హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన యాన రంగంలో ఉన్న టైగర్‌ఎయిర్ మరో రెండు సర్వీసులను భారత్ నుంచి సింగపూర్‌కు నడుపనుంది. ప్రస్తుతం భారత్‌లోని ఆరు నగరాల నుంచి వారానికి 44 సర్వీసులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్య హైదరాబాద్, తిరుచిరాపల్లి నగరాలకు ఒక్కో సర్వీసును జోడిస్తోంది.
దీంతో మొత్తం సర్వీసుల సంఖ్య హైదరాబాద్-సింగపూర్ మధ్య ఏడు, తిరుచిరాపల్లి-సింగపూర్ మధ్య 14కు చేరుకుంటాయి. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు రానుపోను రూ.11.599 నుంచి టికెట్స్‌ను టైగర్‌ఎయిర్ ప్రకటించింది. బుకింగ్ కాలం జనవరి 20 నుంచి 31. ప్రయాణ తేదీలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16.

Post a Comment

Powered by Blogger.