత్రాలకు చిరునామా కూడా. అందాలను ఒలికించగలదు, వీరనారిగా కత్తి ఝుళించనూగలదు. నిజం చెప్పాలంటే ఇలాంటి నటీమణులు అరుదే అని చెప్పవచ్చు.నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ మూడు పదుల వయసు దాటిన బ్యూటీ ఇప్పటికీ ప్రముఖ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ జత కడుతూ నటిగా మెప్పిస్తున్నారు.


పాత్ర స్వభావాలకు తగ్గట్టుగా తన ఆకారాన్ని, హావభావాలను ప్రదర్శిస్తూ చాలా మంది ఇతర నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తున్న అనుష్క తన గతం వైపు తొంగి చూసిన వైనం చూద్దాం. నాగార్జున నన్ను సినిమా రంగానికి తీసుకొచ్చారు. ఎలాంటి సినీ నేపథ్యం లేని నాకు మొదట్లో నటించడం కష్టం అనిపించింది. నాగార్జుననే సినిమాకు సంబంధించిన మెళకువలు తెలిపారు.ఇప్పుడు నేను పరిణితి చెందాను.

మొదట్లో ప్రేమ,కుటుంబ కథా చిత్రాలు చేసినా ఆ తరువాత అరుంధతి,రుద్రమదేవి వంటి చారిత్రక కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగాను.అయితే యాక్షన్ హీరోయిన్‌గా నటించడం అంత సులభం కాదు.పోరాట సన్నివేశాల్లో ఎగరడం,దూకడం,పరిగెత్తడం వంటి చర్యలు కష్టం అనిపించక పోయినా ఆ తరువాత కాళ్ళు,చేతుల నొప్పులు భరించడం కష్టతరమే.యాక్షన్ హీరోల కష్టాలు నాకు ఇప్పుడర్థం అవుతున్నాయి.

ఇకపోతే రాజకీయాలు నాకు తెలియవు.ఆ రంగంపై ఆసక్తీ లేదు.వేరే మంచి విషయాలపై దృష్టి సారించాలని ఆశిస్తున్నాను.నా అందం గురించి అడుగుతున్నారు.ఇక్కడో విషయం చెప్పాలి.నా స్నేహితురాళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లంతా భర్త, పిల్లలు, కుటుంబం అంటూ జీవిస్తున్నారు. నన్ను చూసి నువ్వు ఇంకా చిన్న అమ్మాయిలానే అందంగా ఉన్నావు అంటుంటారు. నా అందానికి కారణం యోగానే. నా కంటూ భవిష్యత్ పథకాలంటూ ఏమీ లేవు. జీవిత పయనానికి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను అని అంది అందాల నగుమోము అనుష్క.

Post a Comment

Powered by Blogger.