దిల్ వాలేః ఒక వైపు నిరసనలు, మరో వైపు కలక్షన్లు


షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయల కలక్షన్లు వసూలు చేసి బాజీరావు మస్తానీ ని మించి పోయింది. దేశంలో అసహనం ఉందన్న షారూఖ్ ఖాన్ మాటలకు వ్యతిరేకంగా ఒక వైపు హిందుత్వ వాదుల నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఆ సినిమా పై ప్రభావం ఏమీ చూయించలేక పోయాయి. దిల్ వాలేను ఎవ్వరూ చూడటం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ఫోటో షాప్ ప్రచారాలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన హీరో సినిమాను చూడటానికే మొగ్గు చూపారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి బీజేపీ నెత బాబూలాల్ గౌర్ షారూఖ్ ఖాన్ కు తన మద్దతు తెలిపారు . ఆయన దేశభక్తుడని హోంమంత్రి అన్నారు. దిల్ వాలే సినిమాకూడా చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు.

Post a Comment

Powered by Blogger.