భారతీయ సినిమాలో పేరు మోసిన దర్శకుల్లో మణిరత్నం ఒకరని గంటాపథంగా చెప్పవచ్చు.అలాంటి దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం దక్కదా? అంటూ చాలా మంది ప్రముఖ నటీనటులు తపించేవారన్నది అవాస్తవం కాదు. ఇక జయాపజయాలన్నది ఎంతటి వారికైనా సహజం.అయితే ఆ మధ్య దర్శకుడు మణిరత్నంకు సరైన సక్సెస్‌లు రాలేదు.ఆ పరిస్థితిని ఓకే కణ్మణి చిత్రంతో అధిగమించారు కూడా. అయినా తదుపరి చిత్రం విషయంలో కాస్త జాప్యం జరగడం ఆయన అభిమానుల్ని నిరాశపరచే విషయమే. ఎందుకనో ఆయన తాజా చిత్రానికి నటీనటులు,ఇతర అంశాలు కాస్త చికాకు కిలిగించాయనే చెప్పాలి.
ఓకే కణ్మణి చిత్రం విజయోత్సాహంతో మణిరత్నం తదుపరి చిత్రాన్ని మల్టీస్టారర్‌తో భారీగానే ప్లాన్ చేశారు.అయితే అది కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. ఆ తరువాత అదే కథను యువ జంటలతో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.ఆ ప్రయత్నం ఫలించలేదు. మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్, నటి కీర్తీసురేష్ నటించడానికి అంగీకరించి అనూహ్యంగా చిత్ర ప్రారంభానికి ముందే వైదొలగి మణిరత్నంకు షాక్ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలతో వాయిదా పడుతూ వస్తున్న మణిరత్నం నూతన చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుందన్నది తాజా సమాచారం.
ఇందులో కార్తీ కథానాయకుడిగా నటించనున్నారు. నిత్యామీనన్ కథానాయకిగా ఇప్పటికే ఎంపికయ్యారు. దీనికి వెళ్లై పూక్కళ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో కార్తీకి జంటగా మలయాళ చిత్రం ప్రేమం కాథానాయకి సాయి పల్లవిని ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ప్రేమం చిత్రం చెన్నైలోనే 250 రోజులకు పైగా ప్రదర్శింపబడుతూ సంచలన విజయం సాధించింది.
ఇప్పుడీ చిత్రం తమిళం,తెలుగు భాషల్లో పునర్నిర్మాణం అవుతోంది కూడా. ఆ చిత్రంతో పెద్దగా ప్రాచుర్యం పొందిన నటి సాయి పల్లవి తమిళనాడుకు చెందినదేనన్నది గమనార్హం. నీలగిరి సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన సాయి పల్లవిని మణిరత్నం మాతృగడ్డకు పరిచయం చేయనున్నారన్న మాట.
Post a Comment