హైదరాబాద్ :  గ్రేటర్ ప్రజలకు అధికార టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపించిందని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఎద్దేవా చేశారు.  జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బలహీన వర్గాలు అంటే ఎంపీ కవితకు చిన్నచూపు అని ఆరోపించారు.
మేకప్ ప్యాకప్ అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కవిత అవమానించారని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలో పవన్ కల్యాణ్ సేవలు అవసరం అని దానం చెప్పారు.  ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 

Post a Comment

Powered by Blogger.