చిత్రపరిశ్రమలో ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను అక్షరాలా నిజం చేయబడుతోంది. స్థానిక తారలకు మొదట్లో సొంత గడ్డపై ఆదరణ ఉండదు. పరభాషల్లో పేరు తెచ్చుకున్న తరువాత వారి ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో చూస్తే నటి అంజలి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలకు తమిళంలో నాయికలుగా గుర్తింపు పొందిన తరువాతే తెలుగు చిత్రాలలో అవకాశాలు పెరిగాయన్నది నిజం.
అదే విధంగా తమిళ, మలయాళ నటీమణులు రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకు తమిళ నటి రెజీనానే తీసుకుంటే మొదట్లో ఇక్కడ కేడీబిల్లా-కిలాడీరంగా తదితర చిత్రాలలో నటించారు. ఈ తమిళంలో నటించిన చివరి చిత్రం రాజతందిరం. ఆమె నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినా రెజీనాకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తను టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అక్కడ నాయికగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కోలీవుడ్ కన్ను రెజీనాపై పడింది.
రెండు మూడు అవకాశాలు వరిస్తున్నాయి. వాటిలో ఒకటి దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రం. కాదల్‌కొండేన్, 7జీ బృందావన్ కాలనీ తదితర చిత్రాలతో వేగంగా దూసుకొచ్చిన ఈ సంచలన దర్శకుడు ఇటీవల వరుస ఫ్లాపులతో కాస్త తడబడ్డారు. తాజాగా ఒక హారర్ కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసేపనిలో ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. అదే విధంగా ఇందులో హీరోగా దర్శకుడు ఎస్‌జే.సూర్యను నటింప చేయనున్నట్లు. దీనికి దర్శకుడు గౌతమ్‌మీనన్ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.
Post a Comment