నటి హన్సిక బొమ్మలు అమ్మకానికి సిద్ధమయ్యాయి. హన్సిక చిత్రాలు అంటే ఆమె చిత్ర పటాలు అనుకునేరు. అవి ఆ ముద్దుగుమ్మ అందమైన హస్తకళా చిత్రలేఖనాలవి. హన్సిక మంచి నటి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం అయితే ఆమె చిత్రకారిణి ఉన్నారన్నది కొందరికే తెలుసు. హన్సికలో మెచ్చుకోదగిన మరో అంశం మంచి మానవతావాది. తన ప్రతి పుట్టినరోజున ఒక అనాథ పిల్లని దత్తత తీసుకుంటూ వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించారు. ఇప్పటికే 20 మందికి పైగా అనాథులను అక్కున చేర్చుకున్న హన్సిక షూటింగ్ విరామ సమయాల్లో వారితో గడుపుతూ ఆ పిల్లల్లో నూతనోత్సాహాన్ని క లిగిస్తుంటారు.

మరి కొంత సమయాన్ని తనలోని కళాతృష్ణకు కేటాయిస్తూ తన ఊహలకు రూపాలనిస్తూ చక్కని చిత్రలేఖనాలను గీస్తుంటారు. అలా పలు చిత్ర లేఖనాలను రూపొందించిన హన్సిక వాటినిప్పుడు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా వచ్చిన డబ్బును అనాథాశ్ర మాలకు అందించనున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఇటీవల తమిళనాడులో వరద బాధితులకు హన్సిక తన వంతు సాయం అందించారన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సుందర్.సీ దర్శకత్వంలో నటించిన త్వరలో విడుదల కానున్న అరణ్మణై-2 చిత్ర రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post a Comment

Powered by Blogger.