శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎయిర్ లిఫ్ట్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇలాంటి కథను ఎంచుకోవటంతో పాటు, తన నటనతో సినిమా స్థాయిని పెంచిన అక్షయ్ కుమార్ కు ప్రత్యేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సినిమా చూసిన తరువాత ఆరవ్ అన్న మాటలను అక్షయ్ భార్య, ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
' అమ్మా.. నాన్న తీరుతో బాధనిపిస్తోంది. ఆయన చాలా ఎక్కువగా కష్టపడుతున్నాడు' అని ఎయిర్ లిఫ్ట్ సినిమా చూశాకా తన కొడుకు కామెంట్ చేశాడు, అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ లో పేర్కొంది. అక్షయ్ కుమార్ సరసన నిమ్రత్ ఖౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాజా కృష్ణ మీనన్ దర్శకుడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఎయిర్ లిఫ్ట్ కు ప్రేక్షకుల నుంచి, విశ్లేషకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Post a Comment