విశాఖ: నగరంలో ఆదివారం ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సు కు హాజరైన అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కాలుజారి పడిపోబోయారు. భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో ప్రతాప్ రెడ్డి కాలు పట్టుతప్పడంతో కిందికి పడబోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను పట్టుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
'సన్ రైజ్ స్టేట్ ఆఫ్‌ ఏపీ ఇన్వెస్టర్స్ మీట్' పేరుతో విశాఖలోని హార్బర్ పార్కు సమీపంలోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుపీయూష్ గోయల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Post a Comment

Powered by Blogger.