ఈ వారం యు ట్యూబ్ హిట్స్

 ది కన్‌జ్యూరింగ్ 2 : ట్రైలర్
 నిడివి : 2 ని 32 సె.
 హిట్స్ : 28,90,913

 అతీంద్రియ శక్తుల హారర్ ఫిల్మ్ ‘ది కన్‌జ్యూరింగ్’ విడుదలైన మూడేళ్ల తర్వాత దాని సీక్వెల్‌గా వస్తున్న ‘ది కన్‌జ్యూరింగ్ 2’ చిత్రం ట్రైలర్ ఇది. మూవీ 2016 జూన్ 10న విడుదలవుతోంది. లండన్‌లోని ఎన్‌ఫీల్డ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో దెయ్యాల జాడను కనిపెట్టేందుకు బయల్దేరిన  హీరో హీరోయిన్‌కీ, మరో ఇద్దరు అధ్యయనవేత్తలకు ఎదురైన అనుభవాలు ఎంత థ్రిల్లింగ్‌గా  ఉంటాయో శాంపిల్‌గా ఈ వీడియోలో చూడొచ్చు.

 అన్‌వాంటెడ్ గెస్ట్
 నిడివి : 36 సె.
 హిట్స్ : 12,86,179

 వేదికల మీద అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇది. లాస్ ఏంజెలెస్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్‌లో ‘ది టాక్’ షో లేడీస్ టీమ్.. ‘ది పీపుల్ చాయిస్ అవార్డ్స్ 2016’ తీసుకునే సందర్భంలో ప్రసంగం ఇస్తుండగా హఠాత్తుగా ఒక యువకుడు వేదికపైకి చొరబడి, టాక్ షో హోస్ట్ చేతిలోంచి మైక్ లాగేసుకుని తను మాట్లాడ్డం మొదలు పెట్టాడు. కో హోస్ట్ షారన్ వెంటనే అప్రమత్తమై అతడిని అక్కడినుంచి పంపేశారు.

Post a Comment

Powered by Blogger.