అదిరెన్.. రజనీ స్టయిల్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిలే వేరు. వినూత్న గెటప్ లు, తనదైన స్టయిల్ తో అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ రోబో 2 చిత్రంలో రజనీకాంత్ సరికొత్తగా కనిపించనున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ కు ఫ్యాషన్ డిజైనర్ రాకీ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. రోబో 2 సెట్స్ పై రజనీకాంత్ తో దిగిన ఫొటోను రాకీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రజనీకాంత్ గళ్ల చొక్కా, జాకెట్ ధరించి.. చిన్న గడ్డం, మాంచి హెయిర్ స్టయిల్ తో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలోనే రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన సైంటిఫిక్ మూవీ రోబో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా రోబో 2 లో ఐశ్వర్యా రాయ్ బదులు ఎమీ జాక్సన్ రజనీ కాంత్ సరసన నటిస్తోంది. భారత చిత్ర పరిశ్రమలోనే 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు
Post a Comment