భవిష్యత్తు వైఎస్ జగన్‌దే

భవిష్యత్తు వైఎస్ జగన్‌దే
♦ ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు
♦ ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా
♦ ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు వెల్లడి
♦ దాసరితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తు జగన్‌దే’’ అని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దాసరి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం దాసరి మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్న జగన్‌కు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పారు.

Post a Comment

Powered by Blogger.