న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి  ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ  బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోనియాగాంధీ  తరఫున వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. సోనియా కోరితే ఆ కేసును వాదించేందుకు సిద్ధమని రాంజెఠ్మాలనీ ప్రకటించడం ఆసక్తిని రేపింది.

సోనియాగాంధీ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టవేసిన అనంతరం జెఠ్మలానీ ఈ  అసాధారణ ప్రకటన చేశారు. ఈమేరకు డిసెంబర్ 11 న   సోనియాకు ఒక లేఖ రాశారు. సోనీయా గాంధీ , రాహుల్  గాంధీ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానన్నారు.   ఈకేసులో వారి ప్రమేయం ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు బనాయించారని  ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సమర్ధవంతమైన  న్యాయవాదులు వున్నారనీ, అయినా తాను  ఎలాంటి   రుసుం తీసుకోకుండా వారిని తరపున వాదించడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో మాజీ బీజేపీ నేత,  వివాదాస్పద న్యాయవాది   జెట్మలానీ ఆఫర్ కు సోనియా ఎలా   స్పందిస్తారో  చూడాలనే చర్చకు తెర లేపింది.

Post a Comment

Powered by Blogger.