ప్రకాశం: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తు.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమక్షంలోనే కొందరు టీడీపీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. కనిగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారానికి హాజరైన కేంద్ర మంత్రి.. నేతల మధ్య విభేదాలను చూసి అవాక్కయ్యారు. ఓ వర్గం నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. పామురు, పీసీపల్లి, కనిగిరి టీడీపీ ముఖ్యనేతలు సమావేశమై ఏఎంసీ చైర్మన్ ఒంటెద్దు పోకడలపై నిరసన వ్యక్తం చేశారు.

Post a Comment

Powered by Blogger.