నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో సోమవారం ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఈ జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, తోడసం వంశానికి చెం దిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఖాందేవ్ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం వారు నెలరోజుల ముందే నువ్వుల నూనె ను ఇంటి వద్దే తయారు చేస్తారు. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు.

అలా సేకరించిన నూనెను గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశ ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి మొక్కు తీర్చుకుంది. రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాది మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుం దని వారి నమ్మకం. ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావ్ పాల్గొన్నారు. అయితే, ఈ ఆచారం 80 ఏళ్లుగా వస్తుందని, తోడసం వంశానికి చెందిన ఆడపడుచులు మూడేళ్లకు ఒకరు నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావు తెలిపారు.

Post a Comment

Powered by Blogger.