అవకాశాలనే కాదు వరుస విజయాలను అందుకుంటున్న యువ నాయకి శ్రీదివ్య. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని పక్కన పెట్టి తమిళ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నాయకిగా కొనసాగుతోంది. వరుత్తపడాద వాలిబర్‌సంఘం చిత్రంతో విజయాలను నాంది పలికిన ఈ బ్యూటీ తాజాగా విడుదలైన ఈటీ చిత్రం వరకు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది.
 
  తాజాగా ఆర్య, రానా, బాబీసింహలతో కలిసి నటించిన బెంగళూర్ నాట్కళ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీకి జంటగా కాష్మోరా చిత్రంలో నటిస్తోంది. శ్రీదివ్యను ఏక కాలంలో విజయ్, అజిత్‌లతో నటించే అవకావమం వస్తే తొలి చాయిస్ ఎవరికి ఇస్తారూ? అన్న ప్రశ్నకు ఏలాగోలా ఇద్దరితో నటించాలని కోరుకుంటాను అని తెలివిగా బదులిచ్చింది.
 
 ఇంకా మాట్లాడుతూ అజిత్‌కు తాను సెట్ అవుతానా అన్నది  తెలియదనీ, ఇంతకు ముందే వేదాళం చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. అయితే అజిత్‌తో హీరోయిన్‌గా రొమాన్స్ చేయాలని ఆశపడే తాను ఆయనకు చెల్లెలిగా నటించడానికి ఎలా ఒప్పుకుంటానని, అందుకే ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు శ్రీదివ్య చెప్పింది.

Post a Comment

Powered by Blogger.