పట్నా: ఈ నెల 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన మాట వాస్తవమేనని, అయితే మహిళను తాను వేధించలేదని బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పోలీసులకు చెప్పారు. కాగా ఇంతకుముందు తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత నిజం అంగీకరించారు.

17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఎమ్మెల్యేను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మరోసారి ఆయన్ను విచారించనున్నారు. జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Post a Comment

Powered by Blogger.