గ్రాండ్‌గా నాన్నకు ప్రేమతో ఆడియో….!

Nannaku-Prematho-Movie-Audio-Release-Posters
నాన్నకు ప్రేమతో ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇది ఎన్టీఆర్ కు 25వ సినిమా కావడంతో తన నిర్మాతలందరినీ ఈ ఈవేడుకకు గెస్ట్‌లుగా పిలుస్తున్నాడు. ఇక తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అయిన రాజమౌళి, వీవీ వినాయక్ కూడా హాజరవుతారని సమాచారం. అలానే కృష్ణవంశీతో పాటు పూరీజగన్నాథ్ లను కూడా ఆహ్వానించారట. అయితే రాజమౌళీ, వినాయక్ మాత్రం వస్తున్నారని నిర్మాత ప్రసాద్ కన్ఫమ్ చేశాడు. ఇక నిర్మాతల్లో అందరినీ వ్యక్తిగతంగా పిలిచిన ఎన్టీఆర్, ప్రొడ్యూసర్ బండ్లగణేష్ కి మాత్రం ఫోన్ చేయలేదట. ఇద్దరికీ టెంపర్ సమయంలో బేదాభిప్రాయాలు వచ్చాయని టాక్. ఏదో చిన్న విషయం పెద్దగా మారడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందట. ఇక ఆయన సెట్ లో ఉంటే తాను ఉండనని ఎన్టీఆర్ హెచ్చరించారని…దాంతో గణేష్ సెట్ కి కూడా రాకుండానే టెంపర్ పూర్తైందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు సీన్ చూస్తుంటే అప్పట్లో వచ్చిన రూమార్స్ నిజమేననిపిస్తోంది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తికి ఈ ఆల్బమ్ ని డెడికేట్ చేయనున్నారు.  డైరెక్టర్ సుకుమార్, డీఎస్సీకి మధ్య ఉన్న బంధం గురించి చెప్పక్కర్లేదు. త్వరలో ఆయన్ని ఏకంగా హీరోగా పరిచయం చేస్తూ సినిమా కూడా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఆడియో వేడుకకు ముఖ్య అతిథి…హరికృష్ణ. అతనితో పాటు కళ్యాణ్ రామ్ కూడా రానున్నాడు. సంక్రాంతికి ఎట్టిపరిస్తితుల్లో రిలీజ్ చేయాలని రిలయన్స్ ఒత్తిడి చేస్తోంది. బాలయ్య సినిమా పోటీగా ఉన్నా సరే రిలీజ్ చేయాలని లేదంటే ఆరు కోట్ల మేర రేటు తగ్గించుకోవాలని షరతు పెట్టారట. పైగా సీడెడ్ లో బాలకృష్న భయానికి డిస్ట్రి బ్యూటర్ లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ హక్కులను కూడా రిలయన్సే దక్కించుకుందట. ఇలాంటి పరిస్థితులలో రిలయన్స్ చెప్పినట్లు వినక తప్పదు. ఎందుకంటే సంక్రాంతి సెలవుల్లోనే బిజినెస్ బాగుంటుంది. పోటీలో ఎవ్వరున్నా సరే మన సినిమా బాగుంటే నడుస్తుందని రిలయన్స్ ప్రతినిథులు చెప్పారు. దీంతో  బాబాయ్-అబ్బాయ్ ఫైట్ సంక్రాంతికి చూడబోతున్నాం. మరి ఏ పుంజు నిలబడుతుందో చూడాలి.

Post a Comment

Powered by Blogger.