రోడ్ల‌పైకి రానున్న విస్కీతో న‌డిచే కార్లు



మ‌ద్యం మ‌త్తు మ‌నిషినే కాదు....వాహ‌నాల‌ను కూడా పెరిగెత్తిస్తుందంట‌. విస్కీతో న‌డిచే ఈ వాహ‌నాల్లో రోడ్డుపై త్వ‌ర‌లోనే విహ‌రించ‌వ‌చ్చు. స్కాట్లాండ్ శాస్త్ర‌వేత్త‌లు ఆ దిశ‌గా ముందుకు దూసుకుపోతున్నారు. విస్కీ త‌యారుచేసే స‌మ‌యంలో విడుద‌ల‌య్యే వ్య‌ర్ధాల ద్వారా ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన బ‌యో ఇంధ‌నంతో కార్ల‌ను న‌డుపొచ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సాధార‌ణంగా పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్ల ద్వారా విడుద‌ల‌య్యే కాలుష్యం కంటే ఇది చాలా త‌క్కువ‌ని అంటున్నారు. అంతేకాకుండా పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఈ ఇంధనం ద్వారా 60శాతం తగ్గిపోతుందంట‌.

Post a Comment

Powered by Blogger.