ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి

అంతర్జాతీయంగా మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ను 1946 డిసెంబర్ 10న ఏర్పాటుచేశారు.
General Knowledgeసాంఘిక, ఆర్థిక మండలిలో అంతర్భాగమైన ఈ కమిషన్‌లో 53 సభ్యదేశాలకు మూడేళ్ల పదవీకాలానికి సభ్యత్వముండేది. ప్రతి ఏటా 1/3 వంతు మంది పదవీ విరమణ చేసేవారు. మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణ కార్యకలాపాల నిర్వహణకు ఒక ఉప కమిషన్ పనిచేసేది. కమిషన్ పనితీరు అనేక విమర్శలకు గురవడంతో దాని స్థానంలో 2006 మార్చి 3న మానవ హక్కుల మండలి ఏర్పాటైంది. 

నిర్మాణంయూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. సర్వప్రతినిధి సభ వీరిని ఎన్నుకుంటుంది. సభ్యదేశాల పదవీకాలం మూడేళ్లు. రెండు పర్యాయాలకు మించి ఎన్నికయ్యేందుకు వీలుండదు. సభ్యదేశాల కేటాయింపు ప్రాంతాల వారీగా ఉంటుంది.
ఆఫ్రికా - 13
ఆసియా - 13
తూర్పు యూరప్ - 6
లాటిన్ అమెరికా, కరేబియన్ - 8
పశ్చిమ యూరప్, ఇతర గ్రూపులు - 7 

మానవ హక్కుల మండలి సర్వ ప్రతినిధి సభకు చెందిన ఉపసంస్థ. మానవ హక్కులు దుర్వినియోగం అయిన సభ్యదేశాలను తొలగించేందుకు సర్వప్రతినిధి సభకు అధికారం ఉంది. మానవ హక్కుల మండలి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మూడు సంత్సరాలకొకసారి యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపునిస్తుంది.

విధులు
  • అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేస్తుంది.
  • మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినపుడు భద్రతామండలి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించవచ్చు.
  • అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వివాదాలను మానవతా విలువలకు లోబడి మానవ హక్కులను గౌరవించి జాతి, మత, లింగ, వర్ణ భేదాలు చూడకుండా పరిష్కరానికి కృషిచేస్తుంది.

Post a Comment

Powered by Blogger.