♦ తేలిపోయిన తెలుగుదేశం సాక్ష్యాల నాటకం
♦ మిథున్ కేసులో వీడియో ఫుటేజీలలో కనిపించని దాడి దృశ్యాలు..
♦ విమానాశ్రయంలో అన్ని వీడియోల ఫుటేజ్ బయటపెట్టాలి: వైఎస్సార్‌సీపీ

 తిరుపతి విమానాశ్రయ మేనేజర్‌పై చేయిచేసుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై బనాయించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దమ్ము, ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టండి అని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిస్పందన గానా అన్నట్లు టీడీపీ నేతలు కొన్ని వీడియో దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆ వీడియోలలో మిథున్‌రెడ్డి విమానాశ్రయ మేనేజర్‌పై దాడి చేసినట్లు గానీ, చేయిచేసుకున్నట్లుగానీ ఎలాంటి ఆధారాలూ లేవు. అసలు ఎంపీగానీ, మేనేజర్‌గానీ కనిపించడం లేదు.

విమానాశ్రయంలో ప్రయాణీకులు, సిబ్బంది ఒక్కచోట గుమిగూడినట్లు మాత్రమే ఆ ఫుటేజిలో కనిపిస్తోంది. బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోగా ప్రయాణీకులను మేనేజర్ దుర్భాషలాడడం, ఆ తర్వాత వారు ఎంపీ మిథున్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం, ప్రయాణీకులను వెంటబెట్టుకుని వెళ్లి మేనేజర్‌ను ఎంపీ ఈ విషయమై ప్రశ్నించడం వంటి దృశ్యాలేవీ ఆ వీడియో ఫుటేజీలో లేవు. అందుకే విమానాశ్రయంలోని అన్ని సీసీటీవీల ఫుటేజిని బైటపెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. తమకు బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోగా దుర్భాషలాడుతున్నారంటూ 20 మంది ప్రయాణీకులు  విమానాశ్రయ మేనేజర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినందునే ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు.

ప్రయాణీకుల తరఫున మేనేజర్‌ను నిలదీయగా ఎంపీనీ ఆయన దుర్భాషలాడారు. అందుకుగాను ఆ తర్వాత ఆయనే స్వయంగా ఎంపీకి క్షమాపణ కూడా చెప్పారు. విమానాశ్రయంలోని అన్ని సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలిస్తే ఈ వాస్తవాలు బైటపడతాయి. అది వదిలేసి తమకు కావలసినట్లు.. ఎడిటెడ్ ఫుటేజీని చూపించి అవే దాడి దృశ్యాలని చెప్పడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటిని బట్టి చూస్తే ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమంగా, అన్యాయంగా, రాజకీయ కక్షతోనే ఈ  కేసు బనాయించారని స్పష్టమవుతోంది.

ఈ ఆధారాలున్నాయా...?
⇒ సీసీ ఫుటేజీలలో చేయిచేసుకున్నట్లు ఎక్కడన్నా ఉందా?
⇒ ఆ వీడియోలు పూర్తిగా లేకుండా ఎందుకు ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి?
⇒ విమానాశ్రయంలోని అన్ని వీడియోలలో సీసీ ఫుటేజిని ఎందుకు బైటపెట్టడం లేదు?
⇒ స్పష్టంగా లేని కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు మీడియాకు చూపించి అవే ఆధారాలు అనే దుస్థితి అధికారపార్టీకి ఎందుకొచ్చింది?

 ఈ ప్రశ్నలకు జవాబుందా?
⇒ విమానాశ్రయంలో మేనేజర్ వంటి ఉన్నతాధికారిని ఎంపీ కొడితే ఆ విషయం అక్కడున్నవారికెవరికీ తెలియకుండా పోతుందా?
⇒ ఒకవేళ ఎంపీ చేయి చేసుకుని ఉంటే సీఐఎస్‌ఎఫ్ పోలీసులు అక్కడికక్కడే ఆయన్ను అరెస్టు చేసి ఉండేవారు కదా?
⇒ పక్కటెముకలు విరిగేంతగా మేనేజర్‌ను ఎంపీ కొడితే.. ఆ మేనేజర్ రాత్రి 8 గంటల వరకు డ్యూటీ ఎలా చేశారు?
⇒ మర్నాడు కూడా ఆ మేనేజర్ విధులకు ఎలా హాజరు కాగలిగారు?   సీమాంధ్రలోకెల్లా అత్యంత మెరుగైన ఆస్పత్రిగా పరిగణించబడుతున్న రుయా ఆస్పత్రిలో మేనేజర్‌ను పరీక్షించి ఇచ్చిన రిపోర్టు ఏమైంది?
⇒ నాలుగు రోజుల తర్వాత యశోదా వంటి ప్రయివేటు ఆస్పత్రికి మేనేజర్‌ను వైద్యపరీక్షల కోసం ఎందుకు పంపించారు?
⇒ మేనేజర్ సోదరుడు ఆ యశోదా ఆస్పత్రిలో పనిచేస్తున్నాడన్న విషయం నిజంకాదా?
⇒ అంటే అక్కడ తమకు నచ్చినట్లుగా వైద్య నివేదికను తయారు చేయించి తాము బనాయించిన తప్పుడు కేసును నిజం చేద్దామన్న తపన నిజంకాదా?
⇒ ఈ ప్రశ్నలకు జవాబులుంటేనే కదా వాటిని ఆధారాలుగా పరిగణించాల్సింది?.. వీటిని వదిలేసి ఏవో కొన్ని వీడియో క్లిప్పింగు లు విడుదల చేసి అవే ఆధారాలంటే ఎలా?
అసలు ఆధారాలంటే ఎలా ఉంటాయంటే..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విదేశీ విహారాలకు సంబంధించి అనేక ‘విశేషాలు’... సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో గత కొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. నారావారి వారసుడు నేషనల్ లెవెల్‌లో ప్రతిభ చూపడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్న సమయంలోనే ఆయన టాలెంట్ ఏమిటనేది విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసి పోయింది.  సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక ఫొటో సాక్ష్యాలలో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి.
1. ఒక చేతిలో మగువ మరో చేతిలో మందు గ్లాసు 
2. విదేశీ వనితతో ఆటపాటలు
3. ఆటలతో అలసిసొలసి రెండు భుజాలపై సేదదీరుతున్న ఇద్దరు భామలు
4. విదేశీ భామలతో స్విమ్మింగ్‌పూల్‌లో సయ్యాటలు

ఇవి కాదు ఆధారాలంటే...

Post a Comment

Powered by Blogger.