ఎంపీ కవితకు బుల్లెట్ప్రూఫ్ వాహనం

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ప్రూఫ్ వాహనం సమకూర్చింది. భద్రతా కారణాల రీత్యానే కవితకు వాహనం కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువకావడం, పైగా ఆమెకు వారి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలనుంచి సమాచారం రావడంతో ఆమె భద్రతను అధికారులు సమీక్షించారు. కవిత సీఎం కుమార్తె.., పార్లమెంటు సభ్యురాలు కూడా కావడంతో సెక్యూరిటీ విభాగం భద్రతను కట్టుదిట్టం చేసింది.click here to watch


Post a Comment

Powered by Blogger.