లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. వా డీల్ చిత్రం(ఇంకా విడుదల కాలేదు) ఫేమ్ రత్నశివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రెక్కై అనే పేరును నిర్ణయించారు. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఆరెంజ్ మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత బి.గణేశ్ తన కామన్‌మ్యాన్ ప్రెజెంట్స్ పతాకంపై నిర్మించినున్న తాజా చిత్రం రెక్కై. ఇది విజయ్‌సేతుపతి ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర కమర్షియల్ అంశాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు రత్నశివ.
ఇక పోతే ఇందులో నటి లక్ష్మీమీనన్ తన ఏజ్‌కు తగ్గ పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఆమె ఇప్పటి వరకూ తన వయసుకు మించిన మెచ్యూర్డ్ పాత్రలనే చేశారన్నారు. ఈ రెక్కై చిత్రంలో చాలా యంగ్ యువతిగా నటించనున్నారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటి జెనీలియా, లైలా వంటి బబ్లీ నాయికల కొరత ఉందన్నారు. తమ చిత్రంతో లక్ష్మీమీనన్ ఆ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి ధర్మదురై, ఆండవన్ కట్టళై చిత్రాలతో నటిస్తున్నారని, అవి పూర్తి అయిన తరువాత తమ చిత్రం ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.
Post a Comment