ఫేస్‌బుక్‌లో అమరుడిపై వ్యాఖ్యలు.. అరెస్టు

ఫేస్‌బుక్‌లో అమరుడిపై వ్యాఖ్యలు.. అరెస్టులెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్
కోజికోడ్ : పఠాన్‌కోట్‌లో వీరోచితంగా పోరాడి అమరుడైన ఎన్‌ఎస్‌జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ ఈకే నిరంజన్ గురించి ఫేస్‌బుక్‌లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేరళలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అన్వర్ సాదిఖ్ (24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెవయూర్ పోలీసులు తెలిపారు. అతడు నకిలీ పేరుతో ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసుకున్నాడని, మధ్యమం అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు చెప్పాడని అన్నారు. అయితే తమ పత్రికలో అలాంటివాళ్లు ఎవరూ లేరని పత్రిక వర్గాలు తెలిపాయి. దాంతో పోలీసులు విచారణ జరిపి, సాదిఖ్‌ను అరెస్టు చేశారు.

అతడు ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని, అయితే తాను చేసింద నేరమన్న విషయం తనకు తెలియదని అతడు చెబుతున్నాడని చెప్పారు. ఫేస్‌బుక్‌లో సాదిఖ్ చేసిన వ్యాఖ్యలు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌ను అవమానించేలా ఉన్నాయి. వీటితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.

Post a Comment

Powered by Blogger.