టీమిండియా ఒక వన్డేలో గెలిచినా..
దుబాయ్:ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో ఇరు జట్లు సిరీస్ ను కోల్పోయినా వారి వారి ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. ఈ సిరీస్ లో ఆసీస్ ఐదు వన్డేలను కోల్పోయినా ర్యాంకింగ్స్ లో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం 127 పాయింట్లతో ఉన్న ఆసీస్ మొత్తం మ్యాచ్ ల్లో ఓటమి పాలైనా టీమిండియా కంటే ఒక పాయింటు ఎక్కువగానే ఉండి తొలి స్థానంలో నిలుస్తుంది. మరోపక్క  114 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో ర్యాంకును నిలుపుకోవాలంటే కనీసం ఒక వన్డేలో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ టీమిండియా మాత్రం మొత్తం మ్యాచ్ లను ఓడిపోయిన పక్షంలో నాల్గో ర్యాంకుకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ముగ్గురు భారత ఆటగాళ్లు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-10 లో కొనసాగుతుండటం విశేషం. విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోని,శిఖర్ ధవన్ వరసుగా ఆరు, ఏడు స్థానాలో ఉన్నారు. ఇరు జట్ల పరంగా చూస్తే కోహ్లి మెరుగైన ర్యాంకింగ్స్ లో ఉండగా, ప్రస్తుతం ఉన్న ఆసీస్ జట్టు మొత్తంగా చూస్తే మ్యాక్స్ వెల్ 10వ స్థానంలో ఉన్నాడు.

Post a Comment

Powered by Blogger.