పాత్ర డిమాండ్ చేస్తే ఎలాగైనా మారిపోవడానికి సూర్య సిద్ధపడతారు. అందుకు చాలా నిదర్శనాలున్నాయి. ‘పేరళగన్’ అనే తమిళ చిత్రంలో గూనివాడిగా నటించారాయన. ‘గజిని’లో షార్ట్ టైమ్ మెమరీ లాస్ పాత్రలో ఒదిగిపోయిన వైనం గుర్తుండే ఉంటుంది. ఇక, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో టీనేజ్ కుర్రాడిలా, మధ్య వయస్కుడిలా, వృద్ధుడిలా మూడు షేడ్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు.

 ఇప్పుడు ‘24’ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారాయన. ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ‘టైమ్ ట్రావెల్’ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది నవంబర్‌లో పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ రోజులు పడుతుందట. ఇందులో సూర్య సైంటిస్ట్‌గా, అన్నాతమ్ముడిగా మూడు పాత్రల్లో కనిపిస్తారు. అలాగే ఒక చేతి గడియారానికి కూడా కీలక స్థానం ఉందట. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన రెండు పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. తాజా పోస్టర్ అయితే హాట్ టాపిక్ అయ్యింది.

Post a Comment

Powered by Blogger.