మరో అవకాశం ఇవ్వడం మంచిదే!

మరో అవకాశం ఇవ్వడం మంచిదే!
ఆమిర్‌కు ఆఫ్రిది మద్దతు
కరాచీ: పాకిస్తాన్ జట్టులోకి మొహమ్మద్ ఆమిర్‌ను మళ్లీ ఎంపిక చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని ఆ జట్టు టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. ఆమిర్ నిజాయితీ వల్లే మరో అవకాశం దక్కిందని, దానికి అతను అర్హుడని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ‘గతాన్ని మనం మరచిపోతే మంచిది. ఆమిర్‌కు నేను పూర్తి మద్దతు పలుకుతున్నా. అతను తిరిగి రావడం పట్ల సంతోషంగా ఉన్నా. పట్టుదల, అంకితభావంతో ఆమిర్ ఈసారి పాక్ క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నా.

ఇతర ఆటగాళ్లలాగా అబద్ధాలు చెప్పకుండా తన తప్పును అతను కోర్టు, ప్రజల ముందు ఒప్పుకున్నాడు కాబట్టే మరో అవకాశం లభించింది’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు.

పాక్ దేశవాళీలో పింక్ బాల్...
పాకిస్తాన్ తమ ఫస్ట్‌క్లాస్ టోర్నీ ఖైద్-ఎ-ఆజమ్ ట్రోఫీ నాలుగు రోజుల ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా గులాబీ బంతిని ఉపయోగించాలని నిర్ణయించింది. ఎస్‌ఎన్ గ్యాస్ పైప్‌లైన్స్, యునెటైడ్ బ్యాంక్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టులో తలపడనున్న పాకిస్తాన్ అందుకు సన్నాహకంగా పింక్ బంతిని వాడుతోంది.

Post a Comment

Powered by Blogger.