కాన్ బెర్రాలో బుధవారం ఆసీస్ తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ ఓడినప్పటికీ భారత జట్టుతో పాటు ఆటగాళ్లు కొన్ని రికార్డులు నమోదు చేసుకున్నారు.
మ్యాచ్ హైలైట్స్:
ఇన్నింగ్స్ స్కోరు 250 పరుగుల తర్వాత రెండో వికెట్ కోల్పోయిన జట్టు ఆలౌట్ అవ్వడం ఇది రెండోసారి. రెండుసార్లు ఆలౌటయిన జట్టు భారత్
వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో మూడు వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేసిన శిఖర్ ధావన్(72 ఇన్నింగ్స్). విరాట్ కోహ్లీ(75 ఇన్నింగ్స్)ను అదిగమించాడు. హషీ ఆమ్లా(57), వివ్ రిచర్డ్స్(69) తర్వాత ఓవరాల్ గా మూడో ఆటగాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 25 సెంచరీలు కొట్టిన బ్యాట్స్ మన్ కోహ్లీ(162 ఇన్నింగ్స్). ఇంతకుముందు ఈ రికార్డు సచిన్(234 ఇన్నింగ్స్) పేరిట ఉండేది.
2012 తర్వాత ఓ జట్టుపై రెండో వికెట్ కు వరుసగా నాలుగు వన్డేల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం భారత్ కి ఇది తొలిసారి.
1985-86లో సునీల్ గవాస్కర్ తర్వాత ఆసీస్ పై వరుసగా నాలుగు వన్డేల్లో 50, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్ కోహ్లీ
ఆసీస్ జట్టుపై తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసి న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది.
ఆస్ట్రేలియా జట్టుతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా గతంలో సచిన్ నెలకొల్పిన 357 పరుగుల రికార్డును నాలుగు వన్డేల్లోనే కోహ్లీ బద్దలు కొట్టాడు
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా రెండో సెంచరీ చేయడంతో వీవీఎస్ లక్ష్మణ్, గ్రేమ్ హిక్, రోహిత్ ల సరసన నిలిచిన కోహ్లీ
వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రయిక్ రేట్ రికార్డును మాక్స్ వెల్(125.22 స్ట్రయిక్ రేట్) సాధించాడు
Post a Comment