ఆంధ్రా సీఎమ్ కిడ్నాప్డ్ - తెలంగాణ సీమ్ సస్పెక్టెడ్


ఆంధ్రా సీఎమ్ కిడ్నాప్ అవ్వడమేంటి ? అందులో తెలంగాణ సీఎమ్ ను అనుమానించడమేంటి ? ఇదంతా ఎప్పుడు జరిగింది ? ఎక్కడ జరిగింది ? రెండు రాష్ట్రాల విభజన జరిగి ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంటే ఈ లొల్లేంది ? అని తల బద్దలు కొట్టుకుంటున్నారా ? 
ఇది వివాదాల రారాజు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహత్యం. తన లేటెస్ట్ సినిమా కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ కాకముందే, తన తర్వాతి సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు. సినిమా టైటిల్ ʹఆంధ్రా సీఎమ్ కిడ్నాప్డ్ ʹ ట్యాగ్ లైన్ ʹతెలంగాణ సీఎమ్ సస్పెక్టెడ్ʹ ఈ విషయం ట్వీట్ చేసిన వర్మ అక్కడితో ఆగలేదు. బోని కపూర్ వాఖ్యలకు జవాబుగా బోనీ శ్రీదేవిని గౌరవిస్తున్న దానికన్నా తను ఎక్కువగా గౌరవిస్తానని వర్మ తెలిపాడు. 
గన్స్ అండ్ థైస్ పుస్తకంలో శ్రీదేవి గురించి ఒక చాప్టర్ ఉంటుందని, అదొక ప్రేమలేఖలా ఉంటుందని ఇటీవల వర్మ చేసిన వాఖ్యలపై బోనీ కపూర్ మండి పడ్డాడు. దీంతో వర్మ మరోసారి శ్రీదేవిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. బోని కపూర్ శ్రీదేవిను గౌరవిస్తున్న దానికన్నా తను ఎక్కువగా గౌరవిస్తానని వర్మ తెలిపాడు. ఈ విషయం ఒక్క శ్రీదేవి కి మాత్రమే తెలుసన్న వర్మ, గన్స్ అండ్ థైస్ పుస్తకంలో శ్రీదేవి మీదున్న ఆర్టికల్ ను బోని పూర్తిగా చదవాలని సలహ ఇచ్చారు. నన్ను విమర్శించే ముందు ఆ పని చేయాలంటూ వర్మ తన ట్విట్టర్ లో తెలియజేశారు.
శ్రీదేవి గురించి మాట్లాడిన వర్మ తన తర్వాతి సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆంధ్రా సీఎం కిడ్నాప్ అనే టైటిల్‌ను పెట్టి దానికి తెలంగాణ సీఎం సస్పెక్టెడ్ అనే ట్యాగ్ లైన్ ను తగిలిస్తారట. ఈ టైటిల్ పై ఎన్ని వివాదాలు చెలరేగుతాయో.

Post a Comment

Powered by Blogger.