పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వనించారు. పవర్ స్టార్ అంటే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. సాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. పునీత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ చక్రవ్యూహ ఆడియో రిలీజ్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిత్రయూనిట్.

ఈ ఆడియోకు ఎన్టీఆర్ ను ఆహ్వానించటం వెనుక మరోకారణం కూడా ఉంది. పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, ఓ పాట కూడా పాడాడు. ఇప్పటికే నాన్నకు ప్రేమతో సినిమాలో 'ఐ వన్నా ఫాలో ఫాలో' పాటతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న జూనియర్, కన్నడ ఇండస్ట్రీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న చక్రవ్యూహ ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా హజరవుతున్నాడు ఎన్టీఆర్.

Post a Comment

Powered by Blogger.