గాసిప్
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో బాగా వినపడే పేరు రెజీనా. రవితేజ, సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ వంటి హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ లేటెస్ట్‌గా ‘సౌఖ్యం’ చిత్రంలో గోపీచంద్ సరసన ఆడి... పాడారు. ఇప్పుడామె ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారని సమాచారం. అయితే, అది తెలుగు సినిమా కాదు. ‘ఖుషి’ చిత్రం ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.జె. సూర్య తమిళ చిత్రాల్లో హీరోగా నటిస్తుంటారు. ఇప్పుడాయన హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ఓ చిత్రం నిర్మించనున్నారట.
ఇందులో రెజీనాను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. ముందుగా తమిళ తెరపై మెరిసి, ఆ తర్వాత ‘ఎస్‌ఎమ్‌ఎస్’ చిత్రం ద్వారా రెజీనా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తమిళ చిత్రాలకు డేట్స్ కేటాయించలేనంతగా తెలుగులో బిజీ అయ్యారామె. ఇప్పుడీ తమిళ చిత్రానికి డేట్స్ ఇవ్వాలనుకోవడానికి కారణం క్రేజీ కాంబినేషన్. ఒక దర్శకుడితో మరో దర్శకుడు సినిమా తీయనుండటం, ఇంకో దర్శకుడు హీరోగా నటించనుండటంతో ఈ చిత్రం గురించి చెన్నయ్‌లో వాడి వేడిగా చర్చించుకుంటున్నారు.
Post a Comment